• Contact us
  • Privacy Policy
  • Disclaimer
  • About Us

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Rachabanda
  • About Us
  • Sitemap
  • More
    • Vedas
    • Bible
    • SL Wuss V2
    • SL Wuss V3
    • SL Super Fast

Recent Acticles

Home » Vedas » విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash

విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash

Posted by Sakshyam Magazine on Wednesday, February 24, 2016
Label: Vedas

1. విగ్రహారాధన ప్రాచీనమా? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా?

నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక ధర్మం. దానినినే- ఆర్ష ధర్మం అంటారు. అనగా- రుషుల ద్వారా ప్రబోధించబడిన ధర్మం అనే అర్థం వస్తుంది. ఇంకా దానిని- సనాతన ధర్మం అని కూడా అంటారు. సనాతనం అనగా అనాదిగా వస్తున్న ధర్మం లేక నిత్యనూతనమైన ధర్మం అనే అర్థం వస్తుంది. ఈ ధర్మం ప్రత్యేకతలు మూడు ఉన్నాయి. వాటిలో...

1. సార్వ కాలికం, 2. సార్వ జననీనం మరియు 3. హేతుబద్ధం.
ఈ విషయం కొందరికి ఎంతో వాస్తవంగా అనిపిస్తే, కొందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది. మరి కొందరికైతే- అవహేళంగా తోస్తుంది! అలాంటి వారంతా ఏకాభిప్రాయానికి రావాలంటే- యుగ సంస్కర్త అయిన స్వామీ వివేకానంద తెలుపుతున్న ఈ క్రింది విషయాన్ని గమనించాలి.
"ప్రవక్తలు వేరు; మతాచార్యులు/పురోహిత వర్గం లేదా మత ప్రచారకులు వేరు. మూఢ విశ్వాసాలను వ్యతిరేకించటం ప్రవక్తల పని కాగా, మూఢ నమ్మకాలను పెంచేందుకు నడుం కట్టింది పురోహిత వర్గం. ఈ ప్రత్యేక వర్గానికి ప్రపంచంలో మరేదీ పట్టదు. నిజానికి ఈ ప్రపంచం ప్రకృతి ప్రసాదం. దార్శనికులైన ప్రవక్తలు మూఢ విశ్వాసాలను సవాలు చేసినవాళ్లు. కాగా, మతాచార్యులు లేదా పురోహిత వర్గమే 2000 రకాల ఆచారాలనూ, కర్మకాండలనూ సృష్టించారు".

దీని కారణంగా- వ్రవక్తలు దైవం తరఫున అందించిన ‘సశాస్త్రీయ ధర్మం’, ఒకవైపు వంచకులైన పండితుల ద్వారా కల్పించబడిన వేలాది మూఢ విశ్వాసాల-మూఢాచారాల క్రింద పడి, ‘కను మరుగు అయిపోయింది’. మరోవైపు  వారు కల్పించిన ‘అశాస్త్రీయ ధర్మం’ జనసామాన్యంలో ‘సర్వసామాన్యం అయిపోయింది’. ఆ తప్పుడు ధర్మం వలన ఒక్క పూజారి వర్గానికి తప్ప సామన్య భక్తులకు ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. సరికదా- దానిని  అనుసరిస్తున్నకారణంగా సామాన్య భక్తజనం- ఒకటి భావదాస్యానికి మరియు నైతిక బలహీనతలకు గురైపోతారు. ప్రస్తుతం హిందూ సమాజం ఈ పరిస్థితికే గురై ఉంది. అందుకే, హిందూ ధర్మం- సార్వ కాలికం, సార్వ జననీనం మరియు హేతుబద్ధం వంటి ప్రత్యేకతలను కలిగి ఉందంటే- కొందరికి ఆశ్చర్యం కలిగితే మరి కొందరికి అవహేళంగా తోస్తుంది!

హిందూ ధర్మంలోని ఈ మూడు ప్రత్యేకతలను గాంచ గలగాలంటే- మన వంచకులైన పురోహిత వర్గం సృష్టించిన 2000 రకాల ఆచారాలను, కర్మకాండలను తొలగించి వాటి వెనుకకు వెళ్ళి చూడవలసి ఉంటుంది. మిమ్మల్ని అక్కడకు తీసుకు వెళ్ళేవే మా ఈ వ్యాసాలు! కనుక వీటిని 'విమర్శ దృష్టి'తో కాక 'పరిశీలన దృష్టి'తో చూడాలని సవినయంగా కోరుకుంటున్నాము. అయితే క్రైస్తవ, ముస్లిం ధార్మిక వ్యవస్థలూ అచ్చం అదే దౌర్భాగ్యానికి గురై ఉన్నాయన్నది గమనార్హం!

ఒకటి- నేటి మన ఒక్క హిందూదేశానికే కాదు, పూర్తి ప్రపంచానికే ప్రాచీన యుగం వైదిక యుగం. రెండోవది- ధర్మం నాల్గు పాదాలా నడచిన కాలానికీ వైదిక యుగమే ప్రామాణికం. ఈ విషయాన్ని సకల హిందూ పీఠాధి పతులూ ఏకగ్రీవంగా అంగీకరిస్తారన్నది ఇక్కడ అత్యంత గమనార్హం. ఆ యుగంలొ ఏకేశ్వరోపాసన తప్ప బహుదైవోపాసన  లేదన్నది ఎవ్వరూ తిరస్కరించలేని ఒక సత్యం. దీనిని బట్టి ఏకేశ్వరోపాశనే తప్ప విగ్రహారాధన ప్రాచీనం కాదని అర్ధం అవుతుంది.


విగ్రహాలు లేని కాలం, విగ్రహాలు ఉన్న కాలం, విగ్రహారాధన కాలం
మన హిందూ ధార్మిక చరిత్రను కాస్త నిశితంగా గమనిస్తే విగ్రహాలు ఏమాత్రం లేని కాలం ఒకటి గడచింది. విగ్రహాలు ఉన్న కాలం ఒకటి గతించింది. అంటే విగ్రహాలు ఉండేవి కానీ వాటి ఆరాధన జరిగేది కాదు. ఈ రెండు కాలాలలోనూ ఏకేశ్వరరాధనే జరిగింది. ఆ తరువాత ఇటీవలి కాలంలొ అంటే సుమారు నాల్గు వందల సంవత్సరాల నుండి విగ్రహారాధన ప్రారంభం అయ్యింది. అంటే అంతకు ముందర కాలంలొ విగ్రహాలను ఆరాధించే దురాచారం ఉండేది కాదన్నమాట.

విగ్రహాల ఆవిర్భావానికి గల మూల కారణం ఏమిటి?
ప్రాచీన కాలంలో అనగా, క్రొత్త-పాత రాతి యుగాలకు పూర్వం మన వైదిక సమాచారం-వాంగ్మయం అనగా పఠనం రూపంలో ఉండేది. ఆనాడు వేద జ్ఞానాన్ని కంటోపాఠం పెట్టిన వారు ఉండేవారు. వారినే స్మర్తలు అంటారు. ఇది విగ్రహాలు లేని కాలం. ఆకాలంలో వేద జ్ఞానం ‘శ్రుతి’ లేక ‘శబ్దం’ రూపంలో సాధారణ వ్యక్తులకు సర్వేశ్వరుని ద్వారా వినిపించబడ్డాయి. అందుకే వాటిని “శ్రుతులు” అని అంటారు. ఇంకా ఆ కారణం చేతనే వాటిని ‘అపౌరుషేయములు’ అని కూడా అంటారు. దాని అర్ధం ఏమిటంటే- మానవ ప్రమేయం లేని ‘ఈశ్వర జ్ఞానము’. ఈ జ్ఞానానికి సంబంధించిన ప్రధాన విషయాలు- అక్షర పరబ్రహ్మ అయిన ఆ సర్వేశ్వరుడు సృష్టి-స్థితి-లయ కారకుడు. దీనినే పొడి అక్షరాలలో ‘GOD’ అని అంటారు. అనగా G for Generator (సృష్టించేవాడు), O for Organizer సృష్టించిన వాటిని (పోషించేవాడు) మరియు D for Destroyer అనగా తను వాటిని ఏదో ఒక రోజు (అంతమొందించేవాడు). దేవుడు మౌలికంగా ఈ మూడు కార్యాలను చేస్తూ ఉంటాడు. ఆయనకు ఉన్న శక్తులు సమర్త్యలు అనంతం. వాటిలో మౌలికమైనవి- ఆయన సకల ఐశ్వర్యాలకు అధిపతి లేక కుబేరుడు. అనగా ‘లక్ష్మి’. అలాగే ఆయన అనంతజ్ఞాని. అనగా ‘సరస్వతి’. ఇంకా ఆయన మహా శక్తిమంతుడు లేక రౌద్రుడు. అనగా ‘కాళీ’ లేక ‘దుర్గ’.

మన పూర్వికులను కొనియాడక తప్పాదు!
క్రొత్త రాతియుగానికి పూర్వం వరకు వాంగ్మయం (Verbal) రూపంలో ఉన్న పైన పేర్కొన్న వైదిక సమచారాన్ని వినికిడి (శ్రవణం) ద్వారా ప్రజలకు అందిస్తూ ఉండేవారు. ‘శబ్దం’ (Audio) కంటే, ‘దృశ్యం’ (Video) ద్వారా మనిషి సమాచారాన్ని వేగంగా గ్రహించగలడు. పాశ్చాత్యులు గత నూట యాభై సంవత్సరాలకు పూర్వం మాత్రమే కనుగొన్నారు.

కాని, మన పుర్వీకులైతే ఈ విషయాన్ని కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే కనుగొన్నారు. అయితే ఆ రోజులలో Art Painting, Video grapy వంటి వాటి పరిజ్ఞానం లేదు. కనుక ‘శిల్ప ఆగమన శాస్త్రము’ను కనిపెట్టి దానిని అభివృద్ధి పరిచారు. దాని ద్వారా ‘శబ్దం’ (Audio) రూపంలో ఉన్న వైదిక సమాచారాన్ని ఉదాహరణకు- నాలుగు ముఖలున్న విగ్రహం చేసి, ‘బ్రహ్మ’ అన్న శబ్దమును ‘దృశ్యం’ (Video) రూపంలోనికి మార్చారు. దీనిని ఆనాడే కనిపెట్టినందుకు మన పూర్వీకులను కొనియాడ వలసిన అవసరం లేదంటారా? ఇంకా అలాగే- కుబేరుడు, అనంతజ్ఞాని, రౌద్రుడు అన్న దేవుని శక్తుల ‘శబ్దా’లకు ‘సరస్వతి’, ‘లక్ష్మి’, ‘కాళీ’ లేక ‘దుర్గ’ వంటి విగ్రహాలుగా ‘దృశ్య’ రూపం ఇచ్చారు. అంటే ఇది ప్రాచీన కాలంనాటి ‘సమాచార సాంకేతిక పరిజ్ఞానం’ (Information Technology). అంటే- ‘అదృశ్య రూపం’లో ఉనికినికి కలిగి ఉన్న అక్షర పర బ్రహ్మకు చెందిన శక్తీ సామర్థ్యాలను ‘దృశ్య రూపం’ ఇవ్వటమైనదన్న మాట! ఈ ఒక్క ధార్మిక విషయాలే కాక సామాజిక, నైతిక, సాంస్కృతిక, లైంగీక తదితర రంగాలకు సంబంధించిన విద్యలనూ శిల్పాలలో మలచి విద్యాబోధనలో దృశ్య, శ్రవణ (Audio and video) పరికరాల వాడుక విధానాన్ని మన పెద్దలు ఆనాడే అవలంభించటం జరిగింది. ఇదే విగ్రహాల ఆవిర్భావానికి గల మూల కారణం. ఆ కాలంలో ప్రజలు విగ్రహాల ద్వారా ఒక్క ‘సమాచారము’ను గ్రహించటం తప్ప ‘ఆరాధన’ను మాత్రం చేసేవారు కాదు. అదే విగ్రహాలు ఉన్న కాలం. ఈ పరిశీలనను బట్టి ఏకేశ్వరోపాసన ప్రాచీనమైనదని మరియు విగ్రహారాధన కాల్పనికమైనదని సుస్పష్టం అయ్యింది.
జైహింద్! 
                                                                                                           M. A. Abhilash 
91+96664 88877
tmcnewstmc@gmail.com

41 Responses to "విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash"

  1. astrojoydFebruary 24, 2016 at 9:46 PM

    కనుక వీటిని 'విమర్శ దృష్టి'తో కాక 'పరిశీలన దృష్టి'తో చూడాలని సవినయంగా .../. విగ్రహారాధన ప్రాచీనమా? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా?.....
    Dear abbilash..hope you understood the idol worship in a negitive way..as history of hinduisam narrated,in the intial stages of religious prayers are just confined to natural things like fire and water/air.earth etc..but as culture progresess,people are questining who is god and what his form.They are not just satisfied wth the priests descriptions of elements of nature as gods form.In such a situation one has show some moorthy roopa of god.so in that way the idol worship started and laymens are satisfied to see some form and shape of god in the form of idols.vedas said that one can start the prayers just wthout any form of/shape of god but if some one not able to concentrate on things that are not seen and start prayer this idol worship given as a primary tool till the person concentrates his mind on prayer.once he gets concentration and fixed his thoughts on prayer,they can remove this idol worship once for all permanently..Are christianity doesnt have this idol worship?if you say your answer no for this question confidently.then why christians are praying in front of a crooss and jesus idols?why mary matha idols are worshiped globally?Every religion has its own traditions and customs.one must study deeply to understand them wth an open mind and broad sense of application and appreciation.your post seems to be senseless.sorry to say this.still you have to read and learn more on this sensitive topic deeply..your post just reflecting your basic knowledge on this topic...

    ReplyDelete
    Replies
      Reply
  2. UnknownFebruary 25, 2016 at 2:01 PM

    గౌరవనీయులు astrojoyd గారికి నమస్కారాలు. మీ విలువైన సమయాన్ని తీసి మా వ్యాసంపై స్పందించినందుకు కృతజ్ఞతలు. మీ కామెంట్లో కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేసి, కొన్ని సలహాలను ఇచ్చారు సంతోషం. ‘విగ్రహాలు’ మరియు వాటి ‘ఆరాధన’ రెండూ వేర్వేరు అంశాలు. విగ్రహాల విషయానికి వస్తే- అవి గొప్ప సమాచార సంకేతాలు మాత్రమే. వాటిని అంత వరకు ఉపయోగించటంలో ఎలాంటి దోషము ఉండదు. ఎంతో విజ్ఞులైన మన పెద్దలు వాటిని మలిచింది కేవలం సమాచార పరిగ్రాహణ కొరకు తప్ప వాటిని ఆరాధించటానికి మాత్రం కాదు కదా!


    అయితే ధనికుడైన ఒక మనిషి బీదవాడైన మరొక మనిషి సేవ ద్వారా దైవాన్ని సంతోషపెట్టే వైదికవి దానాన్ని తుంగలో తొక్కి, నిర్జీవులైన విగ్రహాలకు దైవత్వాన్ని ఆపాదించి, ‘మానవసేవే మాధవసేవ’ అనే మానవతా విధానాన్ని సమాధి చేసి, ‘విగ్రహ ఆరాధనే దేవుని ఆరాధన’ అనే అమానవీయ, అధర్మ విధానాన్ని ప్రవేశపెట్టారు వంచకులైన పండితులు. ఒకవైపు- అభాగ్యులైన లక్షలాది పసి పిల్లలు గుక్కెడు పాలులేక ప్రాణాలు విడుస్తుంటే, మరోవైపు- వేలాది లీటర్లపాలు నిర్జీవ విగ్రహలపై వృథాగా ధారబోస్తున్నారు. ఇది దైవత్వమా?

    ఒకవైపు- సజీవులైన కోట్లాది మనుషులు నిలువ నిడలేక ఎండనక, వాననక చలనక గోదారి గట్లపై, ఫుట్పాత్లపై దుర్భర జీవితాన్ని గడుపుతుంటే, మరోవైపు- ప్రాణంలేని విగ్రహాలకు, మరణించి సమాధులలో నిర్జీవులుగా పడి ఉన్న మహానియులకు లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి గుడులు, చర్చీలు, దర్గాలు నిర్మిస్తున్నారు. ఇది ఆధ్యాత్మికమా? ఇంత దుర్మార్గంగా ప్రవర్తించాలని వేదంలో ఎక్కడ ఉందో, బైబిలులో ఎక్కడ ఉందో, ఖురాన్లో ఎక్కడ ఉందో చూపించండి.

    చాలా మంది విగ్రహారాధన వంటి తమ ధర్మ విరుద్ధ తప్పుడు చేష్టలను సమర్ధించుకోవటానికి కాకమ్మ కథలు అల్లుతుంటారు. అలాంటివారు గుర్తుంచుకోవలసిన ప్రధానమైన విషయం ఏమిటంటే- “ధర్మం పేరుతో ‘చెప్పే మాటల’ను లేక ‘చేసే చేష్టల’ను ధర్మశాస్త్రాలలో ‘రాత పూర్వకం’గా చూపించాలి” అన్నది. ఉదాహరణకు ఈ క్రింది గమనించగలరు.

    “మూర్తి (విగ్రహం) కలది అసత్యం. అముర్తమైనది (విగ్రహం కానిది) సత్యం” అని మైత్రాయ ఉపనిషత్ 5:3 అనే మా శాస్త్రం మాకు తెలియజేస్తుంది. ఇక విగ్రహారాధనను సమర్థించే మీకు అది సత్యమని చెప్పే ఏదైనా శాస్త్రం మీకు ఉందా? ఒకవేళ ఉంటే మేము ఆధార సహితంగా పైన పేర్కొన్నట్లు మీరు కూడా ఆధార సహితంగానే పేర్కొనగలరు. ఎందుకంటే- ధర్మశాస్త్రాల ఆధారాలు లేకుండా ధర్మం గురించి మాటలాడటం అధర్మం కనుక.

