• Contact us
  • Privacy Policy
  • Disclaimer
  • About Us

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Rachabanda
  • About Us
  • Sitemap
  • More
    • Vedas
    • Bible
    • SL Wuss V2
    • SL Wuss V3
    • SL Super Fast

Recent Acticles

Home » Uncategories » ప్రపంచ దేశాల కొరకు “అహ్మద్” రాబోవుచున్నాడు! : బైబిల్ ఉద్ఘాటన!! | "Ahmad" is coming for world countries! : Emphasis on the Bible !! : Md Nooruddin

ప్రపంచ దేశాల కొరకు “అహ్మద్” రాబోవుచున్నాడు! : బైబిల్ ఉద్ఘాటన!! | "Ahmad" is coming for world countries! : Emphasis on the Bible !! : Md Nooruddin

Posted by Sakshyam Magazine on Monday, December 31, 2018

And I will shake all nations, and the HAMADA [AHMAD] shall come for the all nations; and I will fill this house with glory, says the Lord of hosts. Mine is the silver, mine is the gold, says the Lord of hosts, the glory of my last house shall be greater than that of the first one, says the Lord of hosts; and in this place I will give Shalom [ISLAM], says the Lord of hosts" -Haggai 2: 7-9

హెబ్రూ మూలం నుండి అనువాదం చేయబడిన పై హగ్గయి 2:7-9 లేఖనం యొక్క సరైన తెలుగు అనువాదం ఏమిటంటే-

“నేను సకల దేశములను కదిలించుదును మరియు సకల ప్రపంచ దేశాల కొరకు (హమద్) అహ్మద్ రాబోవుచున్నాడు;  నేను ఈ మందిరమును మహిమతో నింపుదును; ఇదే సైన్యములకు అధిపతి అయిన యెహోవా వాక్కు. వెండి నాది, బంగారు నాది, ఇదే సైన్యములకు అధిపతి అయిన యెహోవా వాక్కు. ఈ మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుప ననుగ్రహించెదను; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు”    – హగ్గయి 2: 7-9

కల్దీయుల ద్వారా ఎంతో ఘనత కలిగిన సోలోమోను మందిరం కూల్చబడి, ఇశ్రాయేలీయులు వారి దేశం నుండి బహిష్కరించబడి, బాబిలియన్ల ద్వారా ఇశ్రాయేలీయులు చెరపట్టబడిన తరువాత దాదాపు డబ్భై సంవత్సరాల అనంతరం తిరిగి  ఇశ్రాయేలీయులకు వారి దేశంలో రావటానికి మరియు కూల్చబడ్డ సోలోమోను మందిరాన్ని తిరిగి కట్టటానికి దేవుని తరఫున అవకాశం మరియు అనుమతి లభించినప్పుడు సకల ఇశ్రాయేలు జనాంగం విపరీతమైన ఆనందడోలికలలో మునిగిపోతుంది. అయినప్పటికి ఒకనాటి సోలోమోను మందిర ఘనతను కళ్ళారా చూసి ఉన్న ఇశ్రాయేలీయులలో పెద్దలు దానిని తలచుకుంటూ విపరీతమైన దుఖంలో మునిగిపోయి ఉన్నప్పుడు, దుఖంతో నిండి ఉన్న వారి మనస్సులకు స్వాంతన చేకూర్చటానికి  విశ్వనాయకుడైన ఓ మహాప్రవక్తను గూర్చిన శుభవార్తను అందజేస్తూ ప్రవక్త హగ్గయి ద్వారా వాగ్దానం చెయ్యబడిందే పై లేఖనం.

వాస్తవానికి ప్రవక్త హగ్గయి ద్వారా చెప్పబడిన పై లేఖనంలో అత్యంత గమనార్హమైన వాక్యభాగాలను మరింత వివరంగా హెబ్రూ మూలంతో సహా పరిశీలిద్దాం.

