• Contact us
  • Privacy Policy
  • Disclaimer
  • About Us

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Rachabanda
  • About Us
  • Sitemap
  • More
    • Vedas
    • Bible
    • SL Wuss V2
    • SL Wuss V3
    • SL Super Fast

Recent Acticles

Home » Uncategories » పది వేలమంది” శిష్యులతో రానైయున్న “ఆ ప్రవక్త” ఎవరో క్రైస్తవులు గమనించలేదా? : Md Nooruddin

పది వేలమంది” శిష్యులతో రానైయున్న “ఆ ప్రవక్త” ఎవరో క్రైస్తవులు గమనించలేదా? : Md Nooruddin

Posted by Sakshyam Magazine on Monday, December 17, 2018

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ (స) రాకడను గూర్చి బైబిల్లో ఒక్క కోణంలో కాదు, అనేక లేఖనాల ద్వారా వివిధ కోణాల్లో నిరూపించబడుతూనే ఉండటం! వాటిలో ఒకటి- ప్రవక్త ముహమ్మద్ (స) వారు “పదివేల మంది” పరిశుద్ధ శిష్యగణంతో వస్తారని ముందుగానే బైబిల్ లేఖనాలు ఎంతో స్పష్టంగా ప్రకటిస్తున్నాయన్నది. ఈ విషయాన్ని ఈ క్రింది లేఖనంలో గమనించగలరు.

ఆయన పారాను కొండ నుండి ప్రకాశించెను; “పదివేల మంది” పరిశుద్ధ సహచరులతో ఆయన వచ్చెను. – ద్వితీ 33:2 

'HE SHINED FROM MOUNT PARAN, and HE CAME WITH TEN THOUSANDS OF SAINTS: FROM HIS RIGHT HAND WENT A FIERY LAW FOR THEM' -Deuteronomy 33:2 

పై లేఖనంలో “పదివేల మంది” పరిశుద్ధ సహచరులతో ఆయన వచ్చెను (HE CAME WITH TEN THOUSANDS OF SAINTS)” అన్న వాక్యభాగం తెలుగు బైబిల్లో అయితే “వేవేల పరిశుద్ధ సమూహముల నుండి ఆయన వచ్చెను” అంటూ ఏ మాత్రం పొంతన లేని అనువాదం చెయ్యటం జరిగింది.

“పదివేల మంది” పరిశుద్ధ సహచరులతో రావలసి ఉన్న ఆ ప్రవక్త ఏ ప్రాంతానికి చెందిన వాడై ఉంటాడు?

“ఆయన పారాను కొండ నుండి ప్రకాశించెను” – ద్వితీ 33:2

పారాను మరియు సీనాయి కొండలు ప్రక్కప్రక్కన అరేబియా భూభాగంలోనే ఉన్నాయి.

“అరేబియా దేశములో ఉన్న సీనాయి కొండయే” – గలతీ 4:25

అన్న వాక్య భాగం ప్రకారం అరేబియాలో సీనాయి కొండకు ఆనుకుని ఉన్న పారాను నుండి ఆయన రానై యున్నాడు. అంటే “పదివేల మంది” పరిశుద్ధ సహచరులతో రావలసి ఉన్న ఆ ప్రవక్త అరేబియా ప్రాంతానికి చెందిన వాడై ఉంటాడని తేలిపోయింది.

“పదివేల మంది” పరిశుద్ధ సహచరులతో రావలసి ఉన్న ఆ ప్రవక్త ఏ పేరు కలిగిన వాడై ఉంటాడు?

“పదివేల మంది” పరిశుద్ధ సహచరులతో రావలసి ఉన్న ఆ ప్రవక్త ఎవరో ఆయన ఏ పేరు కలిగిన వాడై ఉంటాడో సోలోమోను ప్రవక్త ముందుగానే చెబుతున్న ఈ క్రింది జోస్యాన్ని బట్టి తెలుసుకోగలరు.

