• Contact us
  • Privacy Policy
  • Disclaimer
  • About Us

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Rachabanda
  • About Us
  • Sitemap
  • More
    • Vedas
    • Bible
    • SL Wuss V2
    • SL Wuss V3
    • SL Super Fast

Recent Acticles

Home » Editorial » అన్ని మతాలూ ఒక్కటే అనటం పెద్ద అబద్ధం అయినప్పుడు అందరి దేవుడూ ఒక్కడే అనడం కూడా పెద్ద అబద్ధం అవ్వదా?

అన్ని మతాలూ ఒక్కటే అనటం పెద్ద అబద్ధం అయినప్పుడు అందరి దేవుడూ ఒక్కడే అనడం కూడా పెద్ద అబద్ధం అవ్వదా?

Posted by Sakshyam Magazine on Tuesday, August 8, 2017
Label: Editorial

నిజానికి మతమంటే అభిప్రాయమని అర్ధం. అంటే ఎవరి అభిప్రాయం వారికి మతమన్నమాట! అయితే ధర్మం మటుకు ఎప్పటికీ ఒక్కటే. ధర్మమన్న మాటకు మన పండితులు ఈశ్వరాజ్ఞ అని శెలవిచ్చారు.

భగవంతుణ్ణి ఆజ్ఞాపాలన చేయడమే మన కర్తవ్యం తప్ప మన స్వంత అభిప్రాయాలు కల్పించుకుని వాటిని స్థాపించాలని చూడడం అధర్మమే అవుతుంది. ఈరోజు మతం పేరు చెప్పి అత్యధికంగా జరుగుతున్నది అదే!

ధర్మం గూర్చి,భగవంతుణ్ణి గూర్చి మరింత శాస్త్ర బద్ధమైన విశ్లేషణ చేయాల్సివుంది. త్వరలో ఆ ప్రయత్నం కూడా చేస్తాం!

ఎవరికైనా దేవుడూ ఒక్కడే! ధర్మమూ ఒక్కటే అయితే ఆయా కాలాలను బట్టి, ప్రాంతాలను బట్టి, పరిస్థితులను బట్టి క్రతువులు మారుతూ ఉంటాయ్. అంతమాత్రం చేత అదీ,ఇదీ ఒక్కటే ఎలా అవుతుంది? అని వాదించడం అర్ధరహితమవుతుంది.

క్రతువులు (షరియత్ : ఆచార పద్ధతులు)పరంగా వేదం,బైబిల్,ఖురాన్ వేరు కావచ్చు. కాని విశ్వాసాల పరంగా ఈమూడూ ఒక్కటే. వీటిలో ప్రస్తావించబడిన దైవ ప్రస్తావన ఒక్కటే. పరిశీలించే విజ్ఞులకు ఆ విషయం ఇట్టే అవగతమవుతుంది. మూర్ఖంగా వెదికే వారికి గ్రుడ్డిగా నమ్మేవారికి, తాను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్లన్న వితండవాదులకు అర్ధమై చావదు. నిజానికి భగవంతుణ్ణికి కూడా అటువంటి వారికి జ్ఞానోదయం చేయడు.

అన్ని మతాలూ ఒక్కటే అనటం పెద్ద అబద్ధం అయినప్పుడు అందరి దేవుడూ ఒక్కడే అనడం కూడా పెద్ద అబద్ధం అవ్వదా? నిజానికి ఇది ఎంత దారుణమైన వాదన. విజ్ఞులు పరిశీలించాలి. ఇదే నిజమైతే “యేకే ఏవనో దూత్యో”. “ద్వావ భూమిజనయాన్ దేవ ఏకః” (దేవుడు ఒక్కడే, ఆయన అద్వితీయుడు. భూమికి, ఆకాశానికి సృస్తికర్త ఒక్కడే ) అన్న వేద మంత్రమూ, మన దేవుడైన యెహోవా “అద్వితీయుడైన” యెహోవా అన్న బైబిల్ వాక్యమూ, ఒకవేళ ఆకాశాలలో, భూమిలో “ఒక్క అల్లాహ్ తప్ప” ఇతర దేవుళ్లు కూడా ఉంటే, అప్పుడు [భూమ్యాకాశాల] రెండిటి వ్యవస్థ చిన్నాభిన్నమై ఉండేది. అన్న ఖురాన్ వాక్యమూ అర్ధరహితమే కదా?