1.“Wehir ‘asti et kal hag-gowyim” – “And I will shake all nations” – “నేను సకల దేశములను కదిలించుదును”

2.“uba’u HAMADA hoggowyim umil leti” – “HAMADA shall come for the all nations” – “సకల ప్రపంచ దేశాల కొరకు అహ్మద్ రాబోవుచున్నాడు” 

“ఉబావు హమద హగోయిమ్ ఉమిల్ లెతి”  అన్న హెబ్రూ వాక్యభాగానికి-

“HAMADA of all nations will come” లేదా “HAMADA shall come for the all nations” రెండూ సరైన అనువాదాలే! అయితే హెబ్రూ మూలంలో ఉన్న “HAMADA” అన్న పదాన్ని “Desire” అని KJV ఇంగ్లీష్ బైబిల్లో అనువాదం చెయ్యబడింది. ముందుగా గమనించాల్సిన విషయం ఏమిటంటే- “హమద” మరియు "అహ్మద్" అన్న పదాలకు  హ.మా.ద (hmd) అన్నది ఒకే ధాతువు కలిగి ఉంది అన్నది. హెబ్రూలో “హమద” అన్న పదాన్ని “అత్యధికంగా కాంక్షించబడేది లేదా కోరుకోబడేది (Desired)” అన్న అర్థం వస్తుంది. అరబ్బీలో "హామద్" అన్న పదానికైతే అయితే “అత్యధికంగా ప్రశంసించబడేవాడు (praised one)” అన్న అర్థం వస్తుంది. కాబట్టి “HAMADA of all nations will come” అన్న పదాన్ని KJV ఇంగ్లీష్ బైబిల్లో “The desire of all nations will come” అని అనువాదం చెయ్యబడింది. దీని అంతరార్ధం- “ప్రపంచ ప్రజల ద్వారా అత్యధికంగా కోరుకోబడేవాడు (The desired one) రాబోవుచున్నాడు” అన్నది. New International Version బైబిల్లో అయితే ఇదే విషయాన్ని “and what is desired by all nations will come” అని అనువదించటం జరిగింది. “హమద్” అన్న హెబ్రూ పదం యొక్క శబ్దం అరబ్బీలో అయితే “అహ్మద” అని వస్తుంది. అలాగే పరమగీతం 5:16 వాక్యభాగంలో “ముహమ్మదిమ్” అన్న పదానికి “అతి కాంక్షనీయుడు” అని అనువదించటం జరిగింది. ఈ పదం యొక్క శబ్దం అరబ్బీలో అయితే “ముహమ్మద్” అని వస్తుంది. అరబ్బీలో “ముహమ్మద్” అన్న పేరుకు మరోక రూపమే (another form) “అహ్మద్” అన్న విషయం గమనించాలి. అరబ్బీలో “ముహమ్మద్” అన్న పదానికి అర్థం- “అత్యధికంగా ప్రశంసించబడేవాడు” అన్నది. ప్రజలచే అత్యధికంగా ప్రశంసించబడేవాడు ఎవరు కాగలరు? వారిచే ఎక్కువగా కోరుకోబడేవాడేవాడు (desired person) మాత్రమే కాగలడు! ఈ వివరణను దుష్టిలో పెట్టుకుంటే -  “HAMADA shall come” అన్న పదానికి నిస్సందేహంగా “అహ్మద్ రాబోవుచున్నాడు” అన్న అర్థం వంద శాతం సరిపోతుందనటంలో ఏ మాత్రం సందేహం లేదు.

ఇదే శుభవార్తను యేసు సైతం ప్రకటించారన్న విషయాన్ని ముహమ్మద్ (స) ప్రవక్తా? కాదా? అన్న సందేహం లేవనెత్తబడినప్పుడు ఆనాటి యూద, క్రైస్తవ పండితుల సమక్షంలో ఈ క్రింది ఖురాన్ వాక్యంలో  చెప్పటం జరిగింది. 