“నా ప్రియుడు ధవళ వర్ణుడు రత్న వర్ణుడు “పదివేల మంది” పురుషులలో అతని గుర్తించవచ్చు” – పరమగీతము 5:10

My beloved is white and ruddy, the chiefest among TEN THOUSAND - Songs of Solomon 5:10

“పదివేల మంది” పరిశుద్ధ సహచరులతో ఆయన వచ్చెను (ద్వితీ 33:2) అని మోషే చెప్పిన జోస్యాన్నే సోలోమోను సైతం “పదివేల మంది” పురుషులలో అతని గుర్తించవచ్చు” అంటూ వివరిస్తున్నాడు. ఆయన ఏ పేరు కలిగి ఉంటాడంటే...

“అతని నోరు అతి మధురం, అతడు అతి కాంక్షనీయుడు యేరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు ఇతడే నా స్నేహితుడు” – పరమ 5:16

పై లేఖన భాగాన్ని ప్రాచీన హెబ్రూ లో గమనిస్తే...

“హిక్కో ముమిత్తకిమ్ వి కుల్లు “ముహమ్మదిమ్” జహ్ దూద వ జహ్రీ బాయ్ నా జరూసలేం”

అని చదవగలం. “ముహమ్మద్” అనే పదానికి “అతి కాంక్షనీయుడు” అని అర్థం. ఈ విధంగా “పదివేల మంది” పరిశుద్ధ సహచరులతో రావలసి ఉన్న ఆ ప్రవక్త “ముహమ్మద్” అనే పేరు కలిగి ఉంటాడని కూడా తేటతెల్లమైంది. ఇక ప్రవక్త ముహమ్మద్ (స) వారి పేరు అదే బైబిల్లో ఈ నాటికీ “అహ్మద్” అని సైతం వ్రాయబడి ఉన్నట్లు గమనించగలం. ఈ విషయాన్ని క్రింది హగ్గయి 2:7 లేఖనాన్ని హెబ్రూలో చదవటం ద్వారా తెలుసుకోగలరు.

“యూ, ఎరోషిత్, అత్ కి ఈగూయిమ్ యుబావు “అహమద్” కి ఈగూయిమ్”

పై హెబ్రూ లేఖనం యొక్క సరైన అనువాదం చదవండి.

“I will shake all the nations, and HAMADA [AHMAD] shall come for all the nations” – Haggai 2:7

పై లేఖనాన్ని ఏ మాత్రం పొంతన లేకుండా తెలుగులో అనువాదం చెయ్యటం జరిగింది. వాస్తవానికి "HAMADA [AHMAD] shall come for all the nations” అన్న వాక్య భాగపు అర్థం - "ప్రపంచదేశాలన్నిటి కొరకు అహ్మద్ రాబోతున్నాడు" అన్నది.

ఈ విధంగా “పదివేల మంది” పరిశుద్ధ సహచరులతో రావలసి ఉన్న “ఆ ప్రవక్త” “ముహమ్మద్” “అహ్మద్” అనే పేర్లతో పరిచయం కాబడతారని ఇప్పటి వరకు గమనించిన బైబిల్ వాక్యాల వెలుగులో తెలుసుకున్నాం. “పదివేల మంది” పరిశుద్ధ సహచరులతో రావలసి ఉన్న “ఆ ప్రవక్త” ను గూర్చి మోషే, సోలోమోను ప్రవక్తలు మాత్రమే కాదు హానోక్ ప్రవక్త చెప్పిన జోస్యాన్ని ఈ క్రింది గమనించగలరు.