    ReplyDelete
    Replies
      Reply
  3. astrojoydFebruary 26, 2016 at 10:50 PM

    మూర్తి (విగ్రహం) కలది అసత్యం. అముర్తమైనది (విగ్రహం కానిది) సత్యం” అని మైత్రాయ ఉపనిషత్5:3 అనే మా శాస్త్రం మాకు తెలియజేస్తుంది./..good statement as you understood it but here upanishads are encoded scriptures.As you thought here the“vigraha represents not the idol లేక మూర్తి as you and i are watching in pictures and temples.Its purely the living physical body of any living and non living form on this earth.we can say it is DEHA or shareera,which is not a actual truth[asatya]but the inner soul or athma is the ultimate truth called the satya..Here i like to give an example for your question..మీరొక సత్య శోధకుడు,మీ కామెంట్లో పేర్కొన్నట్టుగా దేవుళ్ళకు చేసే అభిషేకాలూ-గుళ్ళు-గోపురాలు-మశీదులు-చర్చులు వృధా ఖర్చ్చులే అన్నారు..మూర్తి అసత్యం అని మీరు ఉపనినిషద్లను అర్ధం చేసుకొన్న తీరులోనే వెళదాం..మూర్తి [విగ్రహం కలది]కి పెట్టే ఖర్చు వృధా-అసత్యం అయితే మానవులంత మూర్తులే కదా..మీరు చేయమంటున్న సేవ వారికే కదా..మరి ఆ సేవ వృధా సేవేగా..దీనిని ఎందుకు ఇక్కడ చెప్పానంటే ఉపనిషత్తులను అర్ధం చేసుకోవడం అనేది మహా మహుల వల్లే కాలేదు..వోకోక్కరు వాటిని వొక్కొక విధంగా అర్ధంచేసుకున్తుంటారు,మీరు పై ఉపనిషత్ వాక్యాలను అర్ధం చేసుకున్న విధానం కూడా ఇలానే ఉన్నదని చెప్పడానికే ఇది వ్రాశాను....కేవలం వొక ఉపనిశత్హులను ..అందులోని కొన్ని వాక్యాలను ఉదహరించినంత మాత్రాన అవి మనకు అర్ధమైనట్లు కాదు.. విగ్ర్హరాధనే దైవారాధన కాదు కేవలం మీ మదిలో వొక మూతి రూపును భావించుకోవడం కోసం విగ్రహరాధానం చేయమన్నారు అంతే.. మూర్తి రూపు మదిలో ముద్రితమైన మరుక్షణం నుంచే ఎవరైనా విగ్రహారాధన ను మాని వేయవచ్చును..
    మీరు పది వేలు ఖర్చుపెట్టి మీ పిల్లాడి బర్త్ డే ఘనంగా చేస్తారు అనుకుందాం.నేను వచ్చి ఎందుకండి అంత ఖర్చు ,ఆ డబ్బును ఏ అనాధ శరణాలయానికో ఇవ్వొచ్చుగా అన్నననుకోండి ,అపుడు మీకూ గానీ-మీ భందువులకి గాని ఏమనిపిస్తుంది?అభిషేకాలూ-పూజలూ-ఉత్సవాలు -చర్చలూ-మశీదులూ కూడా మన ఇంట్లో పిల్లాడి బర్త్ డే పార్టి లాంటివే ..ఎవరి ఇష్టం వారిది ..ఇతరుల మత విస్వాశాలమీద మనం బురద చల్లరాదు..అసత్యమైన మూర్తులకు సేవ కంటే అమూర్తమైన సేవ ఉత్హమోత్హమం..ఎవరి భావనలకు అనుగుణంగానో-సమర్ధించుకునేలానో తిప్పుకునేలానో ఉపనిశత్హులు వ్రాయబడలేదని గ్రహించండి..మీరు విష్ణుసహస్రం బాగా చదివారా..?అందులో 77 వ శ్లోకాన్ని మీరు ఏవిధంగా అర్ధంచేసుకున్నారో ఇక్కడ రాయగలరు..ఎందుకంటే దానిని కూడా మేరె మైత్రయాపోనిష్తద్ లా అర్ధం చేసుకుంటే కొంప కొల్లేరు కాగలదు..Thre was a popular incident on vigrharaadhana in the life of vivekanandha,had you gone through it Abbilash ji?ఈఫ్ నాట్ డెల్వ్ ఫర్ ఇట్..once again iam repeating my old advise,before writing this kind of stuff one must be matured in mind and must be an voracious reader of shastras,not once but several times.why your understanding on them wil magically evolutionaised and finally you wil be enlightend well..wish you all the best...

    ReplyDelete
    Replies
    1. UnknownMarch 1, 2016 at 11:23 PM

      //ఉపనిషత్తులను అర్ధం చేసుకోవడం అనేది మహా మహుల వల్లే కాలేదు\\ అటువంటప్పుడు మీరెందుకు వ్యాఖ్యానిస్తున్నారు? ఎవరేమంటారో చూస్తూ ఉండిండి. మహా మహులకే అర్ధంకాని ప్రబోధాలు హిందూధర్మంలో ఉన్నాయానే మీలాంటివారి తప్పుడు వ్యాఖ్యాతల కారణంగానే హిందువులు అన్య మతాలలోనికి వలస కట్టేస్తున్నారు. మీలాంటి వారి వలననే ఎంతో హేతుబధమైన హిందూ ధర్మం ఒక పుక్కిటి పురాణంగా తలాతోక లేని మతంగా అపఖ్యాతిపాలౌతుంది.

      “మూర్తి (విగ్రహం) కలది అసత్యం. అముర్తమైనది (విగ్రహం కానిది) సత్యం” అని మైత్రాయ ఉపనిషత్ 5:3 అని ఎంతొస్పష్టంగా ఉన్న విషయం మహామహులకు అర్థం కావటంలేదా?

      ఏ మహామహులకు హిందూ శాస్త్రాలు అర్థం కావటం లేదని తమరు సెలవిచారో వారు మహామహులు అనబడేవారే తప్ప, వాస్తవంలో వారు మహామహులు కారు! కనీస ఇంగితజ్ఞానం ఉన్న ఎవడికైనా హిందూ శాస్త్రాల ప్రబోధనలు చక్కగా అర్థం ఔతాయి.

      ఎక్కడివరకో ఎందుకు మీరే స్వయంగా- //అయితే మానవులంత మూర్తులే కదా..మీరు చేయమంటున్న సేవ వారికే కదా..మరి ఆ సేవ వృధా సేవేగా\\ అని వ్యఖ్యానించారు. అసలు దీనిని ఎమనుకోవాలి!? మీ తెలివి అనుకోవాలా లేక వెటకారం అనుకోవాలా. మీరు చేసిన ఈ వ్యాఖ్యానం అత్యంత అర్థ రహితం అని మీకు అనిపించటం లేదా!?

      //ఎవరి ఇష్టం వారిది\\ అటువంటప్పుడు మంచి-చెడులను గురించి చెప్పటానికి దేవుడు పంపిన ధర్మశాస్త్రాలు ఎందుకో? మానవులు చేసుకున్న చట్టాలు శాసనాలు ఎందుకో? సెలవిస్తారా? //ఇతరుల మత విస్వాశాలమీద మనం బురద చల్లరాదు\\ అని చెప్పారు. దీనిని బట్టి తమరికి "విమర్శ"కు మరియు "ప్రశంస"కు మధ్య తేడా తెలియదని అర్థం అవుతుంది.

      మీకు నా సవినయ మనవి ఏమిటంటే- హిందూ శాస్త్రాల ప్రబోధనలు సామాన్యులకు అర్థం కావు అనే మీ దుర్మార్గపు ప్రచారాన్ని ఆపేయండి!! ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి చేసి ఇప్పటికే హిందూ జాతి నాశనం అవుతూపోతుంది. ఇది సమాచార యుగం మతం పేరుతో ప్రజలను మోసగించే వారికి కాలం చెల్లనుంది. దానికి భయపడే అయోమం వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఈ హిందూ-క్రైస్తవ-ముస్లిం వంచక పండితులకు సామాన్య ప్రజలే బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయి. కనుక మీలాంటి పెద్దలు అర్థవంతంగా మాట్లాడటం మంచిది.

      Delete
      Replies
        Reply
    2. hari.S.babuMarch 3, 2016 at 4:24 PM

      MA ABHILASH
      మీకు నా సవినయ మనవి ఏమిటంటే- హిందూ శాస్త్రాల ప్రబోధనలు సామాన్యులకు అర్థం కావు అనే మీ దుర్మార్గపు ప్రచారాన్ని ఆపేయండి!! ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి చేసి ఇప్పటికే హిందూ జాతి నాశనం అవుతూపోతుంది. ఇది సమాచార యుగం మతం పేరుతో ప్రజలను మోసగించే వారికి కాలం చెల్లనుంది. దానికి భయపడే అయోమం వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఈ హిందూ-క్రైస్తవ-ముస్లిం వంచక పండితులకు సామాన్య ప్రజలే బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయి. కనుక మీలాంటి పెద్దలు అర్థవంతంగా మాట్లాడటం మంచిది.

      HARIBABU
      మొదట మీరు తేల్చి చెప్పాల్సింది మీకు సంస్కృతం ఎంత బాగా వచ్చు?బలదేవానంద సాగర్ గారి ఒక సంసృత వార్తాపాఠాన్ని మీరు తెలుగులోకి అనువదించహ్గలరా?

      ఆయనెప్పుడో పాతకాలం వాడు,వాటి పూర్తి పాఠాలు దొరకవనుకుంటే ఈ మధ్యనే మోహన్ లాల్ ఒక కార్యక్రమం కోసం సంస్కృతంలో వారత్లు చహ్దివాదు.ఆ వీడియో యూట్యూబులో దొరుకుతుంది - కనీసం దానినయినా అనువదించి చెప్పగలరా?

      మీరు ఇదివరకు ఇక్కడే గీతలో ఒక శ్లోకాన్ని పట్టుకుని రెచ్చిపోయినట్టు రెచ్చిపోతే కుదరదు.ఇక్కడ సంస్కృతబాహాషాప్రవీణులు చాలామంది ఉన్నారు,సిద్ధమేనా పరీక్షకి నిలబడటానికి?

      ముందు సంస్కృతంలో కనీస పరిజ్ఞానం ఉందో లేదో తేల్చి చెప్పండి,తర్వాత ఈ సిద్ధాంతాలు మీకెట్లా అర్ధమయ్యాయో మాకు తెలుస్తుంది!

      Delete
      Replies
        Reply
    3. Reply
  4. ZilebiFebruary 27, 2016 at 8:03 PM

    శిల్ప ఆగమన శాస్త్రము అనగా ఏమి ? విశదీకరించ గలరు

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. hari.S.babuMarch 3, 2016 at 4:07 PM

      శిల్పాలు మట్టిలో నుండి వస్తాయా?రాతిలో నుండి వస్తాయా?మట్టిబుర్రల నుండి వస్తాయా ? - ఇలాంటి పర్శ్నలకి జవాబు చెప్పే బల్లిశాస్త్రం లాంటిది!

      Delete
      Replies
        Reply
    2. శ్యామలీయంMay 29, 2016 at 6:47 PM

      శిల్ప ఆగమన శాస్త్రము!?
      ఇది శిల్పాగమశాస్త్రం అన్న మాటకు వచ్చిన తిప్పలమ్మా! ఆగమ ఆగమన శబ్ధాలు వేర్వేరని కూడా గ్రహింపు లేని సంస్కృతపండితప్రకాండులు తమ అద్భుతశాస్త్రపరిఙ్ఞానంతో సనాతనధర్మానికి సరికొత్తగా వ్యాఖ్యానం అందించి జనబాహుళ్యాన్ని తరింపజేస్తున్నారు. అగమ అని వ్రాయబోయి పొరబటునో గ్రహపాటునో ఒక ముద్రారాక్షసంగా మాత్రమే ఆగమన అని వ్రాసామంటారేమో‌ తెలియదు మరి!

      Delete
      Replies
        Reply
    3. Reply
  5. hari.S.babuMarch 4, 2016 at 8:57 AM

    వివేకం గలవాడికి ఒకసారి చెప్తే అర్ధమవుతుంది.small brain పోస్టు దగ్గిర అంత వివరంగా చెప్పినా మళ్ళీ " మీలాంటి వారి వలననే ఎంతో హేతుబధమైన హిందూ ధర్మం ఒక పుక్కిటి పురాణంగా తలాతోక లేని మతంగా అపఖ్యాతిపాలౌతుంది. " అమి గింజుకుంటున్నారు.గీత మొత్త 18 అధ్యాయాలలో ఒక శ్లోకం తీసుకుని నన్ను గీతామకరందంలో ఒక పేజీ చదవమని హడలగొదదామనుకున్నారు.పైన విగ్రాహారాధనా తత్పరుదైన విద్యాప్రకాశాననదగిరి స్వాముల వారిని విగ్రహారాధనకి వ్యతిరేకంగా నిలబెట్టారు!

    వేదాల్ని మొత్తం చదివి విడదీసిన వేదవ్యాసుడు చెప్పిన గీతలో అంత స్పష్తంగా ఎవరు ఏయే మూర్తిని ఆరాధిస్తే ఆయా మూర్తుల్లో నేనే వాళ్లని అనుగ్రహిస్తాను అని చెప్తే ఇప్ప్పుడు ఆ వేదవ్యాసుణ్ణీ ఆ శ్రీకృష్ణుణ్ణీ అనుసరించే భక్తులలో ఒకడైన వివేకానందుణ్ణీ ఈ రొచ్చుకి సాక్ష్యంగా నిలబెడుతున్నారు.అక్కడ వొద్దు అన్న పనినే మరింత వీరావేశంతో చేస్తున్నారు,హిందువులు అంత ఎర్రిపప్పలుగా కనబడుతున్నారా?

    అక్కడ సాక్ష్యాలు అడిగారు,చూపించాను.మళ్ళీ జవాబు లేదు.మీలాంటి అర్ధపాండిత్యంగాళ్లకి కూడా సాక్ష్యాధారాలు చూపించలేకపోవడానికి నేను అల్లాటప్పా గాణ్ణి కాదు.చిచ్చరపిడుగు హరిబాబుని.ఎవరైనా చాలెంజిలు చేస్తే నాకికా హుషారుగా ఉంటుంది:-) అందులోనూ ఎదటివాళ్ళ నుంచి " బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయి " లాంటి మాటలు వస్తే ఇంక ఎప్పుడెప్పుడు ఈ అమనిషికి బుద్ధి చెబుదామా అని ఇంకా తొందర పుడుతుంది.

    ఇక్కడ కూడా అదే పొరపాటు,వివేకానందుడు వేరే విషయంగా చెప్పిన ప్రవక్తలు/ పురోహితులు కూడా మరియూ 2000 దురాచారాలు అన్నదాన్ని కూడా మీ ఎజ్రండాకి లాక్కొచ్చి కట్టేస్తున్నారు,ఎంత ధైర్యం?

    తెలంగాణ రాష్ట్రం లోని బల్కంపేట లో ఎల్లమ్మ గుడి ఉంది.ఈ ఎల్లమ్మ తంత్రశాస్త్రంలో బాలాత్రిపురసుందరి రహస్య శక్తి అయిన ఛిన్నమస్తాదేవి ప్రతిరూపం.ఈ మాత భూమికి అడుగున 10 అడుగుల లోతున వెలిసిన కారణాన కంచి కామకోటి పీఠాధిపతి శ్రెశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి వారి శ్రీవచనం పర్కారం పైన ఉనన్ మహామందపంలో శ్రీ విరూపాక్ష శంకరాచార్యులు ఒక అఖండజ్యోతిని వెలిగించారు. ఈ ఇద్దరూ వేదం చదవలేదనీ వేదం గురించి వారికన్నా మీకు ఎక్కువ తెలుసనీ మేము అనుకోవాలా!మీరు వాళ్ళిద్దరినీ మోసగాళ్ళు అంటున్నారని మేము ఎందుకు అర్ధం చహెసుకోకూదదు?విగ్రహారాధన/ఏకేశ్వరోపాసన ఏది తీసుకున్నా సరే,వాళ్ళిద్దరికన్నా వేదసాహిత్యంలోవారి పాండిత్యం మీ పాండిత్యం కన్నా ఎక్కువా,తక్కువా? ఇప్పుడు మీరు ఆ ఇద్దర్ని వివేకానందుడి కొటేసహనులో చెప్పీన ఏ వర్గంలో చేరుస్తారు?మీ విశ్లేషణ ప్రకారం వారు గౌరవనీయూలైన పర్వకలుగా తోస్తారా,కుక్షింభరులని మీరు తిడుతున్న పురోహిత వర్గంలోకి వెళ్తారా?వాళ్లని ఏదో ఒక క్యాటగిరీలోకి తోసేముందు బాగా ఆలోచించుకుని నసుగుడూ పిసుకుడూ లేకుండా ఎప్పటికీ మాట మార్చనంత గట్టిగా చెప్పాలి,లేకపోతే చాలా అనర్ధాలు జరుగుతాయి!