“మర్యం కుమారుడైన ఈసా (యేసు) అనిన మాటలను జ్ఞాపకం తెచ్చుకో- నా తరువాత అహ్మద్ అనే ప్రవక్త రాబోతున్నాడు” -  ఖురాన్ 61:6

పై వాక్యం ప్రవక్త ముహమ్మద్ (స) ఈ లోకం నుండి వెళ్లిపోయాక అవతరించలేదు! లేక పై వాక్యాన్ని ప్రవక్త ముహమ్మద్ (స) తనను నమ్మే కొందరు శిష్యుల మధ్య కూర్చుని తనకు అనుకూలమైన వాతావరణంలోనూ ప్రకటించలేదు! ఎదోలా ప్రవక్త ముహమ్మద్ (స) ను అబద్ధ ప్రవక్త అని నిరూపించటానికి అటు అరబ్బు తిరస్కారులూ, ఇటు యూద-క్రైస్తవ పండితులు కంకణం కట్టుకుని ఏ చిన్న అవకాశం దొరికినా చాలని ఎదురు చూస్తున్న సమయంలో ప్రవక్త ముహమ్మద్ (స) వారి సమక్షంలో బహిరంగ సమాజంలో నిలబడి “ఈసా ఈ విధంగా ప్రకటించాడు- నా తరువాత అహ్మద్ అనే ప్రవక్త రాబోతున్నాడు” అన్న వాక్యాన్ని చదివి వినిపించారు. నిజంగా అప్పటి ఇంజీల్ గ్రంధంలో యేసు అలా ప్రకటించినట్టు లేకపోయి ఉంటే ఈనాటి క్రైస్తవ పాస్టర్ల కంటే అప్పటి యూద పండితులు నా నా భీబత్సం చేసేసి ఉండేవారు. నిజంగా అప్పటి ఇంజీల్ గ్రంథంలో ప్రవక్త ముహమ్మద్ (స) వారి గురించి యేసు ఇచ్చిన సాక్ష్యం వ్రాయబడి ఉండకపోతే ఇంజీల్ గ్రంధాన్ని ప్రజల మధ్య బహిరంగంగా చదివి వినిపించినా చాలుకదా ఆనాటి యూద-క్రైస్తవ పండితులకు ప్రవక్త ముహమ్మద్ (స) ఓ అబద్ధ ప్రవక్త అని నిరూపించటం ఎంతో తేలికైన పని అయిపోతుంది.  కానీ యేసు, తన తరువాత “అహ్మద్” రాబోతున్నాడని చెప్పిన  విషయం వారి ఇంజీల్ గ్రంధంలో అప్పటికే  ఈ క్రింది విధంగా వ్రాయబడి ఉంది.

“నేను వెళ్లిపోవుట వలన మీకు ప్రయోజనకరము; నేను వెళ్లనియెడల ఆదరణకర్త మీయొద్దకు రాడు నేను వెళ్ళిన యెడల ఆయనను మీ యొద్దకు పంపుదును” – యోహాను 16:7

ఇదే విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ (స) ఖురానులో ఈ క్రింది విధంగా జ్ఞాపకం చేశారు-

“మర్యం కుమారుడైన ఈసా ఈ విధంగా ప్రకటించాడు- నా తరువాత అహ్మద్ అనే ప్రవక్త రాబోతున్నాడు” -  ఖురాన్ 61:6

ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ అని ఈనాటి పాస్టర్లు చేస్తున్న గోల ఆనాటి యూదు పండితులకు తెలియదు! ఎందుకంటే “అహ్మద్” అని అప్పటికి వ్రాయబడి ఉన్న పదాన్ని తరువాతి కాలాల్లో “పెరక్లిటోస్” అని మార్చి, ఆ పదాన్ని అనేక అనువాదాల్లో అనేక పదాలతో పాటు తెలుగు అనువాదకులు “ఆదరణకర్త” అన్న క్రొత్త పదాన్ని కనిపెట్టారు కాబట్టి. నిజానికి "పెరాక్లిటోస్" అన్న పదానికి అర్థం సైతం - "ప్రజల సంక్షేమాన్ని కాంక్షించేవాడు" అని. ఖురాన్, ప్రవక్త ముహమ్మద్ (స) ను "ప్రపంచ మానవులందరికీ కారుణ్యం (21:107)" అని కీర్తిస్తుంది. ఈ విధంగా ఆనాడే ఇంజీల్ లో "అహ్మద్ అనే ప్రవక్త రాబోతున్నాడు” అని వ్రాయబడి ఉందన్న విషయం బహిర్గతం చెయ్యబడటమే తరువాయి  ప్రజలు తండోపతండాలుగా ఇస్లాం ను స్వీకరించి ముహమ్మద్ (స) ను దైవ ప్రవక్తగా అంగీకరించటం జరిగింది.