5 Responses to "అన్ని మతాలూ ఒక్కటే అనటం పెద్ద అబద్ధం అయినప్పుడు అందరి దేవుడూ ఒక్కడే అనడం కూడా పెద్ద అబద్ధం అవ్వదా? "

  1. hari.S.babuAugust 8, 2017 at 11:03 AM

    your qurestion:అన్ని మతాలూ ఒక్కటే అనటం పెద్ద అబద్ధం అయినప్పుడు అందరి దేవుడూ ఒక్కడే అనడం కూడా పెద్ద అబద్ధం అవ్వదా?

    my answer:ప్రశ్న చాలా తెలివిగా అడిగారు,నాలాంటివాడు కూడా కొంచెం ఆదమరిచి ఉంటే బొక్కబోర్లా పడిపోయి వుందేవాడు సుమీ!మరి,మీరు చెబుతున్నట్టు అందరి దేవుడూ ఒక్కడే అయితే "క్రతువులు (షరియత్ : ఆచార పద్ధతులు)పరంగా వేదం,బైబిల్,ఖురాన్ వేరు" కావటం ఎట్లా జరిగిందీ?"విశ్వాసాల పరంగా ఈమూడూ ఒక్కటే. వీటిలో ప్రస్తావించబడిన దైవ ప్రస్తావన ఒక్కటే" అని అంటూన్న మీకు హిందూ మత గ్రంధలాలోనూ క్రైస్తవ మత గ్రంధాలలోనూ మాత్రమే ఎందుకు తప్పులు కనిపిస్తున్నాయి?మొదటి నెల నుంచీ కంచు కాగడా పెట్టి వెతికినా హిందూ క్రైస్తవ మతాలలోని తప్పుల్ని ఇస్లాము కళ్ళనుంచి చూస్తున్న వ్యాసాలు త్ప్ప ఇస్లాం గురించి కనీసం చిన్నపాటి విమర్శ కూడా ఏ వ్యాసంలోనూ లేకపోవటం ఎందుకు జరుగుతున్నది?

    P.S:మానవజాతిలో హిందువులనీ,క్రైస్రవులనె,బౌద్ధులనీ,ముస్లిములనీ సృష్టించిన దేవుడు ఒక్కదే కావచ్చు,కానీ సనతన ధర్మం నిర్వచించే దేవుడూ,క్రైస్తవాన్ని పరిచయం చహెసినవారు నిర్వచించిన దేవుడూ ఇస్లామును ప్రబోధించిన అహ్మద్ ఖురేషీ తన భక్తులకి నిర్దేశించిన దేవుడూ మాత్రం ఒక్కడు కాదు!ఆయా దేవుళ్ళకీ ఆయ మతాలవారు పాటించే క్రతువులకీ పార్స్పార్ సంబ్నద్ఫ్హం ఉంది కాబట్టి ఒక్కడే అనుకుంటానికి ఏ మాత్స్థుడూ ఒప్పుకోడు.కరమకాందల్నీ,క్రతువుల్నె,ధార్మసూత్రాల్నీ, మతగ్రంధాల్నీ,ప్రాత్ధనారెతుల్ని విడిగా ఉంచి అందరూ ఒక్క దేవుణ్ణే పూజించాలి అంటే "ఏ మతం వారి దేవుణ్ణీ అందరూ ఒప్పుకోవాలి?" అన్న ప్రశ్న తప్పకుండా వస్తుంది.దానికి మీరు జవాబు చెప్పగలిగలరేమో ప్రయత్నించండి!

    ReplyDelete
    Replies
      Reply
  2. hari.S.babuAugust 8, 2017 at 9:01 PM

    వాస్తవానికి క్రైస్తవులూ ముస్లిములూ ఇదరూ క్రూరమైనవాళ్లే - ఒకరు కొంచెం ఎక్కువ ఒకరు కొంచెం తక్కువ, అంతే!ఇవ్వాళ శాంతియుతమైన మతంగా పేరు తెచ్చుకుంటున్న క్రైస్తవ మతగ్రంధంలోని Exodus 12:15 "Anyone who attacks their Father or Mother to be put to death." అంటుంది.ఇక్కడ చెబుతున్నది జన్మనిచ్చిన తలిదండ్రులను గురించి కాదు.ఇంకా అనుమానం ఉంటే Exodus 22.20 "Whoever sacrifices any other, Other than the Lord must be destroyed." అని స్పష్టంగా చెప్తుంది.ఎక్కడ చూసినా వాళ్ళ దేవుడు తనని ప్రార్ధించని వాళ్ళని శిక్షించమనే చెప్తాడు.చాలమటుకు ఆ శిక్షలు చావునే చెబుతాయి.

    Hence, Christians and Muslims, however are terrorized into submission.In fact, some interpret Islam to mean submission.And if you do not submit, You will be tortured after you die.