    అద్వైత మత స్థాపకుడైన శ్రీ ఆదిసంకరాచార్యూల వారు తన సిద్ధానతాన్ని వేదాల నుంచి తీసుకున్నారన్నది జగమెరిగిన సత్యం!శ్రీ రామానుజుల వారు దానికి భిన్నంగా ఉండే ద్వైతానికి కూడా వేదమే మూలం అనేదీ అందరికె తెలుసు.ఇంకా విచిత్రం వీళ్ళిద్దరూ వేదం లోని ఒకే భాగం నుంచి ఇన్స్పైర్ అయ్యారు.అది మీకు తెలుసా? తెలిస్తే వాళ్ళు ఏ భాగం నుంచి ఇన్స్పైర య్యారో ఆ భాగం ఇద్దరికీ చెరో విధంగా ఎందుకు అర్దమయ్యిందో కూడా చెప్పగలగాలి,ప్రయత్నించండి చూద్దాం - మీ సత్తా ఎంతో! ఏ విధంగా చూసినా - అంటే వాళ్ళిద్దరూ స్పష్టంగా ఒకేలా అర్ధమై కూడా తమ అవసరం కోసం ఉన్న ఒకే అర్ధాన్ని రెండు పూర్ర్తి వ్యతిరేకమైన సిద్ధాంతాలుగా చెప్పినా ,లేదంటే వాళ్లలో ద్రొహబుద్ధి ఏమె లేకపోయినా ఒక్కొక్కడికి ఒక్కొక్కలా అర్ధమైనదనుకున్నా అక్కడ సంక్లిష్తత ఉన్నదనే కదా అర్ధం?!

    మీరు తలకట్టులో చీడ పీడ అని పెట్టి వివేకానందుణ్ణీ మీకు తోడుదొంగగా తెచ్చుకోవటం ద్వారా మీరు ఆదిశంకరుణ్ణీ రామానుకుల్నీ హిందూమతానికి చీడ పట్టించినవాళ్ళు అని తిడుతున్నట్టు, అప్పుడప్పుడూ మీరు "మన హిందూఒమతం" అనటం ఓక్టి గమనించాను,ఏమిటి దానర్ధం?చూడబోతే ఇస్లాములో ఉన్న ఏకేశ్వరోపాసనానీ విగ్రహద్వేషాన్నీ హిందూమతానికి అలవాటు చెయ్యాలని చూస్తున్నట్టు స్పష్తంగా తెలిసిపోతున్నది = మీరు హిందువెలా అవుతారు?తలకి మించిన పనికి దిగకండి,అది కుదిరే పనికాదు.

    ఏమి తెంపరితనం? వివేకానందుడు ఎవరికి శిష్యుడు?శ్రీ రామకృష్ణ పరమహంసకి!ఆయన విగరహారాధనకి వ్యతిరేకియా?పోనీ ఏకేశ్వరోపాసకుడా! వాళ్లకి లేని నమ్మకాల్ని అంటగట్టి వాళ్ళని మీకు సపోర్టుగా తెచ్చుకోవటానికి మీకు సిగ్గుగా లేదా?!?పైన astrojoyd గారి మీద ఏంటో రంకెలు వేస్తున్నారు - హద్దులు దాటకండి, ఖబడ్దార్!
    P.S:నాకు తోచిన హితవు చెప్పాను, అదీ రెండుసార్లు!హితవు ఎక్కకపోతే రణమేశరణ్యం.నా కామెంటుని పబ్లిష్ చెయ్యకుండా మీరు సాధించహ్గలిగేది కూడా శూన్యమే.నాకో బ్లాగు ఉంది.నా భవాల్న్ నేను అక్కడ మరినత్ అగ్ట్టిగా చ్ప్పగలను.గోటితో పోయేదానికి గొడ్డలి వాకు తెచ్చుకోవద్దు.

    ReplyDelete
    Replies
    1. UnknownMarch 5, 2016 at 2:12 PM

      మిత్రులు హరిబాబు గారికి నమస్కారాలు.
      మీరు చాలా ఆవేశానికి లోనవుతున్నారు. ధార్మికులకు, ధార్మిక చర్చలు చేసే వారికి అంత ఆవేశం మంచిది కాదు. ఆవేశం అజ్ఞానానికి గుర్తు. ఎవరి ‘అభిప్రాయాలు’ ఎవరి ‘విశ్వాసాలు’ వారికి ఉంటాయి. అయితే ఏ గ్రంథాలలో అవి ఉన్నాయని ప్రకటిస్తున్నారో ఆ గ్రంథాలలో వాటికి ఆధారాలు చూపించ వలసిన ‘బాధ్యత’ను వారు కలిగి ఉంటారు.
      ఉదాహరణకు: ముస్లిములు- ఖురాను గ్రంథాన్ని చేత పట్టుకొని, సమాధులలో ఉన్న దేవదేవవుని స్నేహితుల (ఔలియా) లేక సిద్ధులను ప్రార్థించవచ్చు, వేడుకోవచ్చు అని ప్రకటిస్తే, ఆ విషయాన్ని ఖురాను గ్రంథంలో చూపించ వలసిన ‘బాధ్యత’ను వారు కలిగి ఉంటారు.
      అలాగే క్రైస్తవులు బైబిలు గ్రంథాన్ని చేత పట్టుకొని- ‘యేసు దేవుడు’, ‘పరిసుద్ధాత్మ దేవుడు’, ‘త్రియేక దేవుడు’ అని ప్రకటిస్తున్నారు. కనుక దానికి బైబిలు నుండి ఆధారం చూపవలసిన ‘బాధ్యత’ను వారు కలిగి ఉంటారు.
      అదేవిధంగా వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత వంటి శాస్త్రాలను ఉటంకిస్తూ, విగ్రహారాధనను సమర్థిస్తున్న మీలాంటి వారు కూడా మాలాంటి వాళ్ళు వాటికి ఆధారాలను చూపమంటే ఎలాంటి ఉద్రేకానికి ఉక్రోశానికి లోనుకాకుండా చూపవలసిన ‘బాధ్యత’ను కలిగి ఉంటారు హరిబబు గారూ!
      ఒకవేళ ‘విగ్రహారాధన చెయ్యవచ్చు’ అని ప్రకటించే మీరు గాని, ‘యేసు దేవుడు’ అని ప్రకటించే క్రైస్తవులు గాని, సమధులలో ఉన్న ‘సిద్ధుల దర్గాలను ప్రార్థించవచ్చు’ అని ప్రకటించే ముస్లిములుగాని హిందూ-క్రైస్తవ-ముస్లిం ధర్మసస్త్రాలను ఉపయోగించకుండా అలాంటి ప్రచారాలు చేసుకుంటే మిమ్మల్ని ప్రశ్నించే అధికారం మాలాంటి వాళ్లకు ఉండదు.
      మీరు ప్రస్తావించిన ఈ రెండు విషయాలూ పూర్తిగా అర్థ రహితం.
      1. సంస్కృంతం తెలియని వారు హిందూ శాస్త్రాలను గురించి మాట్లాడరాదన్నది.
      అదే నిజమైతే సంస్కృంతేతర భాషలలో హిందూ వాంగ్మయాన్ని అనువాదం చేయటంలో అర్థం ఏముంది? ‘యేసు దేవుడు’ అని బైబిలులో ఎక్కడ ఉంది? అని క్రైస్తవ పండితులను ప్రశ్నించినా వారూ అచ్చం మీలాగే మీకు హీబ్రూ భాష వచ్చా? అని ప్రశ్నిస్తూ ఉంటారు. అమాయక ముస్లిములచే శవాల ఆరాధన చేయిస్తున్న ముస్లిం పండితులను ప్రశ్నించినా వారూ మీకు అరబీ భాష వచ్చా? అని ప్రశ్నిస్తూ ఉంటారు. దీనిని బట్టి- తమ తమ అమాయక ప్రజలచే ఈ ధర్మ విరుద్ధ విగ్రహారాధన చేయించే వారందరూ ఒకే బడిలో చదువుకున్నారనిపిస్తుంది!
      వారు ఆవిధంగా ప్రశ్నించటానికి గల కారణం ఒక్కటే- అది అసలు విషయాన్ని తప్పు దోవ పట్టించి, తాము తప్పించుకోవటానికి. ఎందుకంటే- ఈ ధర్మ విరుద్ధ విగ్రహారాధన చేయించే వారి వద్ద దానిని సమర్థించే ఎలాంటి ఆధారాలూ వారి వారి ధర్మ శాస్త్రాలలో కించిత్తు కూడా లేవు! ఈ విగ్రహారాధన పవిత్ర హిందూ-క్రైస్తవ-ముస్లిం ధర్మశాస్త్రాల నిషేధిత అధర్మ ప్రహసనం అన్న వాస్తవం తమ అమాయక భక్తజనం ముందు బయట పడిపోతే తమకు పుట్టగతులుండవనే భయంతో మీకు ఆ భాష వచ్చా? ఈ భాష వచ్చా? అని గోర్రిపోతు గాంబభీర్యాన్ని ప్రదర్శిస్తూ తాటాకు చప్పుళ్ళు చేసి అసలు విషయంలో గందరగోళం సృష్టిస్తుంటారు.

      “మూర్తి (విగ్రహం) కలది అసత్యం. అముర్తమైనది (విగ్రహం కానిది) సత్యం” అని (మైత్రాయ ఉపనిషత్ 5:3) సుస్పష్టంగా ప్రకటిస్తుంది. మీకు సంస్కృతం వచ్చా అని ప్రశ్నించారు. అంటే, సంస్కృతంలో దాని అర్థం- “మూర్తి (విగ్రహం) కలది సత్యం. అముర్తమైనది (విగ్రహం కానిది) అసత్యం” అని తిరగేసి ఏమైనా ఉంటుందా హరిబాబు గారూ!

      Delete
      Replies
        Reply
    2. hari.S.babuMarch 6, 2016 at 12:15 AM

      1. సంస్కృంతం తెలియని వారు హిందూ శాస్త్రాలను గురించి మాట్లాడరాదన్నది.
      అదే నిజమైతే సంస్కృంతేతర భాషలలో హిందూ వాంగ్మయాన్ని అనువాదం చేయటంలో అర్థం ఏముంది?
      ఒరేయి శుంఠా,
      చూపించిన సాక్ష్యాలు బుర్రకి ఎక్కకపోతే మండదా?ఆ పోష్టు దగ్గిర ఒక్క శ్లోకం పట్టుకుని మొత్తం గీత అంతా అదే అర్ద్గ=హం అంటున్నవు.నేను ఆ శ్లోకానికి ముందూ వెంకలఊ తెలుగులో అంత స్పహ్తంగా చూపించినా ఇంకా ఆధారాలు కావాలా?

      సంస్క్రత్మలో ఓ అంటే ఢం తెలియదు వేదశాస్త్రం గురించి వ్యాఖ్యానిస్తావా?హెబ్రూ రాకుండా వచ్చౌ అనేవాణ్ని కూడా వచ్చ అరాదా ని చాలెబ్=ంజి చహెస్తారు.అసలు నీకు కామన్ సెనసే లేనట్టు ఉంది.నీకు ఈ వేదాంతం లాంటి పెద పెద్ద విషయాలు చర్చించే అర్హత లేదు.దుకాణం కట్టెయ్యి.మళ్ళీ

      అలా నువాదం చేసినవాళ్ళు నీలాంటి శుంఠల్కూ అర్ధపాండిత్యం గాల్ళు కాదు.నువ్వు కొటేసహను లాక్కొచ్చి ఈయన విగ్రహారాధన తప్పు అంటున్న శ్రీబ్=విద్యాపర్కాశాననదగిరి స్వాముల వారు జన్మలో ఏనాడూ విగ్రహారాధన చెయ్యలేదని రుజువు చెయ్యమంటే గుద్లు మిటకరించి నాకు తెలియదని ఎందుకన్నావు?

      నేను సాక్షయాధారాల్తో గీతలోని ముందూ వెనకా శ్లోకాల్ని ఉదహరించే చూపించాను సాక్షాత్తూ వేదవ్యాసుడే ఏయేఅ మూర్తులుగ అకొలిస్తే ఆయా మూర్తులుగా వాళ్లని అనుగ్రజ్=హిస్తాను అన్నాదని.ఆ సాక్ష్యం కూడా నీ బుర్రకి ఎకక్లేదంటే నీది ఏం బుర్ర!సాక్ష్యాలు చూప్నంచాక గూడా ఇంక్ సాక్ష్యాలు చూపించహ్నట్టు ఎతకారాలు ఆదకు.

      ఇంతకాలం మర్యాదస్తుడివీ,ఏదో జ్ఞానతృష్నతో ఉన్నావని అనుకున్నాను.ఒకసారి ప్లాను ప్రకారమే మొండిగా ఇటా బరితెగించావని తేలిశాక గూడా ఇంకా ఆవేసపడకుండా ఎలా ఉంటాను.

      వొద్దు,అనస్వసరంగా నీ పరువు బజార్న పెట్టుకోవద్దు.

      Delete
      Replies
        Reply
    3. hari.S.babuMarch 6, 2016 at 12:34 AM

      @you
      “మూర్తి (విగ్రహం) కలది అసత్యం. అముర్తమైనది (విగ్రహం కానిది) సత్యం” అని (మైత్రాయ ఉపనిషత్ 5:3) సుస్పష్టంగా ప్రకటిస్తుంది. మీకు సంస్కృతం వచ్చా అని ప్రశ్నించారు. అంటే, సంస్కృతంలో దాని అర్థం- “మూర్తి (విగ్రహం) కలది సత్యం. అముర్తమైనది (విగ్రహం కానిది) అసత్యం” అని తిరగేసి ఏమైనా ఉంటుందా హరిబాబు గారూ!

      haribabu
      నాకు సంస్కృతం రాదు,నేను ఒప్పుకుంటున్నాను.నీకు సంస్కృతం రాదు.కానీ వచ్చినట్టు బిల్డప్ ఇస్తున్నావు.నువు నన్ను వదలకుండా పట్టుకుని జీదీపాకంలా పీకినా నాకేమీ కాదు.నీలాంతి అర్ధపాండిత్యంగాడికి బహ్యపడి పారిపోను.

      "బ్రహ్మ సత్యం జగన్మిధ్య" అన్నారు,అంటే బ్రహామ్ము కలిస్తేనే దేనికైనా స్త్యమైన ఉనికి వస్తుంది,కాబట్టి కనిపించకపోయినా బ్రజ్=హమము సత్యం అన్నారు.బ్రహ్మమూ కలవక్పోతే కంపించేది ఉండదు కనక మన కళ్ళకి కనిపించించ్గిన ఐది అబద్ధంతో సమానం అన్నారు.నీకు ఎట్లా అర్ధం అయితే అట్లా పీకటానికి అవి పిజ్జాలూ బర్గర్లూ కాదు - శుంఠనర శుంఠా!నువు లాగి పాఎకి నామీద వ్దులుతునన్ ఒకటో రెండో కొతేషన్లకి చుటూ ఏముందో తెలుసుకు చావు.నీకే తెలుస్తుంది.

      ఇంతకీ వేదాల గురించి శంకరాచార్యుడికి ఎక్కువ తెలి=ఉసా?

      Delete
      Replies
        Reply
    4. hari.S.babuMarch 6, 2016 at 6:48 AM

      @YOU
      మీరు చాలా ఆవేశానికి లోనవుతున్నారు. ధార్మికులకు, ధార్మిక చర్చలు చేసే వారికి అంత ఆవేశం మంచిది కాదు. ఆవేశం అజ్ఞానానికి గుర్తు. ఎవరి ‘అభిప్రాయాలు’ ఎవరి ‘విశ్వాసాలు’ వారికి ఉంటాయి. అయితే ఏ గ్రంథాలలో అవి ఉన్నాయని ప్రకటిస్తున్నారో ఆ గ్రంథాలలో వాటికి ఆధారాలు చూపించ వలసిన ‘బాధ్యత’ను వారు కలిగి ఉంటారు.
      @ME
      ముందు నువ్వు రాసేఅ రాతల్లో అబద్ధాలౌ చెప్పకుండా శుద్ధంగా రాయటం నేర్చుకో.మహనీయులతో దొంగసాక్ష్యాలు చెప్పించహ్కుండా ముందు నువ్వు బాధ్యతగా ఉందమంటున్నను.నాకు బాధ్యత గిఉరించి పాఠాలు చెప్పకు
      @YOU
      అదేవిధంగా వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత వంటి శాస్త్రాలను ఉటంకిస్తూ, విగ్రహారాధనను సమర్థిస్తున్న మీలాంటి వారు కూడా మాలాంటి వాళ్ళు వాటికి ఆధారాలను చూపమంటే ఎలాంటి ఉద్రేకానికి ఉక్రోశానికి లోనుకాకుండా చూపవలసిన ‘బాధ్యత’ను కలిగి ఉంటారు హరిబబు గారూ!
      @ME
      మరి నువ్వు గీత నంచీ,వివేఅకాక్నందుడి గురించీ ఎందుకు ఉటంకిస్తున్నావురా స్కవుండర్ల్?పైగా వాళ్ళొక అర్ధంతో చెప్తే నుబ్=వ్వు ఇంకొక అర్ధం లాగుతున్నావు.నాకు నీతులు చెప్పకు,నువ్వు నీతిని ఫాలో అవ్వు.
      @YOU
      వారూ అచ్చం మీలాగే మీకు హీబ్రూ భాష వచ్చా? అని ప్రశ్నిస్తూ ఉంటారు.
      @ME
      అవును, నీలా అల్లమంటే తెలియదా బెల్లంలా పుల్లగా ఉంటుంది అన్నట్టు రానిది వచ్చని చెప్పుకుంటే ఎవడయినా నిలదీస్తాడు.
      @YOU
      వారు ఆవిధంగా ప్రశ్నించటానికి గల కారణం ఒక్కటే- అది అసలు విషయాన్ని తప్పు దోవ పట్టించి, తాము తప్పించుకోవటానికి. ఎందుకంటే- ఈ ధర్మ విరుద్ధ విగ్రహారాధన చేయించే వారి వద్ద దానిని సమర్థించే ఎలాంటి ఆధారాలూ వారి వారి ధర్మ శాస్త్రాలలో కించిత్తు కూడా లేవు!
      @ME
      ఇక్కడ నువ్వు సాక్ష్యాలు లేకుండా వదరుతూ,మహనీయులని వాళ్ళ అభిప్రాయాలకి విర్య్ద్ధంగా నిలబెడుతూ ఎందుకీ దుర్మార్గం చేస్తున్నావు అని నేను అడిగిన దానికి చెప్పకుండా దైవర్ట్ చేస్తున్నది నువ్వు!అసలు సంస్కృతమే రానివాడివి నువ్వెట్లా అంత గట్టిగా "వారి వారి ధర్మ శాస్త్రాలలో కించిత్తు కూడా లేవు" అని చెప్తున్నావు?మమంల్ని సాక్ష్యాలు చూపించని దబాయిస్తావేంటి సిగ్గు లేకుండా!
      @YOU
      ఈ భాష వచ్చా? అని గోర్రిపోతు గాంబభీర్యాన్ని ప్రదర్శిస్తూ తాటాకు చప్పుళ్ళు చేసి అసలు విషయంలో గందరగోళం సృష్టిస్తుంటారు.
      @ME
      సూటిగా నువు చెప్తున అబద్ధాలని గురించి నిలదీస్తుంటే గందరగోళం ఏముంది,నేనిక్కడ నువ్వడిగే చెత్త ప్రశ్న్లకి సాక్ష్యాలు చూపించటానికి ముందు నువ్వు రాసే రాతలకి నిక్కచ్చి సాక్ష్యాలు పెట్టుకుని వొళ్ళు దగ్గిర పెట్టుకుని రాయమంటున్నాను.

