• Contact us
  • Privacy Policy
  • Disclaimer
  • About Us

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Rachabanda
  • About Us
  • Sitemap
  • More
    • Vedas
    • Bible
    • SL Wuss V2
    • SL Wuss V3
    • SL Super Fast

Recent Acticles

Home » ARTICLES » “స్వార్ధపరులైన పండితుల”ను కాపాడుకుందామా? లేక “సశాస్త్రీయమైన వైదిక ధర్మము”ను కాపాడుకుందామా? - M. A. అభిలాష్

“స్వార్ధపరులైన పండితుల”ను కాపాడుకుందామా? లేక “సశాస్త్రీయమైన వైదిక ధర్మము”ను కాపాడుకుందామా? - M. A. అభిలాష్

Posted by Sakshyam Magazine on Thursday, August 6, 2015
Label: ARTICLES

సర్వోన్నతుడైన సర్వేశ్వరుని పేరుతో...
“హిందూ ధర్మం” లేక “వైదిక ధర్మం” అత్యంత ప్రాచీనమైనది. దాని మూడు ప్రత్యేకతలు అత్యంత గమనార్హమైనవి. వాటిలో- 

1. సార్వజనీనత 2. సార్వకాలికత 3. హేతుబద్ధత. 
           పై మూడు విషయాలను నిరూపించటానికి ఎన్నో శ్లోకాలను ప్రస్తావించవచ్చు. అయితే విషయం విస్తరించి పోతుంది కనుక మచ్చుకు కొన్నిటిని మాత్రమే ఇక్కడ పేర్కొంటున్నాను. “వైదిక ధర్మ”  మొదటి ప్రత్యేకత అయిన “సార్వజనీనత”కు ఆధారంగా ఈ క్రింది గీతాశాస్త్ర శ్లోకాన్ని గమనించగలరు.
                   
                   ఎవరు ఇతర భావములు లేనివారై నన్ను గూర్చి చింతించుచు ఎడతెగక
                   ధ్యానించుచున్నారో, ఎల్లప్పుడు నాయందే నిష్ఠగల్గియుండు అట్టివారియొక్క
                   యోగక్షేమములును నేను వహించుచున్నాను.   -9:22
       
            పై శ్లోకములో ఫలానా వంశం, ఫలానా వర్గం, ఫలానా వర్ణం ఫలానా లింగం కలిగిన వారు లేక ఫలానా ప్రాంతంలో నివసించేవారు మాత్రమే “దైవప్రసన్నత”కు “మోక్షప్రాప్తి”కి అర్హులు అని కాక, తన ప్రతిపాదిత “దృక్పథము”ను ఏప్రజలు అనుసరిస్తారో (ఏజనాః పర్యుపాసతే) వారే “దైవప్రసన్నత”కు “మోక్షప్రాప్తి”కి అర్హులు అని ప్రకటిస్తుంది. దాని ఈ ప్రకటనే వైదిక ధర్మ “సార్వజనీనతకు ప్రబల గుర్తు!”. కనుక ఈ సనాతన ధర్మానికి మేమే గుత్తదారులము అని చెప్పుకునే అర్హత ఏదో ఒక ప్రత్యేక వర్గానికి ఏమాత్రమూ దఖలు పడదు. కాకపోతే, దానిని ఎవరు వ్యాఖ్యానించినా అది- మన ప్రాచీనుల “వ్యాఖ్యానము”లకు మరియు వారి “ఆచరణా విధానము”లకు లోబడి ఉండాలి తప్ప ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు వ్యాఖ్యానించకూడదు. తరువాత, “వైదిక ధర్మ” రెండవ ప్రత్యేకత అయిన “సార్వకాలికత”కు ఆధారంగా ఈ క్రింది గీతాశాస్త్ర శ్లోకాన్ని గమనించగలరు. 
                   