“ఆదాము మొదలుకొని యేడవవాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించెను- ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును, వారిలో భక్తిహీనులందరును భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటి గూర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును, ప్రభువు తన “పదివేల మంది” పరిశుద్ధుల పరివారముతో వచ్చెను” – యూదా 1:14-15

“ప్రభువు తన “పదివేల మంది” పరిశుద్ధుల పరివారము (TEN THOUSAND OF HIS SAINTS) తో వచ్చెను” హానోక్ ప్రవక్త చెప్పిన జోస్యాన్ని బట్టి కూడా పారాను ప్రాంతం నుండి ఆ ప్రవక్త పదివేల మంది శిష్యులతో రానైయున్నారని తేటతెల్లమైంది.

గమనిక: పై వాక్యంలో సైతం “పదివేల మంది” పరిశుద్ధ పరిశుద్ధుల పరివారము (TEN THOUSANDS OF SAINTS) తో ఆయన వచ్చెను ” అన్న వాక్యభాగం సైతం తెలుగు బైబిల్లో  “వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను” అంటూ ఏ మాత్రం పొంతన లేని అనువాదం చెయ్యటం జరిగింది అన్నది గమనించాలి. "పదివేల మంది పరిశుద్ధుల పరివారము" అన్న పదాన్ని "వేవేల పరిశుద్ధుల పరివారము" అని మార్చి అనువాదం చెయ్యటం కేవలం ప్రవక్త ముహమ్మద్ (స) వారి ప్రస్తావనను కప్పిపుచ్చటంలో భాగంగా జరిగిన కుట్ర అని తెలియటం లేదూ?

క్రైస్తవ చరిత్రకారుల ప్రకారం సైతం “పదివేలమంది” పరిశుద్ధ శిష్యగణంతో వచ్చిన ప్రవక్త- ముహమ్మద్ (స)!

ప్రవక్త ముహమ్మద్ (స) వారి గురించి అధ్యయనం చేసిన ప్రముఖ చరిత్రకారులు సైతం తాము రచించిన గ్రంధాలలో ప్రవక్త ముహమ్మద్ (స) మక్కా నుండి మదీనాకు తన “పదివేలమంది శిష్య గణం”తో ప్రవేశించారని సాక్ష్యం ఇవ్వటం అత్యంత గమనార్హం. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన “ద హిస్టరీ ఆఫ్ గాడ్” పుస్తక రచయత్రి మరియు రోమన్ క్యాథలిక్ నన్ అయిన “కరేన్ ఆర్మ్ స్ట్రాంగ్” తన ప్రముఖ పుస్తకమైన “ముహమ్మద్’ ఎ బయోగఫీ ఆఫ్ ద ప్రోఫెట్” అన్న పుస్తకంలో వ్రాసిన ఈ క్రింది గమనార్హమైన సమాచారాన్ని చదువగలరు.

“రామజాన్ మాసం 20 వ తారీఖున (గురువారం, హిజ్రీ శకం 8, (11 జనవరి 630) ముహమ్మద్ తన సైన్యంతో మక్కాలో ప్రవేశించారు. కానీ ముహమ్మద్ మక్కాలో తన శత్రువులందరినీ క్షమాపణ అనుగ్రహించి, వారు ధర్మం పట్ల కలిగి ఉన్న అపార్థాలన్నిటినీ తుడిచిపెట్టేశారు. అనంతరం కాబా గృహం చుట్టూ 7 సార్లు ప్రదీక్షణ చేసి తన వెంట వచ్చిన “పదివేల మంది శిష్య గణం” తో పాటు “దేవుడే గొప్పవాడు అన్న నినాదం చేశారు” – Ref: “కరేన్ ఆర్మ్ స్ట్రాంగ్” - “ముహమ్మద్’ ఎ బయోగఫీ ఆఫ్ ద ప్రోఫెట్”

ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ (స) పారాను ప్రాంతం నుండి తన “పదివేల మంది” పరిశుద్ధ శిష్య గణం తో రానైయున్నారని, ఆయన “ముహమ్మద్” అన్న పేరు కలిగి ఉంటారని ప్రత్యక్షంగా పరిశుద్ధ బైబిల్లో అనేక మంది ప్రవక్తల సాక్ష్యాన్ని చదివిన తరువాత కూడా నేటి క్రైస్తవ సోదరులు ముహమ్మద్ (స) ను ప్రవక్తగా అంగీకరించక తిరస్కరించటం ప్రత్యక్షంగా బైబిల్ లేఖనాలను త్రోసిపుచ్చటమే అవుతుంది.