      P.S:అయినా నువ్వు ఒక్క శ్లోకాన్ని ఉటంకిస్తే నేను దానికి ముందు వెనకల శ్లోకాల్న్నీ ఉటంకించాను.అది సాక్ష్యం కాదా?

      Delete
      Replies
        Reply
    5. Reply
  6. UnknownMarch 5, 2016 at 2:13 PM



    2. ‘ఏకేశ్వర వాదం ముస్లిములది’ మరియు ‘బహుదైవ వాదం’ లేక ‘విగ్రహారాధన వాదం హిందువులది’ అన్నది.

    ఇది కూడా అత్యంత అసమంజసం. ఎందుకంటే- అటు కైస్తవులు సుమారు ఆరువేల సంవత్సరాల నుండి, ఇటు ముస్లిములు పదిహేను వందల సంవత్సరాల నుండి విగ్రహారాధనను ఖండిస్తున్నారు. మరి మన హిందూ శాస్త్రాలు అంతకంటే పురతనమైనవి కదా! అవి ఏవిధంగా విధంగా విగ్రహారాధనను ఖండిస్తున్నాయో ఈ క్రింది గమనించగలరు.

    ఆ పరమసత్త ఈ జగత్తును ఎంతో ఆక్రమించుకొనియున్నది. దానికి రూపం లేదు, శోకము లేదు. దీనిని తెలుసుకున్నవారు అమరులవుతారు.ఇతరులందరూ దు:ఖాన్ని అనుభవించాల్సిందే. శ్వేతాశ్వతరోపనిషత్త్ -3:10

    విషయము (విగ్రహము) ను ధ్యానించు పురుషుని యొక్క మనస్సు విషయమందే (విగ్రహమందే) రమించును. నన్ను (సర్వేశ్వరుని) స్మరించు వాని చిత్తము నా (సర్వేశ్వరుని) యందే లీనమగును. యోగశిఖోపనిషత్ 3:6

    ఎవరైతే ప్రాకృతిక వస్తువులను (గాలి,నీరు మొ//వాటిని) ఉపాసిస్తారో వారు చీకటి (నరకం)లో ప్రవేశిస్తారు. ఎవరైతే సంభూతి (సృష్టితాలు- మానవునిచేత తయారయ్యే వస్తువులను, బొమ్మలను) ఉపాసిస్తారో వారు మరింత అంధకారంలోకి ప్రవేశిస్తారు. -యజుర్వేదం 40:9

    ప్రపంచ ధార్మిక చరిత్రలో పై మంత్రాలు కలిగిన గ్రంథాల తరువాతే బైబిలు-ఖురాన్ గ్రంధాలు అవతరించాయి. అంటే- ‘విగ్రహారాధన ధర్మ విరుద్ధం’. ‘విగ్రహారాధకులు మరింత అంధకారం (నరకం) లోకి పోతారు’ వంటి విషయాలు వైదిక భావజాలం నుండే ముందుగా ఉద్భవించాయని అర్థం అవుతుంది. కనుక ‘ఏకేశ్వర వాదం ముస్లిములది’ మరియు ‘విగ్రహారాధన హిందువులది’ అనే మీ వాదన అత్యంత అర్థరహితం అయిపోతుందన్నది మీరు అగమనించాలి హరిబాబు గారూ!

    వైదిక చరిత్ర ప్రకారం ఏకేశ్వర ఉపసనే ప్రాచీనం! దీనిని మీరు కాదనగలరా?

    మన ప్రాచీన బారత వైదిక పరిజ్ఞానం కారణంగా- జాతి జ్ఞాన, విజ్ఞాన రంగాలలో యావత్ ప్రపంచానికి దిక్సూచిగా ఉన్న కాలంలో భారతీయులు ‘ఏకేశ్వరోపాసకులు’గానే ఉండేవారు. స్వార్థపరులైన పండితుల కారణంగా వైదిక జ్ఞానం మరుగు పరచబడి, సామాన్య ప్రజలలో అజ్ఞానం ప్రబలింది. అలాంటి అజ్ఞాన కాలంలో అజ్ఞానులైన ప్రజలకు వేగంగా జ్ఞానాభ్యాసం చేయించాలనే సదాశయంతో ఈ క్రింది పని చేయటమైనది.

    మూలం: అజ్ఞానం భావనార్ధాయ ప్రతీమాః పరికల్పితాః తాత్పర్యం: మూఢులకు భావనకై విగ్రహాలు కల్పించబడ్డాయి –దర్శనోపనిషత్తు 4:5
    పరోక్షాన్ని సరాసరిగా గ్రహించలేని అజ్ఞానుల కొరకు ‘ప్రత్యక్షం ద్వారా పరోక్షము’ను (Unknown through known) గ్రహించే బోధనా సూత్రం ఆధారంగా విగ్రహాల పరికల్పన జరిగింది. అవి నిర్మించబడింది- తోటి మనుషులను వదిలేసి, వాటినికి ధూపదీప నైవేద్యాలు పెట్టి అర్చనలు అర్పణలు చెయ్యటానికి కాదు. పై మంత్రం ప్రకారం- విగ్రహాలు కేవలం అజ్ఞానుల కొరకు తప్ప జ్ఞానుల కొరకు మాత్రం కాదన్నది హిందూ శాస్త్రాల తీర్మానం. అయితే తమ సామాన్య ప్రజలను అజ్ఞానం నుండి తప్పించి జ్ఞానులుగా మార్చాలనే ఉద్దేశం అధికశాతం హిందూ-క్రైస్తవ-ముస్లిం పండితులకు ఏమాత్రం లేదు. ఎందుకంటే- విగ్రహారాధనను వదలి ఎకేశ్వరారాధనను ప్రజలు అవలంబిస్తే, వంచక పండితుల గుప్పెటలో ఉండరు. అలాగాని జరిగితే అమాయక ప్రజలను దోచుకోవటం వారికి సధ్యం కాదు.

    అలాగే తమ ధర్మవిరుద్ధ విగ్రహారాధనకు హిందూ-క్రైస్తవ-ముస్లిం ధర్మశాస్త్రాల నుండి ఆధారాలు చూపనంత వరకు మేము మిమ్మల్ని వదిలేది లేదు. ఇదీ సంగతి. ఈ విషయంలో మీలాగా ఉత్సాహాన్ని ప్రదర్శించిన పండితుల కోసమే మేము ఎదురు చూస్తున్నాము. కాక పోతే మీరు ఆవేశంతో కాక, గ్రంధాల ఆధారంగా మాటలాడని కోరుతున్నాను.

    ReplyDelete
    Replies
    1. hari.S.babuMarch 6, 2016 at 12:20 AM

      మరోసారి "మరి మన హిందూ శాస్త్రాలు " అన్నావంటే మర్యాద దక్కదు - జాగ్రత!నువ్వు హిందువు వేంటి?చీ చీ!

      Delete
      Replies
        Reply
    2. hari.S.babuMarch 6, 2016 at 12:24 AM

      భగవద్గీతలో "విగ్రహారాధన" మేలని చెప్పడం జరిగిందా !? వేదాల ప్రకారం దేవునికి రూపం ఉందా !?

      శ్లోకం 12.1 : కృష్ణావతారాన్ని పూజించడం లేదా అశరీర రూపుడైన పరబ్రహ్మాన్ని కొలవడం, ఈ రెండింటిలో ఏది ఖచ్ఛితమైన విధానం ? అని అర్జునుడు కృష్ణున్ని అడుగితాడు.

      శ్లోకం 12.2: ఎవరైతే తన కృష్ణ అవతారాన్ని లేదా రూపాన్ని, నిత్యం పూజిస్తారో, తన పట్ల విశ్వాసాన్ని కలిగి ఉంటారో వారు సరైన విధానమును పాటిస్తున్నారు అని చెబుతాడు.

      శ్లోకం 12.3 & 12.4 : అయితే, రూపములేని పరబ్రహ్మగా, మానవుని ఇంద్రియాలకు (Senses) అందని వానిగా, ఈ సృష్టినంతా ఆక్రమించుకున్న వానిగా, నిత్య సత్యముగా ఉన్న నా మరో అంశముపై విశ్వాసం ఉంచి పూజించెదరో వారు కూడా చివరకి నన్ను చేరుకొనెదరు.

      12.5 : ఎవరైతే, నిరాకార స్వరూపాన్ని, అనంత స్వరూపాన్ని పూజిస్తారో వారు మోక్షాన్ని చేరుకోవడం కష్టం అవుతుంది. ఈ పద్దతిద్వారా మోక్షాన్ని చేరుకోవడం కష్టమవుతుంది.

      12. 6- 7 : ఎవరైతే నన్ను పూజిస్తారో, తన కర్మలను నాకు అంకితమిచ్చెదరో, ఎటువంటి నియమోల్లంఘన లేకుండా నన్ను సేవించెదరో, ఎల్లప్పుడూ నన్నే పూజిస్తూ ఉండెదరో వారికి నేను మోక్షాన్ని ప్రసాదించెందను.

      12.8: నీ మనస్సును, దేవతలకే దేవతనైన (Supreme Godhead) నాయందే లగ్నము చేయుము. దానివలన నీవు నాయందే నివసించెదవు.

      ఇంకో విషయం, కొంత మంది అనుకుంటున్నట్లుగా "నిరాకార బ్రహ్మన్" నుండి కృష్ణుడు రాలేదు. కృష్ణుడి నుండే "నిరాకార బ్రహ్నన్" వచ్చాడు. అంటే .. కృష్ణుడి మరో అంశమే రూపములేని దేవుడు. భగవద్గీతలో ఇది కూడా చెప్పబడుతుంది, ఈ శ్లోకములో ..

      brahmano hi pratisthaham
      amrtasyavyayasya ca
      sasvatasya ca dharmasya
      sukhasyaikantikasya ca

      Word for word:
      brahmanah — of the impersonal brahma-jyotir; hi — certainly; pratistha — the rest; aham — I am; amrtasya — of the immortal; avyayasya — of the imperishable; ca — also; sasvatasya — of the eternal; ca — and; dharmasya — of the constitutional position; sukhasya — of happiness; aikantikasya — ultimate; ca — also.

      Translation:
      And I am the basis of the impersonal Brahman, which is immortal, imperishable and eternal and is the constitutional position of ultimate happiness.

      సింపులుగా చెప్పుకుంటే, నిరాకార బ్రహ్మన్ కు నేనే మూలము అని కృష్ణుడు తేల్చిచెప్పాడు.

      Delete
      Replies
        Reply
    3. hari.S.babuMarch 6, 2016 at 9:34 AM

      @YOU
      అలాగే తమ ధర్మవిరుద్ధ విగ్రహారాధనకు హిందూ-క్రైస్తవ-ముస్లిం ధర్మశాస్త్రాల నుండి ఆధారాలు చూపనంత వరకు మేము మిమ్మల్ని వదిలేది లేదు. ఇదీ సంగతి. ఈ విషయంలో మీలాగా ఉత్సాహాన్ని ప్రదర్శించిన పండితుల కోసమే మేము ఎదురు చూస్తున్నాము. కాక పోతే మీరు ఆవేశంతో కాక, గ్రంధాల ఆధారంగా మాటలాడని కోరుతున్నాను.

      @ME
      సూటిగా నువు చెప్తున అబద్ధాలని గురించి నిలదీస్తుంటే గందరగోళం ఏముంది,నేనిక్కడ నువ్వడిగే చెత్త ప్రశ్న్లకి సాక్ష్యాలు చూపించటానికి ముందు నువ్వు రాసే రాతలకి నిక్కచ్చి సాక్ష్యాలు పెట్టుకుని వొళ్ళు దగ్గిర పెట్టుకుని రాయమంటున్నాను.

      అయినా నువ్వు ఒక్క శ్లోకాన్ని ఉటంకిస్తే నేను దానికి ముందు వెనకల శ్లోకాల్న్నీ ఉటంకించాను.అది సాక్ష్యం కాదా?

      Delete
      Replies
        Reply
    4. hari.S.babuMarch 6, 2016 at 10:18 AM

      @YOU
      కనుక ‘ఏకేశ్వర వాదం ముస్లిములది’ మరియు ‘విగ్రహారాధన హిందువులది’ అనే మీ వాదన అత్యంత అర్థరహితం అయిపోతుందన్నది మీరు అగమనించాలి హరిబాబు గారూ!

      @HARIBABU
      నేను నీకు మొత్తం మూడు సూటి ప్రశ్నలు వేశాను 666 పోష్టు దగ్గిరా ఇక్కడా కలిపి
      1.గీతలో మొత్తం 10 శ్లోకాలుగా బహుళ దేఅవతారాధననీ,విగ్రహారాధననీ సమధిస్తున్న చోతు నుంచి ఆ ఒక్క శ్లోకాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉతంకించి తప్పుడు అర్ధం చెప్పి గీత ఆ రెంటికీ వ్యతిరేకంగా చెప్తున్నది అని ఎందుకు వదరుతున్నావు?

      2.ప్రతిరోజూ లక్ష్మీ నారాయణుల విగ్రహాలని పొజించహె పరమ నైష్ఠికుదైన శ్రీవైష్నవ స్వామిని విగ్రహారాధనకి వ్యతిరేకిగా దొంగసాక్ష్యం ఎందుకు చెప్పించావు?

      3.ఒక వ్యక్తి యొక్క అభిప్రాయాల్ని అతనికి ఉన్న అభిప్రాయాలకి విరుద్ధంగా చెప్తున్నాడని బుకాయించిన నీకు అసలు నైతికతయే లేనప్పుడు ధార్మిక విషయాల గురించి ఇతరుల్ని నిల్దేఎసే అర్హత ఎట్లా వస్తుంది?

      4.వేదవిభజాన్ చహెసిన వ్యాసుడు రాసిన గీతలో చెప్పిన విష్యాన్ని నువ్వు చీడ అంతే వేద్వ్యాసుడు,ఆ వేదాల మీద ఆధారపడి జగదుగురువుగా గౌరవించహ్బడుతున్న సకంకరాచార్యుణ్ణి చీదపురుగు అంటున్న నువ్వు ఏ "మన పెదల" గురించి ఏ "మన సంప్రదాయం" గురించి నీతులు చెప్తున్నావు?

      5.ఈ రెండు పోష్టుల్లోనూ నేనూ డిగిన పశ్నలకి సమాధానం చెప్పడం నీ బాధ్యత!మూడో ప్రశ్న అతి ముఖ్యమైనది.ముదు నువ్వు ఇదివరకు చేసిన దొంగపనికి క్షమాపన చెప్పుకుని తర్వాత నువ్వు మమ్మల్ని ఏదయినా అడిగటం మర్యాద.మొదట నువ్వు చెయ్యాల్సిన పని చహెసి తర్వాత రెండో పనికి రా!

      P.s:"అలాగే తమ ధర్మవిరుద్ధ విగ్రహారాధనకు హిందూ-క్రైస్తవ-ముస్లిం ధర్మశాస్త్రాల నుండి ఆధారాలు చూపనంత వరకు మేము మిమ్మల్ని వదిలేది లేదు." అంటున్నావు, అర్ధపాండిత్యంతో అబద్ధాలు చెప్తూ పోటుగాడి మల్లే వీరంగాలు వెయ్యకు..నా ప్రశ్నలకి జవాబు చెప్పననత్వరకు నేనేఅ నిన్ను వదలను, - బస్తీ మే సవాల్

      Delete
      Replies
        Reply
    5. Reply
  7. ZilebiMarch 5, 2016 at 3:50 PM

    ?? వైదిక చరిత్ర ప్రకారం ఏకేశ్వర ఉపసనే ప్రాచీనం! దీనిని మీరు కాదనగలరా?

    ఈ పై వాక్యాన్ని విశదీకరించ గలరు !
    అగ్ని వరుణ గట్రా దేవుళ్ళ ని ఉపాసన జేసిన వారలు వైదీక చరిత్ర ప్రకారం ఎట్లా ఏకేశ్వర ఉపాసన ప్రాచీనం చేసారు ?



    జిలేబి

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయంMay 29, 2016 at 6:50 PM

      బాగా చెప్పారు.

      Delete
      Replies
        Reply
    2. Reply
  8. hari.S.babuMarch 6, 2016 at 6:19 AM

    మమ్మల్ని సాక్ష్యాలూ అడగటం కాదురా అటాచోర్!న్వ్వు రాసేది శుద్దంగా రాయమంటున్నాను.567465465 పోస్టు దగ్గిర నువ్వు చేసింది ఏంటి?గీతలో విగ్రహారాధనని సమర్ధించుతూ చెపిన 10 శ్లోకాల మధ్యన ఉన్న శ్లోకాన్ని విడిగా తీసి విగ్రహారాధనని వతిరేకిస్తున్నదని అంటున్నావు.మొత్తం శ్లోకాలన్నీ సాక్ష్యానికి చూపించాను గదా!