                  సాధు, సజ్జనులను సంరక్షించుట కొరకు, దుర్మార్గులను వినాశమొనర్చుట 
                  కొరకు, ధర్మమును లెస్సగా స్థాపించుట కొరకు నేను ప్రతి యుగమునందును 
                  అవతరించుచుందును. -4:8
         
             పై శ్లోకంలో “ఫలానా మతవర్గము”ను “రక్షిస్తాను” మరియు “ఫలానా మతవర్గము”ను “శిక్షిస్తాను” అని కాక, “సజ్జనులు” అయిన వారిని  “రక్షిస్తాను” మరియు “దుర్జనులు” అయిన వారిని “శిక్షిస్తాను” అని ప్రకటిస్తుంది. ఇది ఎంతో సంజసమైనదే కాక, అత్యంత న్యాయవంతమైంది కూడా! ఈ విధానం ఏ కాలంలో అయినా చెల్లుబాటు అయ్యేదే. దాని ఈ ప్రకటనే వైదిక ధర్మ “సార్వకాలికతకు ప్రబల గుర్తు!”. ప్రజలు చేసుకున్న “మంచి-చెడు”లను అంటే- “శీలము” Characterను బట్టి కాక, “కుల-మత” వర్గాలను అంటే- Cast-Communityలను బట్టి గాని, స్త్రీ-పురుష లింగ (Sex) భేదములను బట్టి గాని “శిక్ష-బహుమానం” అన్నది కాలం చెల్లిన అత్యంత అన్యాయపూరితమైన సిద్ధాంతం! అలాంటి తప్పుడు సిద్ధాంతాన్ని ప్రతిపాదించటం లేదు కాబట్టే- వైదిక ధర్మం  “సార్వకాలిక ధర్మం” అయ్యింది.
ఇక, “వైదిక ధర్మ” మూడవ ప్రత్యేకత అయిన “హేతుబద్ధత”కు ఆధారంగా ఈ క్రింది గీతాశాస్త్ర శ్లోకాన్ని గమనించగలరు. 
                 
                 1. ఏ జ్ఞానము వలన మనుజుడు ఏదేని ఒక్క పనియందు సమస్తమును 
                  అదియేనని తగుల్కొనియుండునో, 2. అందుకు తగిన హేతువు లేకుండునో, 
                  3. తత్త్వమును (సత్యవస్తువును) తెలియకనుండునో, 4. అల్పమైనదిగా 
                   యుండునో  5. అట్టి జ్ఞానము తామసజ్ఞానమని చెప్పబడినది.-18:22
         
               పై శ్లోకము భౌతిక విజ్ఞాన శాస్త్రీయ ఆలోచనా దృక్పథాన్ని పూర్తిగా ప్రతిబింబిస్తుంది. మెలకువగా ఉన్న ప్రతి ఒక్కరూ “త్రివిధ కర్మలు” చేస్తుంటారు. “త్రివిధ కర్మలు” అనగా- “ఆలోచనలు”-“మాటలు”-“చేతలు”.  అవి: 1. “జ్ఞానయుక్తమైనవి” కావచ్చు లేక 2. “అజ్ఞానపూరితమైనవి” కావచ్చు. అయితే ఆ రెండు విషయాలు చెప్పుకోవటానికైతే బాగానే ఉన్నాయి. వాటిని “విచక్షణ” (Discriminate) చేయటం ఎలా అన్నదే అసలు సమస్య! దాని పరిష్కారానికి పై శ్లోకాన్ని దాని విషయాల వారీగా ఈ క్రింది మరొకసారి గమనించగలరు:

1. ఏ జ్ఞానమువలన మనుజుడు ఏదేని ఒక్కపనియందు సమస్తమును అదియేనని తగుల్కొనియుండునో 
ప్రతి మనిషి నిత్యం అనునిత్యం “ఆలోచనలు”-“మాటలు”-“చేతలు” అనే “త్రివిధ కర్మల”లో ఏదో ఒక దానిని చేస్తూ ఉండటం కద్దు లేక అనివార్యం! ఆ సహజ పరిణామాన్నే పైన పేర్కొన్న శ్లోకపు మొదటి భాగం చూపిస్తుంది. అయితే ఏదైనా ఒక పనిని వేలంవెర్రిగానో గుడ్డెద్దు వచ్చి చేలో పడ్డట్టో, గుంపులోగోవింద నలుగురితో నారాయణ అన్నట్టో చేసుకుంటూ పోక, అది చేయటం వలన నాకు 1. మానసికంగా గాని, 2. శారీరకంగా గాని 3. నైతికంగా గాని లేక 4. సామాజికంగా గాని ఏమైనా లాభం ఉందా? లేక నష్టం ఉందా? అని బాగా ఆలోచించి, పైన పేర్కొన్న నాలుగు ప్రయోజనాలు గాని లేక అథమం వాటిలో ఏదో ఒక ప్రయోజనం గాని ఉన్న కర్మనే చేయటానికి ఉపక్రమించాలి. అలాంటి ఏప్రయోజనమూ లేని కర్మను ఎట్టిపరిస్థితులలోనూ చేయరాదు. 