    Judaism,Christianity and Islam are not really religions of Love and Peace as some argue.They are religions of war,about obeying God or suffer Death as punishment.It is about defy God and suffer Death and Hell.It is about You must resist, fight and kill those who will not bow to God and accept the one God and still insist on praying to other Gods.

    The God of Jews,Christians and Muslims is a jealous God who cannot accept other Gods.The God of the Jews,Christians and Muslims is a vengeful God who punishes you for disobedience.The God of the Jews,Christians and Muslims is a God you never cross if you do not want to suffer punishment in this world and that world.The God of the Jews,Christians and Muslims is a terrorist who makes you tremble and obey out of fear,

    వారికి ఒక దైవపుత్రుడు, ఒక ప్రవక్త అత్యంత ప్రభావశీలమైన స్థానంలో ఉండటానికి కూడా వారి దేవుడి క్రౌర్యమే కారణం.మరీ అతిగా భయపెడితే భక్తులు దడుపు జ్వరం తెచ్చుకుని మతాన్ని వొదిలేసి పారిపోతారు - కొండనాలిక్కి మందేస్తే ఉన్న నాలిక ఊడినట్టు!దైవపుత్రుడు/ప్రవక్త అనే ఒక మధ్యవర్తిని చూపించి "దేవుడు స్వయంగా ఎన్నుకుని భూమిమీదకి పంపిన ఈ ప్రవక్త/దైవపుత్రుడు/అంతిమఋషి చెప్పినట్టు విని అట్లా నడుచుకుంటే దేవుడు మిమ్మల్ని శిక్షించడు" అనే ఏర్పాటు చేశారు, శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు అన్నట్టు!

    నీ దుష్కర్మలే నిన్ను నాశనం చేస్తాయి,నీ సత్కర్మలే నిన్ను రక్షిస్తాయి అనీ దేవుడు శిక్షించడం గానీ రక్షించడం గానీ మనం చేసిన పనులకి ఫలితాల్ని ఇచ్చే చిధంగా చేస్తాడు తప్ప తనకు విధేయత కోసం పట్టుబట్టడనీ చెప్తున్న సనాతన ధర్మాన్ని పాటించే మనకి అవన్నీ చాలా వింతగా అనిపిస్తాయి.సనాతనధర్మం ఏది చెప్పినా వ్యక్తి యొక్క అస్తిత్వకాంక్షనీ, స్వాభిమానాన్నీ, నిర్ణాయక శక్తినీ అవమానించని పద్ధతిలో చెప్తుంది.అదే సమయంలో ఆ వ్యక్తి సమాజంలో నిలబడినప్పుడు తను చెప్పినదాని వల్ల ఎవరూ అవమానానికి గురి కాకుండా కొన్ని జాగ్రత్తలను కూడా చెప్తుంది.ఇలా వ్యక్తినీ సమాజాన్నీ ఒకేసారి పట్టించుకుని బ్యాలెన్సు చెయ్యాలనతం వీటిని విడివిడి అస్తిత్వాలుగా చూసే సెమెటిక్ మతాల ప్రభావంలో ఉండి ఆలోచించేవారికి సనాతనధర్మం చెప్పేది చాదస్తంగా అనిపిస్తుంది.

    సెమెటిక్ మతాలకు భిన్నంగా సనాతనధర్మం దేవుడి గురించి తను చెబుతుంది, తెలుసుకోమని ఉత్సాహం రగిలిస్తుంది,దేవుడి గురించి తెలుసుకున్న కొద్దీ భక్తుడు భయవిముక్తుడు కాగలడని భరోసా ఇస్తుంది!కొందరు కొంచెపు బుద్ధుల వాళ్ళు "హిందువుల దేవుళ్ళ చేతుల్లో ఆయుధాలు ఉంటాయి.కాబటి వాళు హింసకి ప్రతిరూపాలు" అంటూ విషం కక్కుతున్నారు గానీ ఇక్కడ జరుగుతున్నది అందుకు విరుద్ధం.హిందువుల దేవుడు ప్రేమాస్పదుడు,భక్తులు దేవుణ్ణి ఇష్టపడుతారు, ఆడుకుంటారు, పాడుకుంటారు, వెక్కిరిస్తారు, పోట్లాడుతారు - దేవుడితో తాదాత్మ్యం చెందుతారు.దేవుడంటే భయంతో గజగజ వొణుకుతూ బతికే ఇతర మతస్థులకు అంతటి అదృష్టం ఎప్పటికీ పట్టదు - ఇతర మతస్థులు కలలోనైనా వూహించలేని విధంగా ఒక హిందువు "అహం బ్రహ్మాస్మి!" భావనతో తానే దైవసముడు కాగలడు.