    అదీగాక,రోజూ లక్ష్మీనారత్యణుల విగ్రహాలని పూజించే విద్యాప్రకాశానందగిరి స్వామిని తీసుకొచ్చి విగ్రహారాధన వ్యతిరేకిగా దొంగసాక్ష్యం చెప్పిస్తున్నావు.,ముందు నువ్వు అబద్దాలు చెప్పటం మానుకోమంటే అది చెయ్యకుండా ఇంకా తెంపరిగా వదరుతావేంటి?ఇపటివరకు గౌరవంగా బతికావు,అభిమానులు ఊడా ఉండి ఉండాలి.తన్నులు తిని నీ అభిమానులు కష్టపెట్టుకునే వరకు తెచ్చుకోవద్దు.

    ముందు నువు రాసే రాతలకి గట్టి సాక్ష్యాలు చూపించడం నేర్చుకో,మమల్ని సాక్ష్యాలు అడిగేముందు - ముస్తఫ్ఫా అహ్మద్ జఫ్ఫా!

    ReplyDelete
    Replies
      Reply
  9. hari.S.babuMarch 8, 2016 at 2:06 AM

    Mr.Mustafaa Ahmed abhilash,
    ఇన్నాళ్ళూ మీరు కేవలం జ్ఞానతృష్ణతో గంభీరమైన శాస్త్రచర్చ చేస్తున్నారని అనుకున్నాను.కానీ,మీరు ఏ మతస్థులో నాకు తెలియదు కానీ సనాతన ధర్మాన్ని"మన మతం" అనీ ఇక్కడి గురువులిని గురంచి "మన పెద్దలు" అంటూ మీరు గీత లోని శ్లోకాల్ని తప్పుడు అర్ధాలతో వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు.small brain పోస్టు దగ్గిర మీరు చెస్తున్న తప్పు ఏమిటో స్పష్తంగా చెప్పాను. అయినా సరే,దాని గురించి ఏమాత్రం పట్టించుకోకుండా recent పోస్టులో చతుర్వేదసారం క్షుణ్ణంగా తెలిసిన వేదవ్యాసుడూ వేదప్రోత్ధితమైన అద్వైత సంప్రదాయ స్థాపకుడైన జగద్గురువు శంకరాచార్యుడూ సనాతనదహర్మానికి అంతకుముందు లేని విగ్రహారాధన పీడను పట్టించిన చీదపురుగులు అని అంటున్నారు!

    ఇది ఈ రెండు పోస్టులకే పరిమితమై ఉంటే నేను కూడా మీరు పొరపాటు చేస్తున్నారని సమ్యమనంగానే వ్యవారించేవాణ్ణి.కానీ మీరు సనాతనధర్మం గురించి ఎప్పుడు ప్రస్తావించినా తప్పుడు వ్యాఖ్యానాలతో చెలరేగిపోతున్నారు.ముఖ్యంగా నాకు పూర్తిగా అధికారం ఉన్న వేదవిభజన చేసి సకల ధర్మస్రామెరిగి పంచమవేదమని కొనియాడబడుతున్న జయేతిహాసం నడిమధ్యన వేదవ్యాసుడు సాక్షాత్తూ భగవంతుని ముఖం నుండి వచ్చినదని చెప్తూ రచించిన అష్తాదశాధ్యాయి అయిన గీతని మీరు వక్రీకరించి అవమానిస్తున్నారు. ఇతరుల కెవరికో ప్రజలు బుద్ధి చెప్పే రోజులు వచ్చాయని రెచ్చిపోతున్నారు,మీరు బుద్ధి తెచ్చుకునే రోజు ఇప్పటికి వచ్చిందని గమనించండి!
    మీరు చేస్తున్న ఉద్దేశపూర్వకమైన తప్పులు రెండు.ఒకటి – small brain పోస్టు దగ్గిర చెప్పినట్టు ఒక విషయం గురించి పది విభిన్నమైన విషయాల్ని చెప్పి వీటన్నింట్ని మణుల్ని కలిపే సూత్రంలా ఒక సామాన్యతని అనుసంధానించి ఒకే విషయంగా కలిపి చెప్తుంటే అందులోనుంచి ఒక ముక్కని మాత్రమే ఎత్తి చూపిస్తున్నారు.రెందవది - శ్రీవిద్యాపరకాశానాందగిరిస్వామి,స్వామి వివేకానందుడు మొదలైన విగ్రహారాధకుల్ని తీసుకొచ్చి మీ ఎజెండాకి దొంగ/తప్పుడు సాక్ష్యం చెప్పించుకుంటున్నారు. దానితో నైతీకంగా దిగజారిపోయి మనిషిగా సగం చచ్చారు. మతమంటే నలుగుర్ని పోగేసుకుని ఒక ఫేస్బుక్ గ్రూపుని క్రియేట్ చేసుకుని కొటేషన్లు కట్/కాపీ/పేస్టు చేసుకుంటూ లక్ష హిట్లూ,వెయ్యి లైకులూ,వంద షేర్లూ తెచ్చుకుని మురిసిపోయే ముతకయవ్వారం కాదు. ప్రజల్ని నైతికంగా ఉన్నతంగా నిలబెట్టడం కోసం అవసరమైన భావ సంచయం,ఆచరణ బద్ధమైన ప్రణాళిక,అందరూ పరస్పరం సహకరించుకుంటూ ప్రశాంతంగా జీవించడానికి ఉపయోగపడే సామాజిక ఒప్పందం.మీ వాదనకి సాక్ష్యంగా విగ్రహారాధకుల్ని తీసుకొచ్చి దొంగ సాక్ష్యాలు చెప్పించే అధమాధమ నైతిక స్థాయిలో ఉన్న మీకు ఇతర్లకి నీతిని బోధించే అర్హత లేదు,తలకి మించిన భారం ఎత్తుకోవద్దన్నది అందుకే,మర్యాదగా చెప్పినప్పుడు వింటేనే మీ తల క్షేమంగా ఉంటుంది.మీ అంతట మీరు ఆవేశం తగ్గించుకోకుండా అగ్నిలో దూకినాక మీరు శలభంలా మాడిపోవడానికి ఇతర్ల బాధ్యత ఎంతమాత్రం ఉందదు - ఖబడ్దార్!.
    TO BE CONTINUED

    ReplyDelete
    Replies
      Reply
  10. hari.S.babuMarch 8, 2016 at 2:07 AM

    CONTINUED FROM ABOVE
    సాక్ష్యం అని గంభీరమైన పేరు పెట్టుకుని మీరు చేస్తున్న యెడ్దెంతెడ్డెం పనికి సాక్ష్యం ఇది:
    1). “విగ్రహారాధన” సత్యమని నిరూపించాలనుకునే వారి ఆశ చివరికి అడియాశే - పోస్టులో ఉదహరించిన శ్లోకాలకి మీరు చెప్పీన అర్ధం చదువుతుంటే మీరు మామూలుగా మనిషులకే పుట్టారా లేక డెమియన్ ఓమెన్ సినిమాలో లాంటి పుట్టుకా అనిపిస్తున్నది.మీకు కష్టంగా ఉన్నా సరే నా మనసులో అనిపించినది అది - ఆ ఆలోచన రావటానికి మీ ప్రవర్తనయే కారణం,సాక్ష్యం చూపిస్తాను కూడా!

    మీరు ఏదైతే ఉతంకించారో దానిని నేను ఒక్క ముక్క కూడా మార్చను, దాని మూలం ఉదహరించి అది ఎక్కడ ఏ అర్ధంతో చెప్పబడిందో దాని ముందు వెనకల శ్లోకాలతో కలిసి ఇచ్చే అర్ధాన్నీ చెప్తాను,జాగ్రత్తగా చదవండి. మీరు గీత నుంచి ఉదహరించిన మొదటి శ్లోకం 12:05 కదా! మీరు ఇచ్చిన అర్ధవిశ్లేషణ ఇట్లా ఉంది,:
    శాస్త్ర విరుద్ధమైన విగ్రహారాధనను సమర్ధించుకొనే కంగారులోపడి 12:5 వ శ్లోకాన్ని మీరు గమనించలేదు. అందులో చెప్పబడుతుందేమిటో ఈ క్రింది గమనించగలరు.
    అవ్యక్త (నిర్గుణ) అక్షరపరబ్రహ్మము నందు ఆసక్తిగల మనస్సుగల వారికి
    (బ్రహ్మమందు నిష్ఠను బొందుటలో సగుణోపాసకులకంటే) ప్రయాస చాల
    అధికముగ నుండును. ఏలయనిన, నిర్గుణోపాసనా మార్గము దేహాభిమానముగాల
    వారిచేత అతికష్టముగా పొందబడుచున్నది. -12:5
    బహుశా శుక్రాచార్య గారిని కాబోలు కంగారుపడి ఈ ఒక్క శ్లోకాన్ని చదవలేదని వెక్కిరిస్తున్నారు.కానీ అది దానికి ముందు వెనకల ఉన్న శ్లోకాలతో కలిసిన మొత్తం అర్ధం ఇలా ఉంటుంది:
    అవ్యక్తాసక్తులౌ వారి మార్గమ్ము కొంత క్లిష్టమ్ము
    దేహవంతుల కవ్యక్త జ్ఞాన మబ్బుట కష్టము
    12:5
    సర్వకర్మల నెవ్వారు నాయన్ దర్పించి మత్పరుతు
    అనన్య ధ్యాన యోగాన నన్నుపాసించుచుందురో
    12:6
    ఉద్ధరింతును నేను వారిని మృత్యుసంసార వార్ధి యందు
    అచిరమ్ముననే పార్ధ! మదావేశిత చిత్తులన్!
    12:7
    అట్లా తనమీద భక్తి కుదరడానికి అది చెప్పి అది కుదరకపోతే అభ్యాసయోగం పాటించమంటున్నాడు
    ***స్థిరంగ మది నా మీదన్ నిల్పజాలకున్నచో
    అభ్యాస యోగమున్ బూని నన్ను పొంద తలంచుము
    12:9
    అభ్యాస యోగము అంటే మళ్ళీవిగ్రహాన్ని పెట్టుకోవటం దగ్గిర్నుంచి ప్రార్ధన,శ్రవణం,కీర్తన ఇలాంటివన్నీ వస్తాయి. శుక్రాచార్యని కంగారు పడ్డాడని వెక్కిరిస్తున్న మీకు మరి ఈ మొత్తం శ్లోకాల మధ్యలో ఉన్నటి ఆ శ్లోకపు అర్ధం ఒంట్లో కొవ్వు ఎక్కువగా ఉందటం వల్ల కళ్ళు మసకలు గమ్మి కనిపించలేదనుకుంటాను,అంతేనా!
    ఎక్కడ ఏ ముక్క దొరికితే దాన్నల్లా నీ "హిందూ ధర్మ ఇస్లామీకరణ" ఎజెండాకి లాగేసుకోవటమేనా?దానికి ముందూ వెనకా ఉన్న మొత్తం అర్ధం అక్కరలేదా?

    ఎజెండాతో ఉండి మొండిగా అబద్ధాలు కూడా చెప్తూ బండవాదనలు చేస్తూ వస్తున్నావు గాబట్టి మారి దారికొస్తావనే నమ్మకం లేకపోయినా శిక్ష వేసేముందు న్యాయమూర్తి తాను ఎందుకు శిక్ష విధిస్తున్నాడో కారణం చెప్పాలి గాబట్టి ఇప్పుడు చెప్తున్నది ఏకాగ్రబుద్ధితో చదువు.
    అజుండ,నవ్యయాత్ముండన్,భూతేశ్వరుండ నైనను
    నా ప్రకృతి సహాయాన జన్మింతు నాత్మ మాయచె
    04-06
    ఎప్పుడెప్పుడు ధర్మాని కేర్పడున్ గ్లాని
    అధర్మము వృద్ధియౌ నప్పుడీ భువిన్ పుట్టెద
    04-07
    సాధు సంరక్షణార్ధం, దుష్కృత నాశనార్ధం
    ర్మ సంస్థాపనార్ధమై యుగయుగాన పుట్టెద
    04-08
    ***నా దివ్యజన్మమున్,కర్మ నెవ్వన్ డెరుంగు తత్వతః
    వా డొందడు పునర్జన్మ - చేరును నన్నే పార్ధ!
    04-09
    ఇక్కడ స్పష్టంగా దేహధారియైన తనని గురించి తెలుసుకోమంటున్నట్టు ఉంది,తన జన్మనీ తబు చేసిన పనుల్నీ అర్ధం చేసుకున్నవాడికి పునర్జన్మ ఉండదు అని భగవాన్ శ్రీకృష్ణుడు బల్లగుద్ది చెప్రున్నాడు!
    యజ్ఞార్ధ కర్మ కానట్టి కర్మయె బంధ హేతువు
    యజ్ఞార్ధ కర్మ ను కౌంతేయ - చేయు మసంగివై
    03-09
    యజ్ఞ శిష్టాశియౌ పుణ్యు నెట్టి కిల్బిష మంటదు
    ఆత్మార్ధం వండుకో నెంచు పాపియె అఘమ్ము తినున్
    03-13
    గీత మొత్తం 18 అధ్యాయాలూ కర్మయోగము,భక్తి యోగము,జ్ఞాన యోగము అనే మూడు జీవన మార్గాలకు ఒక్కోదానికీ ఆరేసి అధ్యాయాల చొప్పున కేటాయించి కర్మ షట్కము,భక్తి షట్కము, జ్ఞాన షట్కము అని లెక్క ప్రకారం విభజించబడి ఉన్నాయి.ఏ ఒక్క ముక్కా ర్యాండం రివిలెషన్ కాదు.సూత్రాన మణుల్ని గుచ్చినట్టు అంతర్లీనమగా ఒక్కదాన్ని గురించే చెబుతూ కొన్ని చోట్ల మరింత జాజ్వల్యవంతమైన భావాల్ని మణులుగా మెరిపిస్తూ కూర్చిన ఒక ఏకోన్ముఖమైన ప్రణాళిక ఉంది.
    TO BE CONTINUED

    ReplyDelete
    Replies
      Reply
  11. hari.S.babuMarch 8, 2016 at 2:08 AM

    CONTINUED FROM ABOVE
    సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాల నందనః
    పార్ధో వత్సః సుధీర్భోక్తా గీతామృతం మహత్!
    అనే ఆర్యోక్తి ప్రకారం సకల వేదసారం ఇందులో ఉంది.అన్ని ఉపనిషత్తుల్నీ క్రోడీకరించి ఇందులో కూర్చడం జరిగింది.ఒక్కో శ్లోకం ఒక్కో ఉపనిషత్తుకి సమానం. భగవద్గీతలో అంతర్లీనంగా చెప్పబడిన ఏకోన్ముఖమైన ప్రణాళిక మంచి పనులు మాత్రమే చేస్తూ చెడు కోరికల్ని నిగ్రహించుకుంటూ స్థితప్రజ్ఞుడిగా బతకమని చెప్పటం.అనతే కానీ, ఆ మంచి పనుల్ని మూర్త్యారాధనతో కలిపి చెయ్యాలా లేక అమూర్త్యారాధనతో కలిపి చెయ్యాలా అనేది ముఖ్యం కాదు.అట్లాగే ఒకే అదేవుణ్ణి పూజిస్తూ మంచిపనులు చెయ్యటం మంచిదా,అలా కాకుండా అనేకమంది దేవుళ్ళని పూజిస్తూ మంచిపన్లు చెయ్యటం తప్పా అనేది కూడా ఆ ప్రణాళికలో భాగం కాదు.

    ***ఎవ్వరే రీతిగా కొల్చితే కొల్చితే వారినట్లె అనుగ్రహింతు పార్ధ!
    మనుజు లందరు అంతాన అభిసరించేది నన్నె
    04-11
    ***ఇహంలో కర్మసంసిద్ధిన్ కోరి దేవాళిన్ కొల్తురు
    సిద్ధి మానుషలోకాన శీఘ్రమె కల్గు కర్మ లందు
    04-12
    ఇక్కడ స్పష్టంగా ఎవరు ఎట్లా కొల్చిన అనుగ్రహిస్తాను, ఇహలోక కర్మల సాఫల్యానికి ఇతర దేవతల్ని ఆశ్రయించితే అవి కూడా నెరవేరుతాయి అని చెప్తున్నట్టు అర్ధమవుతున్నది కదా!
    దేవపూజన యజ్ఞాన కొల్తురు కొందరు యోగులు,
    బ్రహ్మాగ్నిన్ యజ్ఞ హవిస్సున వ్రేల్తురు మరి కొందరు
    04-25
    శ్రోత్రాదింద్రియముల్ కొందరర్పింత్రు సంయమాగ్నిన్
    శబ్దాది విషయాలన్ కొందరర్పింతు రింద్రియాగ్నిన్
    04-26
    కొందరు నియతాహారుల్ ప్రాణాలను వ్రేల్తురు ప్రాణాగ్నిన్
    యజ్ఞవిదులె వీరందరు - యజ్ఞ వినష్త కల్మషుల్
    04-30
    ఇన్ని చోట్ల ఇని తీర్ల గీతలో నన్ను ఏ విధంగానైనా అర్చించవచ్చు,ఫలానా విధంగానే అక్కర్లేదు అని చెప్తూ ఉంటే గీత ఏకేశ్వరోపాసన తప్ప బహుళ దేవతరాధన చెయ్యొద్దు అని చెప్తున్నదని వదరుతున్నావంటే నువ్వు నోటికి తింటున్నది అన్నమా,గడ్డియా,మరొకటా! పైగా ఏదీ చూపించమని ఎదటివాళ్ళకి సవాల్ళు విసురుతున్నావు.701 1అని శ్లోకాలు లెక్కపెట్టిన వాడికి ఇవి కనపడకనే అనత్ రెచ్చిపోతున్నావా బటాచోర్?