ఈ క్రింది పై శ్లోకపు రెండవ భాగం గమనించగలరు. 
2. అందుకు తగిన హేతువు లేకుండునో,
అలాంటి కర్మ చేయరాదు. అంతే కాదు, ఎవడో వచ్చి ఒక యాభై వేలు నాకు ఇస్తే మీ అబ్బాయికి ఉద్యోగం ఇప్పిస్తాను అని అన్నాడనుకోండి... లేక మరొకడు వచ్చి మీరు మా మతంలోనికి మారిపోతే మీకు పట్టిన దారిద్ర్యం పోతుంది అన్నాడనుకోండి దాని “సాధ్యాసాధ్యాలు” మరియు దాని “వాస్తవాస్తవాలు” తేలుసుకోవాలి. ఆ విషయాన్నే ఈ క్రింది

పై శ్లోకపు మూడవ విషయము తెలుపుతుంది.
3. తత్త్వమును (సత్యవస్తువును) తెలియకనుండునో,
అంటే తను తల పెట్టబోయే “కర్మ వాస్తవికత”ను గుర్తించాలి. 
4. అల్పమైనదిగాయుండునో 
అంటే తను తల పెట్టబోయే “కర్మ” గంభీరమైనదిగా గొప్పదిగా ఉండాలి. ఎవడో తుమ్మితే భయపడటం, పిల్లి ఎదురోస్తే వెంక్కు పారిపోవటం, వితంతు స్త్రీ ఎదురు పడితే ఆందోళనకు గురవ్వటం, ఈ మధ్య సాధారణ తలనొప్పి తగ్గినందుకూ హిదువులలో కొందరు మతమార్పిడికి పాల్పడుతున్నవారున్నారు! ఇది వైదిక సమాజ దుఃస్థితికి పరాకాష్ఠ!

పై శ్లోకపు ఈ క్రింది విషయం ప్రకారం- 
5. అట్టి జ్ఞానము తామసజ్ఞానమని చెప్పబడినది.
అంటే- విషయ వాస్తవికతను గురించి తెలుసుకోకుండా  కర్మ చేసే వారు అజ్ఞానంలో ఉన్నారని పై శ్లోకం హెచ్చరిస్తుంది. ఇది ఎంతటి యథార్థమో ఒక్కసారి ఆలోచించండి! దాని ఈ హెచ్చరికే  వైదిక ధర్మ “హేతుబద్ధతకు ప్రబల గుర్తు!”. 
         
            దీనిని బట్టి- వైదిక ధర్మానికి చెందిన ప్రతి “ఆలోచనా దృక్పథము” ప్రతి “ఆచరణా క్రతువు” ఎంతో హేతుబద్ధమైనది, అర్థవంతమైనదని తెలుస్తుంది. అంటే- వైదిక “ఆలోచన-ఆచరణ” విధానాల వలన-    1. మానసిక 2. శారీరక 3. నైతిక లేక 4. సామాజిక ప్రయోజనం వంటివాటిలో అన్నీ గాని అథమం ఒకటి గాని తప్పనిసరిగా ఉండితీరుతుందన్నమాట! 
         
             గమనిక: హేతుబద్ధమైన, అర్థవంతమైన వైదిక “ఆలోచన-ఆచరణ” విధానం కనీసం ఒక్కగాని ఒక్క శాతమూ నేటి హిందూ సమాజంలో “ఆచరణాత్మకం”గా లేదన్నది ఒక చేదు వాస్తవం! దానికి ప్రధాన కారణం- నేటి అధిక శాతం హిందూ పండితులు ఆ మహోన్నత సనాతన హేతుబద్ధ ధర్మాన్ని ధర్మశాస్త్రాలలో సమాధి చేసి, కాకమ్మ కథలతో కాలం వెళ్ళబుచ్చుతూ, అనవసరమైన భయాలను ప్రజలలో సృష్టించి, వాటి నివారణ పేరిట దోపిడీ పరువాన్ని నడపటమే! అన్నది ఇక్కడ అత్యంత గమనార్హం!
       