“I will shake all nations” (నేను సకల దేశములను కదిలించుదును)!

సకల దేశాలు కదిలించబడటం అంటే ఏమిటి? ఎందుకు కదిలించబడతాయి? అన్నది తెలుసుకోవాలంటే ఈ క్రింది లేఖనాన్ని చదవాల్సిందే.

“Nations come to your light, and kings to the brightness of your rising” – Isaiah 60:3

“దేశములు నీ వెలుగు కొరకు వచ్చును; రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదరు” – యెషయా  60:3

“Nations” దేశములు అన్న పదాన్ని తెలుగు బైబిల్లో ఏమాత్రం పొంతన లేని విధంగా “జనములు” అని అనువాదం చెయ్యటం జరిగింది.  ఇంతకూ సకల దేశాల ప్రజలు, రాజులు “నీ వెలుగునకు వచ్చేదరు అని చెబుతుంది ఎవరి గురించి? ఆయన ఏ ప్రాంత వాసి? అన్నది తెలియాలంటే పై లేఖనానికి కొనసాగింపుగా ఈ క్రింది లేఖనాన్ని చదవగలరు.

“నీవు చూచి ప్రకాశింతువు నీ గుండె కొట్టుకొనుచూ ఉప్పొంగును సముద్రవ్యాపారములు నీ వైపు త్రిప్పబడును జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. ఒంటెల సమూహము మిద్యాను ఏఫాయెముల లేత ఒంటెలును నీ దేశము మీద వ్యాపించును వారందరూ షేబ నుండి వచ్చేదరు బంగారమును ధూప ద్రవ్యమును తీసుకుని వచ్చేదరు యెహోవా స్తోత్త్రమును ప్రకటించెదరు. నీ కొరకు కేదారు గొర్రెమందలన్నియు కూడుకొనును. నేబాయేతు పొట్టేళ్ళు నీ పరిచర్యకు ఉపయోగములగును అవి నా బలి పీఠము మీద అంగీకారములగును. నా శృంగార మందిరమును శృంగారించేదను” – యెషయ 60: 5-7

1.“కేదారు గొర్రెమందలన్నియు కూడుకొనును. నేబాయేతు పొట్టేళ్ళు నీ పరిచర్యకు ఉపయోగములగును” అన్న లేఖన భాగంలో ప్రస్తావించబడిన “కేదార్ మరియు నేబాయేతులు” ఎవరో కాదు ఇష్మాయేలు ఇద్దరు కుమారులే! కేదార్ వంశంలోనే ముహమ్మద్ (స) జన్మించింది. దీనిని బట్టి సకల దేశాల కొరకు ఉద్భవించనున్న ప్రవక్త ఇశ్మాయేలీయుల నుండి వస్తాడని తేటతెల్లమౌతుంది.

2.“మిద్యాను ఏఫాయెముల లేత ఒంటెలును నీ దేశము మీద వ్యాపించును” అన్న లేఖన భాగంలో “మిద్యాను ఒంటెలు” అంటే “అరేబియా ఒంటెలు” అని అర్థం. “మిద్యాను” ప్రస్తుత అరేబియాలో “మద్యాన్”గా పిలువబడుతుంది.