    సాంఖ్య,యోగాలు బాలురకె,కాదు వేత్తకు
    ఒకట సిద్ధుడౌ వాడు రెండింతను సిద్ధి నొందును
    05-04
    యోగం అంటే ధ్యానం,శ్రవణం,కీర్తనం వంటి ప్రక్రియలతో భగవత్ సంస్పర్శ్న సుఖాన్ని అనుభవించహ్టం,సాంఖ్యం అంటే జ్ఞానోపాసన,అనగా కొన్ని ప్రశ్నలకి జవబౌలు దొరికినప్పుడు ఆననదించటం - ఈ రెంటిలో దేనినీ ఒకటి అధికం మరొకటి అల్పం అని చెప్పటం లేదు.ఇట్లా ప్రతి చోటా సాధనా మార్గం ఏదయినా సరే లక్ష్యాన్ని చేరుకోవటమే ముఖ్యం అని చెప్తుంటే విగ్రహారాధన చెయ్యనే వొద్దని చెప్తుంది గీత,విగ్రహారాధన చెయ్యమని ప్రోత్సహించే సాంకేతీకపరమిన ముక్క ఎకక్దయినా ఉనదేమో చూపించహండి అని దబాయిస్తున్నావంటే నువ్వు ఉగ్రవాదుల కన్నా భయంకరమైన మనస్తత్వంలో ఉన్నావని తెలుస్తున్నది - నిన్ను నిలువునా చంపేసినా పాపం ఉండదు!

    నాల్గు విధమ్ములౌ వారు నన్ను భజింతు రర్జున
    జిజ్ఞాసు,వార్తు,డర్ధార్ధి,జ్ఞానియున్ భరతర్షభ!
    07-16
    వారిలో జ్ఞాని నిత్యయుక్తుండు,భక్తుడు,శిష్టుడు,
    నాపై వాని కత్యంత ప్రీతి,నాకు నట్టుఎలె వాని పయిన్
    07-17
    ***ఉదారుల్ నల్వురున్,ఐన జ్ఞాని కాకాత్మయె నిజం!
    యుక్తాత్మున్ డుండు నాయందె అనుత్తమ గతిన్ గనున్
    07-18
    ***బహుజన్మల అంతాన జ్ఞానవంతుడు పొందు నన్ను
    వాసుదేవుండె సర్వమ్మంచెంచు వారతి దుర్లభం
    07-19
    ***నానా కామహృతజ్ఞానుల్ కొల్చెద రన్య దేవతలన్
    ప్రకృతివశ్యులై వారి కేవేబొ మొక్కుకొంచును
    07-20
    ***ఏయే మూర్తుల మద్భక్తున్ దర్చింపగోరు శ్రద్ధగ నన్ను
    ఆయా మూర్తులపై నేనే వారిలో శ్రద్ధ నిల్పెదన్
    07-21
    ***అమిత శ్రద్ధతో వాడు వారిన్ కొల్వగ బూనును
    నేనె తీర్తును తద్వాంచలు - వాడును చరితార్ధుదవును
    07-22
    నీకు గడ్డి పెట్టి చెబుతున్నంత స్పష్టంగా నన్ను ఏదయినా మూర్తిలో కొలవాలనుకుంటే వారిలో ఆ మూర్తి పైన శ్రద్ధను కూడా నేనే నిలబెడతాను అని చెప్తున్న ఈ శ్లోకం చాలు గదా నీకు విగ్రహారాధననీ బహుళ దేవతారాధననీ సమర్ధిస్తున్నదని తెలియటానికి?!
    TO BE CONTINUED

    ReplyDelete
    Replies
      Reply
  12. hari.S.babuMarch 8, 2016 at 2:09 AM

    CONTINUED FROM ABOVE
    పన్నెండవ అధ్యాయం మొదలవటమే వ్యక్తోపాసన,అవ్యక్తోపాసన - ఈ రెంటిలో ఏది శ్రేష్ఠం అనే అర్జునుని ప్రశ్నతోనే మొదలవుతుంది.
    సతత యుక్తుడై నిన్ను పర్యుపాసించు భక్తుడా?
    అవ్యక్తోపాసియౌ వాడా?ఎవ్వండు మేటి యోగులందు!
    12-01
    దానికి భగవాన్ శ్రీకౄష్ణుడు మొదట వ్యక్తోపాసన గురించి చెప్తున్నాడు,ఏ ఒక్క అక్షరంలోనైనా విమర్శిస్తున్నాడేమో భూతద్దం తెచ్చుకుని వెతికి చూసుకో!
    నిత్యయుక్తి నుపాసింత్రు మతి నాపైన నిల్పుచు
    పరమశ్రద్ధ నెవ్వారు యుక్తతములు వారలె
    12-02
    అవ్యక్తునిన్,అనిర్దేశ్యునిన్ పర్యుపాసింతు రెవ్వరు
    సర్వవ్యాపకున్,అచింత్యున్,కూటస్థున్,అచలున్,ఢృవున్
    12-03
    ఇంద్రియాలను నిర్జించి సర్వత్ర సమబుద్ధులై
    సర్వ భూత హితాసక్తుల్ నన్నె పొందెద రెల్లరున్
    12-04
    మూడు శ్లోకాల్లో ఇంత సుదీర్ఘంగా వ్యక్తోపాసనని మెచ్చుకున్నాక అప్పుడు అవ్యక్తోపాసన గురించి ఎత్తుకోవడమే కష్తంగా ఉంటుంది అని 12-05లోనే చెప్పి 12-09 శ్లోకం దగ్గిర కొచ్చ్చేసరికే మరీ కష్తంగా ఉంటే అభ్యాస యోగం ఉండనే ఉందిగా అనన్ ముక్తాయింపు తగిలించడం జరిగింది,అంటే ఏమిటన్న మాట - వ్యక్తోపాసనకే ఎక్కువ మార్కులు వేస్తున్నది గీత!

    గీతలో 701 శ్లోకాలు ఉన్నాయని తెలిసిన నీకు,గీతలో విగ్రహారాధనని సమర్ధిస్తూ ఒక్కచోట కూడా లేదని ఇంతకాలం నుంచీ అందర్నీ దబాయిస్తున్న నీకు,ఉంటే చూపించండని అందర్నీ బెదిరిస్తున్న నీకు,small brain పోస్టు దగ్గిరే కొన్ని ఆధారాలు చూపిస్తే మళ్ళీ చీడ-పీడ పోస్టు దగ్గిర కూడా నాకు ఆవేశం తగ్గించుకోమని నీతులు చెప్తూ నీకు సంస్కృతం రాదని యాడవకుండా వచ్చా అని అడిగినందుకు గొర్రిపోతు గాంభీర్యమని నన్ను వెక్కిరిస్తూ మళ్ళీ ఆధారాలు అడుగుతున్న నీకు ఇంత కాలం నుంచీ ఇవి కనపడలేదా?కళ్ళు మసకలు గమ్మాయా?మైండు దొబిందా?ఒంటికి పట్టిన కొవ్వు చూడనివ్వలేదా?
    -----------------------------
    శ్లోకాలకి తప్పుడు అర్ధం ఇవ్వడాన్ని అర్ధం కాక చేశారని సరిపెట్టుకెవచ్చు,కానీ వివేకానందుణ్ణీ విద్యాపరకాశాననదగిరి స్వామినీ తప్పుడు సాక్ష్యానికి వాడుకుని వేద్వ్యాసుణ్ణీ శంకరాచార్యుణ్ణీ చీడపురుగుల కింద తీసిపారెయ్యటం మాత్రం క్షమించరాని నేరం.మిమ్మల్ని ఎందుకు చేశారు అని అడిగే ఉద్దేశం నాకు లేదు,మీకు సమర్ధించుకోవడానికి అవకాశం నేను ఇవ్వ్వదల్చుకోలేదు.మతం,ముక్తి,ఆధ్యాత్మికత,శాస్త్రచర్చ లాంటి గంభీరమైఅన్ విషయాలకి పోకుండానే మీరు చేసింది తప్పు అని నిర్ధారణగా చెప్పవచ్చు.
    TO BE CONTINUED

    ReplyDelete
    Replies
      Reply
  13. hari.S.babuMarch 8, 2016 at 2:10 AM

    CONTINUED FROM ABOVE
    గత రెండు పోష్టుల లోను నేను మీతో చర్చించేటందుకు వెయ్యలేదు కామెంట్లు.కయ్యానికైనా వియ్యానికైన సమఉజ్జీ ఉండాలి.ఏ విషయంలో చూసినా మీరు నాకు సమఉజ్జీ కాదు.

    ఇక్కడ నేను చేస్తున్నది ఏమిటో ఒకసారి గమనించండి.small brain పోస్టులో మీరు చేస్తున్న తప్పు ఏమిటో చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చాను.మీరు నా హెచ్చరికని అలక్ష్యం చేసి అనతకన్నా తీవ్రమైన తప్పు చేశారు.పైగా నాకు ఆవేశంతో మాట్లాడుతున్నానని నీతులు చెప్తూ గతపోస్టులోనే ఆధారాలు చూపించినా ఇంకా దర్శనొపనిషత్తూ తొక్కోపనిషత్తూ తోలోపనిషత్తూ అని మళ్ళీ ఆధారాలతో రమ్మని వదరుతున్నారు.

    కాబట్టి కొన్ని ఏళ్ళ నుంచి మెరు చేస్తున్న తప్పునే కొనసాగించదల్చుకున్నారని తేలిపోయింది. ఇప్పుడు నేను చేస్తున్నది ఏమిటంటే వ్యాసపరాశరాదిషిర్డీసాయినాధపర్యంతం ఉన్న సత్యధర్మన్యాయప్రతిష్ఠితమిన నా గురుపరంపర పాదాల సాక్షిగా ప్రమాణం చేసి ఈ మహాశివరాత్రి నాటి లింగోద్బవ వేళలో మీరు చాలాకాలం నుంచి కనీసపు ఆత్మవిమర్శ కూడా లేకుండా చేస్తున్న నేరాన్ని సక్ష్యాధారాలతో నిరూపించి రాగద్వేషాలౌ లేని నిండు మనస్సుతో మిమ్మల్ని ఆధ్యాత్మిక ఉగ్రవాదిగా తీర్మానించి ఎలాంటి సర్దుబాట్లు లేకుండా మిమ్మ్మల్ని కఠినంగా శిక్షించడం తపనిసరి అని తీర్పు ఇవ్వడం.

    "సాక్ష్యం" అన్న పేరూగ్ల ఈ బ్లాగులో "హిందూమతం - విగ్రహారాధన - బహుళ దేవతారాధన" గురించిన పోష్టులను తొలగించాలి.ఇకముందు మీరు ఈ విషయాలకు సంబంధించిన విషయాలతో పోస్టులు వెయ్యడానికి వీలు లేదు.
    ఇంతకుముందు ఇక్కడికి వచ్చి వాదించినవాళ్లకి గీతలో అంతగా పాండిత్యం లేకపోవడం వల్ల మీ డాబుసరి వదరుబోతుతనానికి ఫెయిలై వెనక్కి రిరిగి వెళ్ళారు.కానీ ఇప్పుడు మీముందు నిలబడినది సాక్షాత్తూ గీతాచార్యుడే!

    "నామీద తీర్పు చెప్పడానికి మీరెవరు?నన్ను శిక్షించే అధికారం మీకెవరిచ్చారు?మీ తీర్పుకి కట్టుబడకపోతే మీరేం చెయ్యగలరు?" - అని ఎదురు ప్రశ్నించి లాభం లేదు.ఎదటివాడు తప్పు చేశాడని తెలిసి ధర్మాధర్మ విచక్షణ జ్ఞానం ఉన్నవాడు తీర్పులు చెప్పవచ్చు!ఏది న్యాయం?ఏదన్యాయం అని తేల్చి చెప్పడానికి కాగితం ముక్కల మీద అచ్చుకొట్టిన డిగ్రీలు అక్కరలెదు.

    మీలో పరిస్థితిని అర్ధం చేసుకునే వివేకం ఉంటే తీర్పుకి మీ అంతట మీరు కట్టుబడి ఇంతకు ముందరి పోష్టుల్ని తొలగించి ఇకముందు హిందూమతం గురించి ప్రస్తావించకుండా ఉండగలుగుతారు - మీ మర్యాద నిలబడుతుంది!అప్పుడు యోగీశ్వరుడైన కృష్ణుడూ ధనుర్ధరుడైన పార్ధుడూ విడివిడిగా పుట్టారు,కానీ ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి హరిబాబుగా పుట్టారు.అటువంటివాడు ఇచ్చిన తీర్పు వ్యర్ధం కాదు - ఖచ్చితంగా అమలు జరుగుతుంది.
    WAITING FOR YOUR RESPONSE!

    ReplyDelete
    Replies
      Reply
  14. Dileep.MMarch 8, 2016 at 12:38 PM

    మరో విషయం.. ప్రాచీనమైన ప్రతీదీ గొప్పగాదు,శాస్త్రీయమైనదీగానవసరం లేదు.

    ReplyDelete
    Replies
      Reply
  15. hari.S.babuMarch 9, 2016 at 8:11 AM

    Anonymous8 March 2016 at 07:14
    Abhilash is his pen name. He is 100% muslim. Not sure if he is the same one but in google found below details.

    Name: Mustak Ahmad Muhammad, Pen Name: Abhilash; Born in East Godavari, Mandapet. Currently @ Kakinada. His video is there in sakshyamtv. రచనలు: 2. సృష్టికర్త మనశ్శాంతి, 3. యేసు ఎవరు?, 4. దేవుడు తృతీయమా? ఒక్కడా? 5. ఏసు దేవుడా? మెస్సయ్యా?, 6. విజయవంతమైన యేసు సంస్కరణా విధానం, 7. ఖురాన్‌ సందేశ విధానం, 8. ప్రస్థానం (2008) గ్రంథాలను ప్రచురించారు. etc.,
    Anonymous8 March 2016 at 15:06
    No doubt. He is the person who is physically challenged

    haribabu
    No doubt,Now that you proved yourself you are morally also challenged

    P.S:we can sympathize about your physically challengedness,but moral ceipledness cannot be forgiven.
    if you believe god,wait for his punishment.

    ReplyDelete
    Replies
      Reply
  16. AravindMarch 9, 2016 at 10:36 AM

    M.A.Abhilashగారి ఆర్టికల్స్ అయినా,పుస్తకాలైనా జ్ఞానయుక్తంగా ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు.ఇకపోతే హిందూ మతంలో నిర్గుణోపాసన అనేది ఉన్నతస్థితి. ఆ స్థితిలో ఉన్నవారికి విగ్రహారాధననే స్థితి అధమస్థితే కాబట్టి,వారు నిర్గణోపాసకులను అర్ధం చేసుకోవడం కష్టం.పై ఆర్టికల్ యొక్క టైటిల్ చీడ,పీడ అనే పదాలు తొలగించగలరు..విషయ పరిజ్ఞానంతో విషయ స్పందన ఉండాలి తప్ప వ్యక్తిగత దూషణలు సంస్కారరహితమైనవి.అభిలాష్ గారివంటి ధార్మికులతో పరుష పదజాలం వదలరాదు.

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయంMay 29, 2016 at 6:53 PM

      ఉద్దేశపూర్వకంగా, నిందావాక్యాలతో తప్పుడు ప్రచారాలు చేసేవారిని ధార్మికులు అనటం అసమంజసం!

      Delete
      Replies
        Reply
    2. AravindJune 8, 2016 at 3:35 PM

      మరి ఎవర్ని అనాలి మిస్టర్ శ్యామలీయం మాష్టార్? మిమ్మల్నా? గట్టిగా ఎవరైనా నిలబెడితే బ్లాగులన్నీ దాటుకుంటూ అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోతారు.మీరు పదాల మధ్య ఉన్న దోషాలు ఎంచడం తప్ప మీ దగ్గర సబ్జెక్ట్ ఎక్కడుంది? కాస్త విమర్శించే ముందు ఒకసారి ఆలోచించుకోవడం మంచిదని నా అభిప్రాయం మిష్టర్ మాష్టార్.....గారు!

      Delete
      Replies
        Reply
    3. Reply
  17. UnknownMarch 9, 2016 at 6:21 PM

    అరవింద్ గారి సూచన మేరకు పాత అంశమును తొలగించి విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా అని మార్చడమైనది. "సాక్ష్యం మేగజైన్" ఒక మత వర్గానికి ఏమాత్రం కొమ్ము కాసేది,మిగతా మత వర్గాలను ఖండించేది ఎంతమాత్రం కాదని మనవి. ఇకపోతే ఏమత వర్గానికి సంబంధించిన రచయితయినా "సాక్ష్యం మేగజైన్" కి పంపవచ్చు. అవి వాస్తవసిద్ధి కలిగియుంటే తప్పక ప్రచురించబడతాయి. విమర్శలకు,వార్నింగులకు ఈ సైట్ వేదిక కాదని మనవి

    ReplyDelete
    Replies
    1. hari.S.babuMarch 9, 2016 at 8:56 PM

      శ్రీమాన్ అభిలాష్ గారు గొప్ప జ్ఞానులే అయితే నేను ఎటువంటి వ్యతిరేకతా వ్యక్తం చహెసేవాణ్ణి గాదు.వారికి ఉన్న విగ్రహారాధన పట్ల ఉన్న వ్యతిరేకతనీ ఏకేశ్వరోపాసన పట్ల ఉన్న అభిమానాన్నీ హిందూమతంలో కూడా మూలమూలనుంచీ వెదికి పట్టుకొచ్చి విగ్రహారాధకులూ బహుళ దేఅవతారాధకులూ అయిన హిందువుల్ని పాపులూ నీచులూ అనడం వల్లనే నేను అంత ఘాటుగా జవాబు చెప్పవలసి వచ్చింది!ఒక మనిషి సమతా స్థితికి భంగం కలిగిస్తూ ఇతర్లని తనతో పాటూ ఒకవైపుకి ఎక్కువగా లాగుతుంటే అతన్ని తిరిగి సమతా స్థితికి తీసుకు రావాలంటే రెట్టింపు బలం ఉపయోగించాలి కదా!