              చెట్టుపేరుచెప్పుకొని కాయలు అమ్ముకొనే చందంగా వైదిక శాస్త్రాల పేరుచెప్పుకుంటూ నిర్హేతుకమైన నిరర్ధకమైన నిష్ఫలమైన తమ కాల్పనిక “తప్పుడు విశ్వాసాల”ను మరియు “తప్పుడు కర్మకాండల”ను ప్రజలలో చలామణి చేసుకుంటున్నారు నేటి అధిక శాతం పండితులు. అయితే వంచక పండితుల ఈ దుర్మార్గపు నిర్వాకం వలన ఒకవైపు- ఎంతో మహత్తరమైన వైదిక ధర్మం అన్యుల (వైదికేతరుల) దృష్టిలో అభాసుపాలవుతుంది. రెండవవైపు- వైదికులు సర్వ విధాలా క్షవరానికి గురౌతున్నారు!  కాని, వారికి మటుకు “రాబడి-పలుకుబడి” అడ్డ దారిలో ఇబ్బడిముబ్బడిగా వచ్చిపడుతుంది!
         
                కనుక స్వార్ధపరులైన పండితుల బండారాన్ని బట్టబయలు చేయటానికి భయపడి “వైదిక ధర్మాన్ని” మరియు “వైదిక ప్రజానీకాన్ని” బలి చేసి, ఆన్యుల దృష్టిలో అభాసు పాలౌదామా? లేక స్వార్ధ పండితుల “కాల్పనిక ధర్మము”ను  ఖండించి, హిందూశాస్త్రాలలో సమాధి చేయబడి ఉన్న “సశాస్త్రీయ వైదిక ధర్మము”ను బయటకు తీసి, గత వైభవాన్ని సాధించుకుందామా? అన్నది విజ్ఞులైన మీరే నిర్ణయించుకోవాలి. జైహింద్!  

1 Response to "“స్వార్ధపరులైన పండితుల”ను కాపాడుకుందామా? లేక “సశాస్త్రీయమైన వైదిక ధర్మము”ను కాపాడుకుందామా? - M. A. అభిలాష్ "

  1. UnknownAugust 11, 2015 at 4:19 PM

    స్వచ్ఛమైనదియును,గొప్పదైనదియును అయినటువంటి హిందూ థర్మము భ్రష్టుపట్టిపోవడానికి ప్రధాన కారణము మన స్వార్ధపరులయిన హిందూ పండితులే! దీనికి క్రైస్తవమో, లేక ఇస్లామీయ మతమునో కారణమనుట మన అజ్ఞానపూరితము. మూఢ నమ్మకములతో కూడిన కల్పిత సిద్ధాంతములును, విగ్ర్హారాధనమును పరమతములను స్వీకరించుటకు కారణమగుచున్నవి. మన స్వార్ధపండితుల వ్యతిరేక వైధిక వీధి,విధానములును పేర్కొనకుండా, వీటిని ఏ విధముగాను ఖండించుతాయును మానివేసి కేవలము పరమతస్తులపై మనము విరుచుకుపడుటయును బహుశోచనీయము. ఏ దినము వేదజ్ఞానమును ప్రజ్వరిల్లుతుందో , ఆ దినమునే స్వార్ధపరులయిన, ధనార్ద్ధులైన ఈ మహా పండితుల ఆగడాలు పూర్తిగా నశించును.ఈ దిశలో మీరు సల్పుతున్న కృషి ఎంతో అభినందించతగ్గది. మీ వ్యాసంగములును వేదజ్ఞానమును బయటపెట్టుచున్నవి.పవిత్ర హిందూదేశమున క్రైస్తవము ప్రాబల్యము వహించుచున్నది. ఒక ప్రక్క హిందుత్వము తప్పుడు సిద్ధాంతమున మునిగియున్నది. ఈ మధ్య తరుణములో మీరు చేస్తున్న ప్రయత్నము కత్తి మీదసాము వంటిదూయగును.అయినప్పటికినీ ఆ పరమేశ్వరున్నీ కృషియు మీకు లభించును.