    సెమెటిక్ మతాలలో సృష్టిలోకల్లా మనిషి ఒకడే సర్వోత్తముడు!ఇతర జంతుజాలం, వృక్షసంతతులు అన్నీ మానవజాతి వినియోగం కోసం దేవుడు సృష్టించి ఇచ్చిన హక్కుభుక్తాలు.అందుకే తొలి మానవజంట యైన ఆదాము,హవ్వకు వారి పౌరాణిక కధనాల్లో అత్యంత ప్రాముఖ్యాన్ని ఇచ్చి ఇతరేతరమైన సమస్తాన్నీ వారికి దఖలు పర్చినటు వర్ణించారు.కానీ సనాతన ధర్మం సకల జీవరాశులూ సమానమే అంటుంది.మానవుడు కూడా ఈ సృష్టిలో వాటితో సమానుడే తప్ప ఎలాంటి ఆధిక్యతా లేదని అనాది కాలం నుంచీ నిర్ద్వంద్వంగా చాటి చెబుతున్నది సనాతన ధర్మం ఒక్కటే!

    CONTINUING BELOW

    ReplyDelete
    Replies
      Reply
  3. hari.S.babuAugust 8, 2017 at 9:02 PM

    CONTINUEING FROM ABOVE
    సెమెటిక్ మతాలలో మనిషి దేవుడిలో ఐక్యం కావడం ఉండదు.దేవుడు నిర్మించిన స్వర్గమే వారికి అంతిమలక్ష్యం.దానికి పూర్తి విరుద్ధం సనాతన సంప్రదాయం.హిందువుల అంతిమలక్ష్యం భగవంతునిలో ఐక్యం కావడమే - అది మోక్షం!సెమెటిక్ మతాలు సరళరేఖాత్మకమైనవి - అంటే ప్రతిదీ ఒకసారి పుట్టి,బతికి చచ్చిపోయినది ఇక తిరిగి పుట్టదు.అనంతకాలం వరకూ స్వర్గంలోనో నరకంలోనో గడపాల్సిందే.కానీ సనాతనధర్మం సృష్టి విషయం నుంచి మానవ జీవితం వరకూ పునరపి జననం పునరపి మరణం అనే నిరంతర వృత్తాకార చలనపు సిద్ధాంతం.ఇట్లా కనీసం సరిపోల్చడానికే వీలు లేని వాటిని ఒక్కటి చేయడం అసాధ్యం.

    ఒక్కటి చెయ్యడం అటుంచి మిగిలిన మతాలలో ఇతర మతాల్ని తమ పొరుగున కూడా భరించలేనంత తీవ్రమైన అసహనం,ద్వేషం,తిరస్కారం,క్రౌర్యం ఉన్నాయి.దానికి సనాతన ధర్మం పూర్తి విరుద్ధం - "వసుధైవ కుటుంబ" భావనతో ప్రతి ఒక్కరినీ అక్కున జేర్చుకుని ఆదరించి తననే అవమానిస్తున్నప్పటికీ క్షమించి సహిస్తున్న విశాల హృదయం సనాతన ధర్మానిది.

    క్రైస్తవులు పైకి ఉదారవాదుల వేషం కట్టి అందర్నీ తమ దేశంలో ఉండనిస్తూ అన్నిటినీ సహించినట్టు కనబడుతూనే దొడ్డిదారిన ఇతర మతాల మీద పెత్తనం చెలాయించే అతితెలివి వారి సొంతం - తమకు కాస్త ఇబ్బంది కలగగానే ఏమాత్రం జాలి లేకుండా మెడపట్టి బయటికి తరమగలిగిన నిర్దయ వారి ప్రత్యేకత.ఇక ముస్లిములు అధికారికమైన ఖలీఫా పాలన అంతమై సాంకేతికంగా ఇస్లామిక్ రాజ్యం ఎక్కడా లేకపోయినా వారి అధిపత్యం సాగుతున్న ఇస్లామిక్ దేశాలు ఆపాటి స్వేచ్చ కూడా ఇవ్వవు.ఆ దేశాలలో ఇతర మతస్థులు బహిరంగంగా ఎక్కడా తమ మతానికి సంబంధించిన ప్రదర్శన చెయ్యడం కుదరదు.తమ ఇంటిలో తమ మతాన్ని తాము పాటించుకోవడానికి కూడా జిజియా పన్ను కట్టాలి.ఈ గురివిందలు హిందువులకి పరమత సహనం లేదని హిందూమతత్వవాదులు అనే తకారనత్తిపదాన్ని హిందువులకి పర్యాయపదం చేశారు!