3.“సముద్రవ్యాపారములు నీ వైపు త్రిప్పబడును” అన్నది అరేబియా వాసుల ప్రధాన సముద్ర వ్యాపారమైన ఆయిల్ మరియు పెట్రోల్ ఉత్పత్తులను సూచిస్తుంది. ఈ ప్రధాన సముద్ర వ్యాపారమే వారిని ప్రపంచంలో అత్యధిక ఐశ్వర్యవంతులుగా మార్చేసింది. ఇదే విషయాన్ని “జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును” అని భవిష్యవాణి రూపంగా చెప్పటం జరిగింది.

4.“నా శృంగార మందిరమును శృంగారించెదను” అన్నది ఏమాత్రం పొంతన లేని అనువాదం అని చెప్పవచ్చు. ఈ వాక్యభాగం ఇంగ్లీష్ బైబిల్లో గమనిస్తే “I will glorify the hose of my glory” అని చూడగలం. దీని సరైన అనువాదం “నా మహిమా మందిరమును నేను మహిమ పరచెదను” అని చెయ్యాలి. ఈ మహిమా మందిరం “కాబా” మందిరమే! పై లేఖనాన్ని జాగ్రత్తగా గమనిస్తే ప్రజలు “మిద్యాను (అరేబియాలో మద్యాన్) మీదుగా వ్యాపిస్తారని, “యెహోవా స్తోత్త్రమును ప్రకటించెదరు” అని “కేదారు గొర్రెమందలన్నియు కూడుకొనును, నేబాయేతు పొట్టేళ్ళు నీ పరిచర్యకు ఉపయోగములగును” అని చెప్పటం జరిగుతుంది. యెహోవాగా బైబిల్లో పరిచయం కాబడ్డ ఒక్క అల్లాహ్ నే ఏకైక దైవంగా ఆరాధించేవారు, స్తుతించేవారు యూదులో, క్రైస్తవులో కాదు, ఒక్క ఇష్మాయేలీయులే అనటంలో సందేహమే లేదు.

యెహోవాకు క్రొత్తగీతం పాడనున్న కేదార్ వాసులు (ఇశ్మాయేలీయులు)!

“సముద్ర ప్రయాణము చేయువారలారా, సముద్రములోని సమస్తమా, ద్వీపములారా యెహోవాకు  క్రొత్త గీతము పాడుడి, భూదిగాంతములనుండి ఆయనను స్తుతించుడి. అరణ్యమును దాని పురములును కేదార్ నివాస గ్రామములు బిగ్గరగా పాడవలెను” – యెషయా 42:10-11

పై లేఖనంలో యెహోవాకు ఒక “క్రొత్త గీతం” పాడనున్న జనం మరియు ద్వీపములలో ఆయన స్తోత్త్రము ప్రచురం చేసేవారు ఎవరోకాదు వారు “కేదార్” వాసులని (అనగా ఇశ్మాయేలీయులు అని) తెలుస్తుంది. నేడు “దేవుడే గొప్పవాడు, దేవుడే గొప్పవాడు (అల్లాహుఅక్బర్, అల్లాహుఅక్బర్)” అంటూ భూమి మీద ఉన్న ప్రతీ మసీదు నుండి నిత్యం ఐదు పూటలా పాడబడుతున్న “క్రొత్తగీతం (అజాన్)” ఇశ్మాయేలీయులలో ఉద్భవించిన ప్రవక్త అయిన ముహమ్మద్ (స) ద్వారా ప్రవేశపెట్టబడిన విధానమే!  “దేశములు నీ వెలుగు కొరకు వచ్చును” అన్న వాక్యభాగంలో “వెలుగు” అంటే ప్రవక్త ముహమ్మద్ (స) వారిచే పరిపూర్ణంగావించబడిన ఇస్లాం ధర్మం అని అర్థం. కేవలం 23 సం.ల ప్రవక్త ముహమ్మద్ (స) వారి కాలంలోనే లక్షల కొద్దీ ప్రజలూ ప్రజలు ఇస్లాంలోకి రావటమే కాదు, ప్రపంచ దేశాలలో ఉన్న కోట్లాది యూద, క్రైస్తవ ప్రజానీకం ఇస్లాంలోకి రావటం జరిగింది. ఆయన శిష్యుల ద్వారా ఇస్లాం సకల ప్రపంచ దేశాల్లో వ్యాపించింది. ఆ విధంగా “I will shake all nations” (నేను సకల దేశములను కదిలించుదును)” అన్న లేఖనం నెరవేరింది.  - Md Nooruddin