      ఇప్పుడు మీరంటున్నారే,"ఇకపోతే హిందూ మతంలో నిర్గుణోపాసన అనేది ఉన్నతస్థితి. ఆ స్థితిలో ఉన్నవారికి విగ్రహారాధననే స్థితి అధమస్థితే కాబట్టి,వారు నిర్గణోపాసకులను అర్ధం చేసుకోవడం కష్టం" అని - ఆ ఉద్దేశం ఆయనగారికి ఉండి ఉంటే ఈ గొడవ వచ్చేది కాదు.small brain పోష్టులో ఎంతో సంయమనం చూపించాను.సవిస్తరంగా ఆయనగారు అడిగినట్టు సాక్ష్యం కూడా చూపించాను.దానికి ఆయన ప్రతిస్పందన ఈ పోష్టు.ఇక్కడ ఆయనగారి భాష మరియూ అభిప్రాయాలూ ఇలా ఉన్నాయి,పైన ఆయనగారు ఇచ్చిన జవాబులో చూశారు గదా:
      --------------------
      1).చాలా మంది విగ్రహారాధన వంటి తమ ధర్మ విరుద్ధ తప్పుడు చేష్టలను సమర్ధించుకోవటానికి కాకమ్మ కథలు అల్లుతుంటారు.
      2).మహా మహులకే అర్ధంకాని ప్రబోధాలు హిందూధర్మంలో ఉన్నాయానే మీలాంటివారి తప్పుడు వ్యాఖ్యాతల కారణంగానే హిందువులు అన్య మతాలలోనికి వలస కట్టేస్తున్నారు. మీలాంటి వారి వలననే ఎంతో హేతుబధమైన హిందూ ధర్మం ఒక పుక్కిటి పురాణంగా తలాతోక లేని మతంగా అపఖ్యాతిపాలౌతుంది.
      3).ఏ మహామహులకు హిందూ శాస్త్రాలు అర్థం కావటం లేదని తమరు సెలవిచారో వారు మహామహులు అనబడేవారే తప్ప, వాస్తవంలో వారు మహామహులు కారు! కనీస ఇంగితజ్ఞానం ఉన్న ఎవడికైనా హిందూ శాస్త్రాల ప్రబోధనలు చక్కగా అర్థం ఔతాయి.
      4).//ఎవరి ఇష్టం వారిది\\ అటువంటప్పుడు మంచి-చెడులను గురించి చెప్పటానికి దేవుడు పంపిన ధర్మశాస్త్రాలు ఎందుకో? మానవులు చేసుకున్న చట్టాలు శాసనాలు ఎందుకో? సెలవిస్తారా? //ఇతరుల మత విస్వాశాలమీద మనం బురద చల్లరాదు\\ అని చెప్పారు. దీనిని బట్టి తమరికి "విమర్శ"కు మరియు "ప్రశంస"కు మధ్య తేడా తెలియదని అర్థం అవుతుంది.
      5).మిత్రులు హరిబాబు గారికి నమస్కారాలు.
      మీరు చాలా ఆవేశానికి లోనవుతున్నారు. ధార్మికులకు, ధార్మిక చర్చలు చేసే వారికి అంత ఆవేశం మంచిది కాదు. ఆవేశం అజ్ఞానానికి గుర్తు. ఎవరి ‘అభిప్రాయాలు’ ఎవరి ‘విశ్వాసాలు’ వారికి ఉంటాయి. అయితే ఏ గ్రంథాలలో అవి ఉన్నాయని ప్రకటిస్తున్నారో ఆ గ్రంథాలలో వాటికి ఆధారాలు చూపించ వలసిన ‘బాధ్యత’ను వారు కలిగి ఉంటారు.
      TO BE CONTINUED

      Delete
      Replies
        Reply
    2. hari.S.babuMarch 9, 2016 at 8:56 PM

      CONTINUED FROM ABOVE
      6).ధర్మశాస్త్రాల నిషేధిత అధర్మ ప్రహసనం అన్న వాస్తవం తమ అమాయక భక్తజనం ముందు బయట పడిపోతే తమకు పుట్టగతులుండవనే భయంతో మీకు ఆ భాష వచ్చా? ఈ భాష వచ్చా? అని గోర్రిపోతు గాంబభీర్యాన్ని ప్రదర్శిస్తూ తాటాకు చప్పుళ్ళు చేసి అసలు విషయంలో గందరగోళం సృష్టిస్తుంటారు.
      7).@he
      వైదిక చరిత్ర ప్రకారం ఏకేశ్వర ఉపసనే ప్రాచీనం! దీనిని మీరు కాదనగలరా?
      @zilebi
      అగ్ని వరుణ గట్రా దేవుళ్ళ ని ఉపాసన జేసిన వారలు వైదీక చరిత్ర ప్రకారం ఎట్లా ఏకేశ్వర ఉపాసన ప్రాచీనం చేసారు ?
      8).పరోక్షాన్ని సరాసరిగా గ్రహించలేని అజ్ఞానుల కొరకు ‘ప్రత్యక్షం ద్వారా పరోక్షము’ను (Unknown through known) గ్రహించే బోధనా సూత్రం ఆధారంగా విగ్రహాల పరికల్పన జరిగింది. అవి నిర్మించబడింది- తోటి మనుషులను వదిలేసి, వాటినికి ధూపదీప నైవేద్యాలు పెట్టి అర్చనలు అర్పణలు చెయ్యటానికి కాదు.
      9).అలాగే తమ ధర్మవిరుద్ధ విగ్రహారాధనకు హిందూ-క్రైస్తవ-ముస్లిం ధర్మశాస్త్రాల నుండి ఆధారాలు చూపనంత వరకు మేము మిమ్మల్ని వదిలేది లేదు. ఇదీ సంగతి. ఈ విషయంలో మీలాగా ఉత్సాహాన్ని ప్రదర్శించిన పండితుల కోసమే మేము ఎదురు చూస్తున్నాము. కాక పోతే మీరు ఆవేశంతో కాక, గ్రంధాల ఆధారంగా మాటలాడని కోరుతున్నాను.
      10).
      @me
      అవాబుతో పాటు మీరొక సాక్ష్యాన్ని తప్పనిసరిగా చూపించాలి.నాకు తెలిసిన శ్రీ విద్యాప్రకాశాననదగిరి స్వాముల వారు గీతా మకరంద గ్రంధ రచయిత.ఇప్పుడు త్రిదండి శ్రీమన్నారాయణ చిన జియ్యర్ స్వాముల వారు పాటించే విశిష్టాద్వైత సంప్రదాయాన్ని పాటిస్తున్న ఆశ్రమవాసి.ఈ సంప్రదాయంలో భక్తులకి శంఖ చక్రాలు భుజాల మీద ముద్ర వేసి నామదీక్ష ఇచ్చే సంప్రదాయం ఉంది.ఆ దీక్ష తీసుకున్నవారికి లక్ష్మీనారాయణుల పంచలోహ విగ్రహాలు నిత్యపూజార్ధం ఇస్తారు.
      మీరు ఇక్కడ ప్రస్తావించినది కూడా వారినేనా?వారినే అయితే మీరు చేసినది నిజంగా సాహసమే!నిత్యం ఒక అర్చామూర్తిని తను ఆరాధిస్తూ భక్తులకి ఆ దీక్షని ఇస్తూ ఉందే ఒక వ్యక్తిని విగ్రఘారాదనని వ్యతిరేకించే మీ ఎజెండాకి సాక్ష్యంగా వాడుకోవటం అంటే ఒక మనిషిని తన మనస్సుకి విరుద్ధంగా దొంగసాక్ష్యం చెప్పించటమే, కాదంటారా?
      @he
      ఆయన విగ్రహారాధన చేసేవాడో,లేదో నాకు తెలియదు. అవసరం కూడాలేదు.
      --------------------
      ఒక విషయం గురించి పదిమంది చదివే చోట ఏదయినా చెప్పాలంటే ముందు తను చెప్తున్న విషయం గురించి కనీస పరిశోధన చేసి నిజానిజాలు తేల్చుకోవాలి.అది చెయ్యకుండా ఒక విగ్రహారాధకుడు వేరొక విషయం గురించి చెప్పిన ఒక ముక్కని తీసుకొచ్చి తనని విగ్రహారాధనని వ్యతిరేకించినట్టు సాక్ష్యం చెప్పించహ్టం తప్పు కాదా!

      ఒక హిందువుగా నేను అన్ని మతాల్నీ సమానంగానే గౌర్విస్తాను.నేనే కాదు,ఇవ్వాళ దేసంలో హిందువులూ ముస్లిములూ ఒకరి మతనిష్తకి ఒకరు భంగ్మ కలిగించహ్కపోవటమే కాదు,పరస్పార్మ్ సహకరినంచుకుంటున్నారు.ఒక్కసారి ఈ అదెశంలో ఉన్న దర్గాల దగ్గిర మొక్కులు చెల్లించుకునే హిందువుల్ని చూడండి!కొన్ని దర్గాలకి హిందువులే ధరమకర్తలుగా ఉన్నప్పటికీ ఆయా దర్గాల నిర్వహనని ముస్లిం మత సంప్రదాయాలకి అనుగుణంగానే నిర్వహిస్తున్నారు,అది మీకూ ఆయనకీ తెలుసా!

      ఏ హిందువూ ముస్లిం మత సంప్రదాయాల మీద దాడి చెయ్యలేదు ఇంతవరకూ,ఇక ముమందు కూడా చెయడు - నాదీ హామీ!మరి,మీరు "" అని పొగుడుతున్న శ్రీమాన్ అభిలాష్ గారు ఎందుకు చహెస్తున్నట్టు?నా జవాబులోని మొదటి పేరాలోనే చెప్పాను,ఒకటి రెండు చోట్ల అర్ధం చేసుకోవటంలో వచ్చే పొరపాటుగా చేస్తే నేను కూడా అంత తీవ్రంగా స్పందించహెవాణ్ణ్ణి కాదు,కానీ 555 పోష్టులో సాల్ష్యాలు చూపించాక కూడా ననను గొర్రిదాటు వాదనలని అంటూ కొత్త్త్గ అసాక్ష్యాలౌ అదగటంతో నాకు మండింది!

      హిందువుల ధరమశాస్త్రాల గురించి హిందువులనే దబాయించటానికి కూడా సాక్ష్యం వేదిక కాకుండా ఉంటే మంచిది!

      Delete
      Replies
        Reply
    3. UnknownMarch 11, 2016 at 12:06 AM

      మిత్రులు హరిబాబు గారికి నమస్కారాలు!

      మీ పోస్టింగులలో మీరు నన్ను మీతో సమవుజ్జీ కాదనటాన్ని బట్టి, మీరు నాకంటే గొప్ప పాండిత్యం ఉన్నవారని తెలిసింది. మీరు నాపట్ల వ్యక్తం చేసిన ఆగ్రహావేశం, దురుసు పదజాలం మీ సంస్కారనికే వదిలేస్తున్నాను. నా పరిమితమైన ధార్మిక గ్రంథాల అధ్యయనం నాకు అలాంటి ప్రతీకార ప్రవృత్తికి అనుమతించటం లేదు.

      మీ సుదీర్ఘమైన పోస్టింగులు చూసాను. దాని వలన నాకు అర్థమయ్యింది ఏమిటంటే- ఒకవైపు “హిందూ శాస్త్రాలలో పరిశుద్ధ దైవిక ప్రబోధనలు లేవు’’ అంటూనే, మరోవైపు “మా పరిశుద్ధ మహనీయుని రాకడను గురించి వాటిలో ఉంది” అని ప్రకటించే దుర్బుద్ధి కలిగిన వారు నేడు ఉన్నారు. బహుశా మీరు నన్ను అదే కోవకు చెందిన వ్యక్తిగా భావిస్తున్నారన్నది. నేనయితే అటువంటి నీచ బుద్ధిని కలిగిన వాడిని కాను.

      నేను ఒక ముస్లిమునై ఉండి, ఖురాన్ శాస్త్రం అనటానికి ఎంతగా గర్విస్తానో హిందూ శాస్త్రాలు లేక వైదిక శాస్త్రాలు అనటానికీ అంతగానే గర్విస్తాను. దీనికి కారణం- మీలాంటి వారి మన్ననలు ప్రశంసలు పొందటానికో లేక మీలాంటి వారి బెదిరింపులకు భయపడో కాదు. ఖురాను మరియు ప్రవక్త ముహమ్మదుల పట్లా ఎలాంటి గౌరవప్రదమైన వైఖరిని కలిగి ఉంటారో అచ్చం అలంటి వైఖరినే ఇతర ధర్మ శాస్త్రాల పట్లా మరియు ఇతర మహనీయుల పట్లా కలిగి ఉండమని సర్వేశ్వరుడైన అల్లాహ్ స్వయంగా ముస్లిములను ఆదేశిస్తున్నాడు. దానికి ఆధారంగా రాబోయే వాక్యాలను ఈ క్రింది గమనించగలరు.

      నీపై (అనగా ప్రవక్త ముహమ్మద్ పై) అవతరించిన దానిని (అనగా ఖురాను గ్రంధమును) మరియు నీకు పూర్వం అవతరిపజేయబడిన వాటిని (అనగా ఖురాను కంటే ముందు అవతరించిన సకల ధర్మశాస్త్రాలను) కూడా విశ్వసించేవారు. -2:3

      సాఫల్యం పొందాలనుకొనే వారు కలిగి ఉండవలసిన ఆరు మౌలిక విశ్వాసాలలో పైన పెర్కొన్న రెండు విశ్వాసాలూ ఉన్నాయి. దీనిని బట్టి- పరిపూర్ణమైన ముస్లిం (అనగా దైవవిదేయునిగా) ఉండగోరేవాడు కేవలం ఒక్క ఖురాన్ను తప్ప దానికి పూర్వం నాటి గ్రంథాలను దైవ గ్రంథాలుగా విశ్వసించను అంటే కుదరదు! అలాగే మరొక వాక్యాన్ని ఈ క్రింది గమనించగలరు.

      మరియు మీరైతే (అనగా ముస్లిములైతే) సకల ధర్మశాస్త్రాలను విశ్వసిస్తున్నారు.-3:119

      ప్రవక్త ముహమ్మద్ వారి కాలంలో యూదులు, క్రైస్తవులు ఇంకా వివిధ మత వర్గాల వారు తమ తమ గ్రంథాలను తప్ప, తోటి మత వర్గాలకు చెందిన ధార్మిక గ్రంథాలను పవిత్రమైనవిగా విశ్వసించేవారు కారు. ఆ నేపథ్యంలో సర్వేశ్వరుడైన అల్లాహ్ పైప్రకటన చేస్తున్నాడు. కాబట్టి- నేను వైదిక ధర్మశాస్త్రాలను కూడా ఖురాను మాదిరిగానే గౌరవిస్తున్నాను.

      పైన పేర్కొన్న ఖురాన్ వాక్యాలను బట్టి- ‘నా గ్రంథం మాత్రమే పవిత్రమైనది’ అని చేసే ప్రకటన అత్యంత సంకుచితమైనదని సుస్పష్టం అవుతుంది.

      అలాగే శ్రీరామకృష్ణులను ఇతర ఋషి పుంగవులను కూడా నేను అత్యంత గౌరవ దృష్టితో చూస్తాను. దానికి కారణం ఏమిటో ఈ క్రింది ఖురాన్ వాక్యంలో చూడండి.

      Delete
      Replies
        Reply
    4. UnknownMarch 11, 2016 at 12:14 AM

      మేము నూహ్ నూ, అబ్రాహామునూ పంపాము. ఆ ఉభయుల సంతతిలో ప్రవక్త పదవినీ, గ్రంథాన్నీ పెట్టాము...-57:26

      అని సర్వేశ్వరుడైన అల్లాహ్ ప్రకటిస్తున్నాడు. ఈ పై సమాచారం ద్వారా అర్థమయ్యేదేమిటంటే- అబ్రాహాము సంతతి వారైన ఇశ్రాయేలీయులలో వేలకొద్ది ప్రవక్తలూ, వందల కొద్ది గ్రంథాలూ అవతరించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే అతని కంటే ప్రాచీనుడైన నూహ్ ఎవరు? అతని సంతతిలో ప్రభవించిన ఆ వేలకొద్ది ప్రవక్తలు ఎవరు? ఆ వందల కొద్ది గ్రంథాలు ఏవి? అన్న ప్రశ్నలకు నా సమధానలు- అతడే మన హిందూ దేశానికి చెందిన మహా ఋషి మనువు. అతని సంతానమే శ్రీకృష్ణుడు, అర్జునుడు మొదలగు వేలకొద్దీ ఋషీశ్వరులు. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత తదితర వందలకొద్దీ గ్రంథాలు. ఖురానులో మరొకచోట ఈ క్రింది విధంగా పెర్కొనడమైనది.