    ReplyDelete
    Replies
      Reply
  4. నీహారికAugust 9, 2017 at 10:10 AM

    @sakshyam magazine,

    ఇంకొంచెం వివరంగా చెపితే బాగుంటుంది. మీరేం చెప్పదలుచుకున్నారో అర్ధం కాలేదు.

    ReplyDelete
    Replies
      Reply
  5. V a li amalapuramAugust 27, 2017 at 12:57 PM

    "The God of Jews,Christians and Muslims is a jealous God who cannot accept other Gods"....నాన్ననే నాన్న అనాలా...ఇంకెవరిని అనకూడదా how can he be such jealous?? అన్నట్టుంది ఈ arguement!!

    ReplyDelete
    Replies
      Reply
Add comment
Load more...

మీ అభిప్రాయాలు,సలహాలు,సూచనలు,సందేహాలు పంపగలరు
అందరూ చదువుకొనుటకు వీలుగా తెలుగులోనే వ్రాయవలెను.

← Newer Post Older Post → Home
Subscribe to: Post Comments (Atom)

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక...
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే...
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క...
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ...
  • శుభవార్త: "సిలువ...బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ...
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద...
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే...
  • స్వలింగ సంపర్కం వ్యక్తిగత స్వేచ్చా?
    రచ్చబండ లో జరిగిన స్వలింగ సంపర్కం గూర్చి కొంతమంది మేధావుల అభిప్రాయాలు చదివి చాలా ఆశ్చర్యమేసింది. స్వలింగ సంపర్కాన్ని మేము సమర్ధించమంటూనే అద...
  • M.A.అభిలాష్ గారితో ముఖాముఖి: పరిశుద్ధ బైబిలు ప్రబోధనల ప్రకారం:యేసు సిలువపై మరణించ లేదు! -1 (పాప పరిహారానికి రక్తమొక్కటే ప్రత్యమ్నాయమా?)
    సర్వశక్తిగల దేవుని పేరుతో...  యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలువదు. -సామెతలు 21:30 గౌరవ నీయులైన పాఠక మిత్రులా...

Recent Comments

Blog Archive

  • ►  2021 (2)
    • ►  April (1)
    • ►  January (1)
  • ►  2020 (2)
    • ►  August (1)
    • ►  April (1)
  • ►  2019 (14)
    • ►  December (2)
    • ►  October (2)
    • ►  June (3)
    • ►  February (4)
    • ►  January (3)
  • ►  2018 (14)
    • ►  December (2)
    • ►  November (1)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (1)
    • ►  May (2)
    • ►  April (2)
    • ►  March (2)
    • ►  February (2)
  • ▼  2017 (37)
    • ►  December (2)
    • ►  November (3)
    • ►  October (4)
    • ►  September (6)
    • ▼  August (8)
      • యేసు బోధనలలో దేవుడెవరు?
      • How true is the man who finds the sea route to Ind...
      • "విగ్రహారాధన"ను హిందూ పండితులు ఏమన్నారో తెలుసుకోండి!
      • హేతుబద్ధంగా ఆలోచించే ఆస్తిక-నాస్తిక మిత్రులకు మా మ...
      • ఇస్లాం రహిత ప్రపంచం సాధించడం మీ లక్ష్యమా? మీకు సాధ...
      • Is it forbidden for Muslims to participate in the ...
      • ఆగస్ట్ 15 వేడుకలలో పాల్గొనడం ఇస్లాం ప్రకారం ముస్లి...
      • అన్ని మతాలూ ఒక్కటే అనటం పెద్ద అబద్ధం అయినప్పుడు అం...
    • ►  July (5)
    • ►  June (5)
    • ►  March (2)
    • ►  January (2)
  • ►  2016 (63)
    • ►  December (3)
    • ►  November (1)
    • ►  October (10)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (5)
    • ►  May (6)
    • ►  March (1)
    • ►  February (17)
    • ►  January (18)
  • ►  2015 (123)
    • ►  December (12)
    • ►  November (4)
    • ►  October (8)
    • ►  September (13)
    • ►  August (7)
    • ►  July (12)
    • ►  June (7)
    • ►  May (18)
    • ►  April (6)
    • ►  March (8)
    • ►  February (14)
    • ►  January (14)
  • ►  2014 (105)
    • ►  December (13)
    • ►  November (13)
    • ►  October (11)
    • ►  September (38)
    • ►  August (11)
    • ►  July (18)
    • ►  June (1)
  • ►  2013 (9)
    • ►  November (2)
    • ►  October (7)

Followers

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం

FB Follow

Sakshyam Magazine

Supporters



Follow by Email

Copyright © Sakshyam Magazine | Designed by Jayati Creative