0 Response to "ప్రపంచ దేశాల కొరకు “అహ్మద్” రాబోవుచున్నాడు! : బైబిల్ ఉద్ఘాటన!! | "Ahmad" is coming for world countries! : Emphasis on the Bible !! : Md Nooruddin"

మీ అభిప్రాయాలు,సలహాలు,సూచనలు,సందేహాలు పంపగలరు
అందరూ చదువుకొనుటకు వీలుగా తెలుగులోనే వ్రాయవలెను.

← Newer Post Older Post → Home
Subscribe to: Post Comments (Atom)

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక...
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే...
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క...
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ...
  • శుభవార్త: "సిలువ...బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ...
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద...
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే...
  • స్వలింగ సంపర్కం వ్యక్తిగత స్వేచ్చా?
    రచ్చబండ లో జరిగిన స్వలింగ సంపర్కం గూర్చి కొంతమంది మేధావుల అభిప్రాయాలు చదివి చాలా ఆశ్చర్యమేసింది. స్వలింగ సంపర్కాన్ని మేము సమర్ధించమంటూనే అద...
  • M.A.అభిలాష్ గారితో ముఖాముఖి: పరిశుద్ధ బైబిలు ప్రబోధనల ప్రకారం:యేసు సిలువపై మరణించ లేదు! -1 (పాప పరిహారానికి రక్తమొక్కటే ప్రత్యమ్నాయమా?)
    సర్వశక్తిగల దేవుని పేరుతో...  యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలువదు. -సామెతలు 21:30 గౌరవ నీయులైన పాఠక మిత్రులా...

Recent Comments

Blog Archive

  • ►  2021 (2)
    • ►  April (1)
    • ►  January (1)
  • ►  2020 (2)
    • ►  August (1)
    • ►  April (1)
  • ►  2019 (14)
    • ►  December (2)
    • ►  October (2)
    • ►  June (3)
    • ►  February (4)
    • ►  January (3)
  • ▼  2018 (14)
    • ▼  December (2)
      • ప్రపంచ దేశాల కొరకు “అహ్మద్” రాబోవుచున్నాడు! : బైబి...
      • పది వేలమంది” శిష్యులతో రానైయున్న “ఆ ప్రవక్త” ఎవరో ...
    • ►  November (1)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (1)
    • ►  May (2)
    • ►  April (2)
    • ►  March (2)
    • ►  February (2)
  • ►  2017 (37)
    • ►  December (2)
    • ►  November (3)
    • ►  October (4)
    • ►  September (6)
    • ►  August (8)
    • ►  July (5)
    • ►  June (5)
    • ►  March (2)
    • ►  January (2)
  • ►  2016 (63)
    • ►  December (3)
    • ►  November (1)
    • ►  October (10)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (5)
    • ►  May (6)
    • ►  March (1)
    • ►  February (17)
    • ►  January (18)
  • ►  2015 (123)
    • ►  December (12)
    • ►  November (4)
    • ►  October (8)
    • ►  September (13)
    • ►  August (7)
    • ►  July (12)
    • ►  June (7)
    • ►  May (18)
    • ►  April (6)
    • ►  March (8)
    • ►  February (14)
    • ►  January (14)
  • ►  2014 (105)
    • ►  December (13)
    • ►  November (13)
    • ►  October (11)
    • ►  September (38)
    • ►  August (11)
    • ►  July (18)
    • ►  June (1)
  • ►  2013 (9)
    • ►  November (2)
    • ►  October (7)

Followers

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం

FB Follow

Sakshyam Magazine

Supporters



Follow by Email

Copyright © Sakshyam Magazine | Designed by Jayati Creative