Md Nooruddin

0 Response to "పది వేలమంది” శిష్యులతో రానైయున్న “ఆ ప్రవక్త” ఎవరో క్రైస్తవులు గమనించలేదా? : Md Nooruddin"

మీ అభిప్రాయాలు,సలహాలు,సూచనలు,సందేహాలు పంపగలరు
అందరూ చదువుకొనుటకు వీలుగా తెలుగులోనే వ్రాయవలెను.

← Newer Post Older Post → Home
Subscribe to: Post Comments (Atom)

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక...
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే...
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క...
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ...
  • శుభవార్త: "సిలువ...బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ...
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద...
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే...
  • స్వలింగ సంపర్కం వ్యక్తిగత స్వేచ్చా?
    రచ్చబండ లో జరిగిన స్వలింగ సంపర్కం గూర్చి కొంతమంది మేధావుల అభిప్రాయాలు చదివి చాలా ఆశ్చర్యమేసింది. స్వలింగ సంపర్కాన్ని మేము సమర్ధించమంటూనే అద...
  • M.A.అభిలాష్ గారితో ముఖాముఖి: పరిశుద్ధ బైబిలు ప్రబోధనల ప్రకారం:యేసు సిలువపై మరణించ లేదు! -1 (పాప పరిహారానికి రక్తమొక్కటే ప్రత్యమ్నాయమా?)
    సర్వశక్తిగల దేవుని పేరుతో...  యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలువదు. -సామెతలు 21:30 గౌరవ నీయులైన పాఠక మిత్రులా...

Recent Comments

Blog Archive

  • ►  2021 (2)
    • ►  April (1)
    • ►  January (1)
  • ►  2020 (2)
    • ►  August (1)
    • ►  April (1)
  • ►  2019 (14)
    • ►  December (2)
    • ►  October (2)
    • ►  June (3)
    • ►  February (4)
    • ►  January (3)
  • ▼  2018 (14)
    • ▼  December (2)
      • ప్రపంచ దేశాల కొరకు “అహ్మద్” రాబోవుచున్నాడు! : బైబి...
      • పది వేలమంది” శిష్యులతో రానైయున్న “ఆ ప్రవక్త” ఎవరో ...
    • ►  November (1)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (1)
    • ►  May (2)
    • ►  April (2)
    • ►  March (2)
    • ►  February (2)
  • ►  2017 (37)
    • ►  December (2)
    • ►  November (3)
    • ►  October (4)
    • ►  September (6)
    • ►  August (8)
    • ►  July (5)
    • ►  June (5)
    • ►  March (2)
    • ►  January (2)
  • ►  2016 (63)
    • ►  December (3)
    • ►  November (1)
    • ►  October (10)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (5)
    • ►  May (6)
    • ►  March (1)
    • ►  February (17)
    • ►  January (18)
  • ►  2015 (123)
    • ►  December (12)
    • ►  November (4)
    • ►  October (8)
    • ►  September (13)
    • ►  August (7)
    • ►  July (12)
    • ►  June (7)
    • ►  May (18)
    • ►  April (6)
    • ►  March (8)
    • ►  February (14)
    • ►  January (14)
  • ►  2014 (105)
    • ►  December (13)
    • ►  November (13)
    • ►  October (11)
    • ►  September (38)
    • ►  August (11)
    • ►  July (18)
    • ►  June (1)
  • ►  2013 (9)
    • ►  November (2)
    • ►  October (7)

Followers

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం

FB Follow

Sakshyam Magazine

Supporters



Follow by Email

Copyright © Sakshyam Magazine | Designed by Jayati Creative