    ReplyDelete
    Replies
      Reply
Add comment
Load more...

మీ అభిప్రాయాలు,సలహాలు,సూచనలు,సందేహాలు పంపగలరు
అందరూ చదువుకొనుటకు వీలుగా తెలుగులోనే వ్రాయవలెను.

← Newer Post Older Post → Home
Subscribe to: Post Comments (Atom)

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక...
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే...
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క...
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ...
  • శుభవార్త: "సిలువ...బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ...
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద...
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే...
  • స్వలింగ సంపర్కం వ్యక్తిగత స్వేచ్చా?
    రచ్చబండ లో జరిగిన స్వలింగ సంపర్కం గూర్చి కొంతమంది మేధావుల అభిప్రాయాలు చదివి చాలా ఆశ్చర్యమేసింది. స్వలింగ సంపర్కాన్ని మేము సమర్ధించమంటూనే అద...
  • M.A.అభిలాష్ గారితో ముఖాముఖి: పరిశుద్ధ బైబిలు ప్రబోధనల ప్రకారం:యేసు సిలువపై మరణించ లేదు! -1 (పాప పరిహారానికి రక్తమొక్కటే ప్రత్యమ్నాయమా?)
    సర్వశక్తిగల దేవుని పేరుతో...  యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలువదు. -సామెతలు 21:30 గౌరవ నీయులైన పాఠక మిత్రులా...

Recent Comments

Blog Archive

  • ►  2021 (2)
    • ►  April (1)
    • ►  January (1)
  • ►  2020 (2)
    • ►  August (1)
    • ►  April (1)
  • ►  2019 (14)
    • ►  December (2)
    • ►  October (2)
    • ►  June (3)
    • ►  February (4)
    • ►  January (3)
  • ►  2018 (14)
    • ►  December (2)
    • ►  November (1)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (1)
    • ►  May (2)
    • ►  April (2)
    • ►  March (2)
    • ►  February (2)
  • ►  2017 (37)
    • ►  December (2)
    • ►  November (3)
    • ►  October (4)
    • ►  September (6)
    • ►  August (8)
    • ►  July (5)
    • ►  June (5)
    • ►  March (2)
    • ►  January (2)
  • ►  2016 (63)
    • ►  December (3)
    • ►  November (1)
    • ►  October (10)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (5)
    • ►  May (6)
    • ►  March (1)
    • ►  February (17)
    • ►  January (18)
  • ▼  2015 (123)
    • ►  December (12)
    • ►  November (4)
    • ►  October (8)
    • ►  September (13)
    • ▼  August (7)
      • పుస్తక పఠనం వలన ప్రయోజనాలు ఎన్నో!
      • "ఖుర్ఆన్" ప్రకారం బహుభార్యత్వం తప్పనిసరా?
      • హెబ్రీ 1:7-9 వాక్యాల ప్రకారం యెహోవాయే యేసును "దేవా...
      • సాక్ష్యం గ్రూప్ వారి యుట్యూబ్ ఛానెల్ : sakshyam TV
      • తీతుకు 2:13 వివరణ - MD.N.Prakash
      • "సాక్ష్యం మేగజైన్" పట్ల కొంతమంది బ్లాగర్ల వింతపోకడ!
      • “స్వార్ధపరులైన పండితుల”ను కాపాడుకుందామా? లేక “సశాస...
    • ►  July (12)
    • ►  June (7)
    • ►  May (18)
    • ►  April (6)
    • ►  March (8)
    • ►  February (14)
    • ►  January (14)
  • ►  2014 (105)
    • ►  December (13)
    • ►  November (13)
    • ►  October (11)
    • ►  September (38)
    • ►  August (11)
    • ►  July (18)
    • ►  June (1)
  • ►  2013 (9)
    • ►  November (2)
    • ►  October (7)

Followers

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం

FB Follow

Sakshyam Magazine

Supporters



Follow by Email

Copyright © Sakshyam Magazine | Designed by Jayati Creative