      హెచ్చరిక చేసే వాడు (ఋషులు లేక ప్రవక్తలు) రాని జాతి ఏదీ లేదు. -35:24
      మేము మీలోని (అనగా సర్వ మనవులలోని) ప్రతి ఒక్కరికీ ఒక షరియత్తు (అనగా ధర్మ శాస్త్రము) నూ, ఒక జీవన విధానాన్ని నిర్ణయించాము. -5:48

      ఈ వాక్యాలను బట్టి- ఖురాను గ్రంథ ప్రబోధనలను మరియు ప్రవక్త ముహమ్మద్ ఆదర్శాలను పాటించే ఒక ముస్లింగా నేను- నా హిందూ దేశంలో ఋషులు మరియు వారిపై మహత్తర గ్రంథాలు అవతరించాయని అంగీకరిచవలసి ఉంది. ఇంకా ఖురాను ప్రకారం ఎవరెవరు ఏ యే జాతులకు చెంది ఉన్నారో వారు వారి వారి జాతీయతను అంగీకరించాలి. దాని గుర్తింపు (Identity) ను కలిగి ఉండాలి. అందుకే నేను ఒక ముస్లింగా ఉన్నప్పటికీ ఆది దంపతులైన శివపార్వతులను మహోదయులైన నా అది తలిదండ్రులుగా శ్రీరామకృష్ణాదులను నా జాతీయ నాయకులు (Heros) గా అంగీకరించటాన్ని నేను గర్విస్తున్నాను. అలాగే వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత వంటి శాస్త్ర గ్రంథాలను మరియు రామాయణం, మహాభారతం, భాగవతం వంటి ఇతిహాసాలను మరియు పురాణాల వంటి తదితర గ్రంథాలను నా జాతికి గర్వకారణమైన ‘ప్రాచీన’ వారసత్వ సంపాదగా నేను మనసారా నమ్ముతాను. పై విధమైన భావాలను కలిగి ఉండటానికి దోహదం చేసే ఖురాన్ వాక్యాలను ఈ క్రింది గమనించగలరు.
      ReplyDelete
      M.A. ABHILASHMarch 10, 2016 at 10:43 AM

      మానవులారా! మేము మిమ్మల్ని ఒకే పురుషుని నుండి ఒకే స్త్రీ నుండి సృజించము. తరువాత మీరు ఒకరినొకరు పరిచయం చేసుకొనేందుకు మిమ్మల్ని జాతులుగాను తెగలుగాను చేశాము. వాస్తవానికి మీలో అందరికంటే ఎక్కువ భయభక్తులు కలవాడే అల్లాహ్ దృష్టిలో ఎక్కువ గౌరవ పాత్రుడు. -49:13

      పై వాక్యాలలో గమనార్హమైన విషయం- సుత్రబద్ధంగా మానవులంతా ఒకేజంట సంతానం అయినప్పటికీ, ఏ జాతికి ఆ జాతి తన ప్రత్యేక గుర్తింపు (Identity) ను కలిగి ఉండాలి. అలాగే ఏ తెగకు ఆ తెగ కూడా ప్రత్యేక గుర్తింపు (Identity) ను కలిగి ఉండాలి. అందుకే నేను ముస్లిం తెగ పరంగా నేను ఒక ప్రత్యేక గుర్తింపు (Identity) ను కలిగి ఉన్నప్పటికీ, జాతి పరంగా నేను ఒక ప్రత్యేక గుర్తింపు (Identity) ను కూడా కలిగి ఉండాలి. ఎందుకంటే- మీరు ఒకరినొకరు పరస్పరం పరిచయం చేసుకోవటానికి ఆవిధమైన వర్గీకరణను నేనే నిర్దేశించానని సర్వేశ్వరుడైన అల్లాహ్ స్వయంగా ప్రకటిస్తున్నాడు. ఒకవేళ జాతి దురభిమానాన్ని పెంచుకున్నా లేక నా జాతి పట్ల చులకనమైన భావనను కలిగి, ఇతర జాతుల పట్ల వీరాభిమానాన్ని పెంచుకున్నా ఆయన నిర్దేశాన్ని దిక్కరించినట్లే కదా! కనుక నేను నా జాతి పట్ల గర్వకారణమైన సంబంధాన్ని కలిగి ఉంటున్నాను.

      ఈ విషయాలను గత రెండు దశాబ్దాలుగా వస్తున్న నా రచనలను చదివిన వారికి మరియు నేను చేస్తున్న ప్రసంగాలను విన్నవారికి సుస్పష్టంగా తెలిసిందే. నా తాపత్రయం ఒక్కటే- అది హిందూ-క్రైస్తవ-ముస్లిం ఇత్యాది మత వర్గాలుగా ‘భిన్నత్వం’ కలిగి ఉన్న మనం ‘హిందూ జాతి’ లేక ‘భారత జాతి’ ‘ఏకత్వం’ కలిగి ఉండాలన్నదే. ఐక్యతకు ఆలంబన ‘భావసారుప్యత’ మాత్రమే కగాలదన్నది మీకు తెలియనిది కాదు. దానిని సాధించాలన్న తీవ్రమైన తృష్ణతోనే గీతా-బైబిలు-ఖురాను వంటి ధార్మిక గ్రంథాల ప్రబోధనల మధ్య ఉన్న సమాంతర దృక్పథాలను వెలికితీసి వాటిని ఆ యా మత వర్గాలలో ప్రచారం చేస్తున్నాను.
      ఇక విగ్రహారాధనపై గాని లేక మరే అంశంపై గాని నేను చేసే చర్చకు ప్రధానంగా మూడు కారణాలు ఉంటాయి. వాటిలో...
      1, మన జాతి జనుల వ్యక్తిగత జీవితాలలో ‘నైతికత’ను పెంచటం.
      2, వారి సాముహిక జీవితాలలో ‘మానవత’ను పెంపొందించటం.
      3, మన జాతికి చెందిన వివిధ వర్గాలమధ్య ‘ఐక్యత’ను సాధించటం.

      ఇది తప్ప మరొక దురుద్దేశం ఏకోశానా నాకు లేదు. ఏ ఆరాధనా విధానాల వలన మనిషిలో పైవిలువలు అంకురించి, పరిఢవిల్లుతాయో అవి మాత్రమే సరైనవి. కనుక వాటిపై ఇంకా మనం చర్చించవలసి ఉంది.

      Delete
      Replies
        Reply
    5. hari.S.babuMarch 11, 2016 at 3:25 PM

      Your statement 1).మీరు నాపట్ల వ్యక్తం చేసిన ఆగ్రహావేశం, దురుసు పదజాలం మీ సంస్కారనికే వదిలేస్తున్నాను.
      My answer:మీరు ఇతరుల పట్ల వాడిన భాషలో కొన్నింటిని నంబర్లు వేసి చూపించాను,అవి కొన్ని మాత్రమే!

      Your statement 2).నా తాపత్రయం ఒక్కటే- అది హిందూ-క్రైస్తవ-ముస్లిం ఇత్యాది మత వర్గాలుగా ‘భిన్నత్వం’ కలిగి ఉన్న మనం ‘హిందూ జాతి’ లేక ‘భారత జాతి’ ‘ఏకత్వం’ కలిగి ఉండాలన్నదే. ఐక్యతకు ఆలంబన ‘భావసారుప్యత’ మాత్రమే కగాలదన్నది మీకు తెలియనిది కాదు. దానిని సాధించాలన్న తీవ్రమైన తృష్ణతోనే గీతా-బైబిలు-ఖురాను వంటి ధార్మిక గ్రంథాల ప్రబోధనల మధ్య ఉన్న సమాంతర దృక్పథాలను వెలికితీసి వాటిని ఆ యా మత వర్గాలలో ప్రచారం చేస్తున్నాను.
      My answer: ఉద్దేశం మంచిదే!కానీ అది అవసరమా!అన్నింటినీ కలిపేసి ఒక్కటిగా చెయ్యాల్సిన అవస్రం లేదు.మత సాహిత్యాన్ని శాస్త్రీయంగా విశ్లేషిస్తే అన్ని మతాల లోనూ దేవుడు అని వర్ణించే భాగం అంతా ధనాత్మక అంశాల గుంపు(లిస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ ట్రెయిట్స్).మామూలుగా అయితే ఎక్కడ చూసినా మంచి,చెడు కలిసే ఉంటాయి. కానీ ఇందులో నుంచి మంచి విషయాలు మాత్రమే ఉండేటట్టు వేరు చేసి దేవుడు అనీ చెడు విషయాలు మాత్రమే వేరు చేసి దెయ్యం అనీ వర్ణిస్తారు,అవునా?ఏ ఒక్క మనిషీ ఎంత ప్రయత్నించినా మొత్తం అన్ని మంచి విషయాలనీ తన ప్రవర్తనలోకి తెచ్చుకోలేడు.అట్లాగే ఏ మనిషీ పూర్తి చెడ్డవాడుగానూ ఉందలేడు.ఏ మతంలోని సిద్ధాంతం ప్రకారం అయినా మనిషితో పాటూ ఈ సమస్తాన్నీ ఆ దేవుడే సృష్టించాడని చెప్తున్నారు,కదా!ఆ దేవుడు మనల్ని యంత్రాల మాదిరి సృష్టించ లేదు.సొంతంగా ఆలోచించేటందుకు తల అనేది ఒకటి ఉంది.మీరు చేస్తున్న మొందివాదన ఏమితంటే ముందుగానే మీరు చాలా గొప్పవారనీ,మీ తలలో మాత్రమే దేవుడు ప్రత్యేకంగా మంచి ఆలోచనలు పుట్ట్టిస్తాదనీ, మీరు ఆలోచించినట్టే ఇతరులు కూడా ఆలోచిస్తే చాలు ఈ భూమి మొత్తం మీలాంటి దివ్యపురుషులతో నిందిపోతుందనీ అనుకోవటం.ఇతరులు కూడా తెలివైన వారేనని మీరు భావించడం లేదు.అందుకే అన్నింటినీ కలపడంలో మీకు నచ్చిన ఏకేశ్వరోపాసననీ,అమూర్త్యారాధననీ మాత్రమే ఉంచి మిగతావాట్ని చీద,పీడ అంటున్నారు.

      మీరు చేస్తున్న తప్పు మీ వాదనకి సరైన పరిశోధన చెయ్యకపోవటం:ఇన్నాళ్ళూ గీతలో ఎక్కడా విగ్రహారాధనని సమర్ధించే ఒక్క వాక్యం కూడా లేదన్నారు.ఉంది అన్నవాళ్ళని "మీలాంటి వాళ్ళ వల్లే హిందూ మతం భ్రష్టు పట్టి పోతున్నది" అని కూడా అన్నారు.మరి ఇప్పుడు "***" గుర్తులు పెట్టి చూపించిన చోట ఉన్నాయి కదా!

      మహామహులకి కూడా అర్ధం కాని సంక్లిష్తత ఉంది అన్న యాస్త్రజాయిడ్ గారినేమో "హిందూమతంలో సంక్లిష్తత ఏమీ లేదు,ఎవడికయినా అర్ధమవుతాయి" అని గద్దించారు,పైగా వాళ్ళు తప్పులు చెప్పి ఉండొచ్చు,గురువులు చెప్పింది గుడ్డిగా నమ్మకుండా మన సొంత బుద్ధితో ఆలొచించాలి అని కూడా తీర్పు ఇచ్చారు.మతశాస్త్రాలలో మూలసూత్రాన్ని తీసుకుని మనం కొంత స్వేచ్చగా నిర్ణయం తీసుకోవచ్చు అంటున్న నాతో "అట్లా కుదరదు,అయితే ధర్మశాస్త్రాలు దేనిని రాసినట్టు?అందులో ఉన్నది ఉన్నట్టు పాటించి తీరాల్సిందే" అని వాదిస్తున్నారు.ఈ రెండు పరస్పర విరుద్ధమైన వాదన్లూ మీనుంచే వస్తున్నాయి,ఎందుకని?

      P.S::అంటే అలా మాట్లాడుతున్న వాళ్లతో ఇలా అలా మాట్లాడుతున్న వాళ్లతో అలా వాదించి ఏకపక్షంగా ఇతర్లమీద మీ ఏకేస్వరోపాసననీ అమూర్త్యారాధననీ రుద్దాలనే తాపత్రయం తప్ప ఇతర్ల వాదన పట్ల సానుకూలత నాకు కనపడటం లేదు మీలో.

      Delete
      Replies
        Reply
    6. Reply
  18. UnknownMay 29, 2016 at 11:50 AM

    "మన శాస్త్రాలు అంటున్నవేంటి" అన్న హరిబాబు గారు మత ఛందస వాది అని అర్ధమై పోతుంది .

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయంMay 29, 2016 at 6:57 PM

      ఒక నిర్ణయానికి ముందుగానే వచ్చేసిన వారు కొత్తగా నేర్చుకొనేది ఏమీ ఉండకపోవచ్చును!

      Delete
      Replies
        Reply
    2. hari.S.babuNovember 9, 2016 at 4:42 PM

      నీ తల పెద్ద సైజు మట్టితో నింపిన గుమ్మడికాయ అని అర్ధం అవుతున్నది.

      Delete
      Replies
        Reply
    3. Reply
  19. hari.S.babuOctober 20, 2016 at 3:42 PM

    శిల్పాగమ శాస్త్రం అనేదాన్ని కూదా శిల్ప ఆగమన శాస్త్రం అని అంటున్న మీకు, సంస్కృతంలో ఓ అంటే ఢం రాని మీకు వైదిక సాహిత్యాన్ని అర్ధం చసుకోగలనన్న అహంకారం దేనికి?మీరు ముస్లిం అని మాకు తెలుసు! అసలు మీ మతం గురించి "మా మతంలో ఈ మంచి ఉంది" అని చెప్పి పాజిటివ్ ప్రచారం చేసుకోకుండా హిందూమతంలో విగ్రహారాధన లేదు/ హిందూమతంలో బహుదేవతారాధన లేదు/హిందూమతలో కూదా ఇస్లాం మతం ఉంది అని నిరూపించాలన్న నెగిటివ్ ప్రచారపు దురద ఎందుకు?

    ReplyDelete
    Replies
      Reply
Add comment
Load more...

మీ అభిప్రాయాలు,సలహాలు,సూచనలు,సందేహాలు పంపగలరు
అందరూ చదువుకొనుటకు వీలుగా తెలుగులోనే వ్రాయవలెను.

← Newer Post Older Post → Home
Subscribe to: Post Comments (Atom)

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక...
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే...
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క...
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ...
  • శుభవార్త: "సిలువ...బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ...
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద...
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే...
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • స్వలింగ సంపర్కం వ్యక్తిగత స్వేచ్చా?
    రచ్చబండ లో జరిగిన స్వలింగ సంపర్కం గూర్చి కొంతమంది మేధావుల అభిప్రాయాలు చదివి చాలా ఆశ్చర్యమేసింది. స్వలింగ సంపర్కాన్ని మేము సమర్ధించమంటూనే అద...
  • M.A.అభిలాష్ గారితో ముఖాముఖి: పరిశుద్ధ బైబిలు ప్రబోధనల ప్రకారం:యేసు సిలువపై మరణించ లేదు! -1 (పాప పరిహారానికి రక్తమొక్కటే ప్రత్యమ్నాయమా?)
    సర్వశక్తిగల దేవుని పేరుతో...  యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలువదు. -సామెతలు 21:30 గౌరవ నీయులైన పాఠక మిత్రులా...

Recent Comments

Blog Archive

  • ►  2021 (2)
    • ►  April (1)
    • ►  January (1)
  • ►  2020 (2)
    • ►  August (1)
    • ►  April (1)
  • ►  2019 (14)
    • ►  December (2)
    • ►  October (2)
    • ►  June (3)
    • ►  February (4)
    • ►  January (3)
  • ►  2018 (14)
    • ►  December (2)
    • ►  November (1)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (1)
    • ►  May (2)
    • ►  April (2)
    • ►  March (2)
    • ►  February (2)
  • ►  2017 (37)
    • ►  December (2)
    • ►  November (3)
    • ►  October (4)
    • ►  September (6)
    • ►  August (8)
    • ►  July (5)
    • ►  June (5)
    • ►  March (2)
    • ►  January (2)
  • ▼  2016 (63)
    • ►  December (3)
    • ►  November (1)
    • ►  October (10)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (5)
    • ►  May (6)
    • ►  March (1)
    • ▼  February (17)
      • యేసు పూజింపబడ్డారు కాబట్టి దేవుడా?
      • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నా...
      • సమస్తమూనూ యేసు ద్వారా చెయ్యబడెను కాబట్టి యేసు సృష్...
      • Adviteeya devuda? anudukonumu anjali. (అద్వితీయ దే...
      • యేసుకు సర్వాధికారాలు ఇవ్వబడ్డాయి కాబట్టి యేసు దేవుడా?
      • యోహాను 10:33 లో యేసు తనను తాను దేవుడని ప్రకటించుకు...
      • నేనును తండ్రీ ఏకమై ఉన్నమంటే?
      • జెకర్య 2:10 & మలాకీ 4:5,6 వాక్యాల ప్రకారం యెహోవాయే...
      • అబ్రాహాము పుట్టుక ముందే యేసు ఉన్నారు! కాబట్టి యేసు...
      • దేవదేవుడగు పరమాత్మను వదిలి దేవతలను ఆరాధించేవాడు Sm...
      • సంచలనాత్మకమైన సీరియల్ : బైబిల్ వెలుగులో యేసు x పౌలు.
      • “నన్ను చూచు వాడు తండ్రిని చూచి యున్నాడు” అంటే...?
      • Aalochinchu aalochinchu Annayo,chellilo.?
      • యెషయ 9:6 లేఖనం ప్రకారం యేసు బలవంతుడైన దేవుడా?
      • ఫిలిప్పీ 2:6 ప్రకారం యేసు, దాసుని స్వరూపం ధరించుకో...
      • రోమా 9:5 వచనం ప్రకారం పౌలు దృష్టిలో యేసు స్తోత్రార...
      • యోహాను 1:1-14 వాక్యాలు “యెహోవాయే యేసుగా అవతరించాడ”...
    • ►  January (18)
  • ►  2015 (123)
    • ►  December (12)
    • ►  November (4)
    • ►  October (8)
    • ►  September (13)
    • ►  August (7)
    • ►  July (12)
    • ►  June (7)
    • ►  May (18)
    • ►  April (6)
    • ►  March (8)
    • ►  February (14)
    • ►  January (14)
  • ►  2014 (105)
    • ►  December (13)
    • ►  November (13)
    • ►  October (11)
    • ►  September (38)
    • ►  August (11)
    • ►  July (18)
    • ►  June (1)
  • ►  2013 (9)
    • ►  November (2)
    • ►  October (7)

Followers

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం

FB Follow

Sakshyam Magazine

Supporters



Follow by Email

Copyright © Sakshyam Magazine | Designed by Jayati Creative