• Contact us
  • Privacy Policy
  • Disclaimer
  • About Us

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Rachabanda
  • About Us
  • Sitemap
  • More
    • Vedas
    • Bible
    • SL Wuss V2
    • SL Wuss V3
    • SL Super Fast

Recent Acticles

Home » Uncategories » శుక్రాచార్య గారి ప్రశ్నలకు M.A.అభిలాష్ గారి సమాధానములు!

శుక్రాచార్య గారి ప్రశ్నలకు M.A.అభిలాష్ గారి సమాధానములు!

Posted by Sakshyam Magazine on Monday, May 25, 2015

శుక్రాచార్య గారి ప్రశ్నలు : 
            అసలు విగ్రహారాధన అంత పెద్ద పాపం ఎందుకు అయ్యింది? ఇందు గలడందులేడని సందేహము వలదు ఎందెందు వెదికినా అందందే గలడు అనేది .. విస్వాసం. ఆ విశ్వాసం ప్రకారమే విగ్రహారాధన చేస్తున్నారు. దేవుడు సర్వాంతర్యామి అయినప్పుడు ఆ విగ్రహములో మాత్రం ఉండడా? అలాంటప్పుడు ఆ విగ్రహాన్ని పూజించడం తప్పా? దేవుడికి ఒక రూపం ఇవ్వడం అనేది మానవుల ఇష్టం. పురాణాలలో ఉన్న వర్ణణలను బట్టి ఆ విధంగా రూపొందిందించుకున్నారు. దేవున్ని తెలిసిన రూపాలలో కొలవడం వలన దగ్గరితనం పెరుగుతుంది. ఈ మాత్రానికి అదేదో పాపం అయినట్టు ఈ పంచాయితీలేంది? మీ మతములో విగ్రహారాధన నిషేధం అని చెబితే మీరు పాటించుకోండి అంతేకానీ, ఇతర మతాలది తప్పని..మీరు అదేదో ఉనంత మైన స్థానములో ఉన్నారని బ్రమపడకండి. అందరిది కేవలం నమ్మకం మాత్రమే.

M.A.అభిలాష్ గారి సమాధానములు : 
          శుక్రా చార్య గారికి నమస్కారాలు!
          మానవ నిర్మితమైన ఏ చిన్న వ్యవస్థలోనైనా- దానివంటూ కొన్ని “కచ్చితమైన నియమ నిబంధనలు” ఒక వైపు ఉంటాయి. అలాంటి సంస్థలలో పనిచేసే వారి కొన్ని “ఊహా జనితమైన భావాలు” మరొక వైపు ఉంటాయి. ఒక సంస్థ సక్రమముగా సాగాలంటే- పైరెండిటిలో ఏవి పాటించబడాలి? అన్న ప్రశ్నకు మొదటివి పాటించబడాలనే మన ఇంగితము సమాధానము ఇస్తుంది.
          అలాగే మన సర్వోన్నతుడైన ఏకైక సర్వేశ్వరుడు సృష్టించిన ఈ మహా భువన భాండములో జీవించే ఈ మనిషి తన సృష్టికర్తతో కలిగి ఉండే సంబంధాన్ని తెలిపే “కచ్చితమైన నియమ నిబంధనలు” ఏమీ ఉండవా? అలాగే- ఒక మనిషి తన తోటి మనుషులతో ఎలా ప్రవర్తించాలో తెలియజేసే- “కచ్చితమైన నియమ నిబంధనలు” ఏమీ ఉండవా? పై రెండు విషయాలలో ఎవరికి తోచిన “ఊహా జనితమైన భావాలు” వారు కలిగి ఉండవచ్చా? దీనికి “ఒక పద్ధతీ ఒక పడికట్టూ ” అంటూ ఏమీ ఉండదా? ఈ ప్రశ్నలకూ  మన ఇంగితము ఇచ్చే సమాధానము- ఈ మహా వ్యవస్థాధిపతి  అయిన ఆ సర్వేశ్వరుని ఆదేశిత “కచ్చితమైన నియమ నిబంధనలు” ఉండాలన్నదే కదా!
         అయితే నేటి అధికశాతం మతావలoబికులు- ఈశ్వర ప్రోక్త “కచ్చితమైన నియమ నిబంధనల”ను కేవలము శ్రావ్యమైన పఠనానికి మాత్రమే పరిమితంచేసి, ఆ యా పండితుల ఆ యా “ఊహా జనితమైన భావాల”ను ఈశ్వర ప్రోక్త ఆదేశాలుగా ప్రచారం చేస్తున్నారు. వారి ఆ ప్రబోధనలలో తమకు లాభాలు వచ్చిపడే కార్యాలే ఉంటాయి తప్ప, సామాన్య ధార్మిక ప్రజలలో “నైతికత-ఐక్యత”’ల వంటి విలువలను పెంచే ప్రేరకాలు ఏమీ ఉండవు. అయితే సామాన్య అమాయిక ప్రజలు అవన్నీ ఈశ్వర ప్రోక్త సత్యాలని “భ్రమిస్తున్నారు”. మత అవలంబికుల ఈ పోకడే- ప్రపంచ వ్యాప్త “అనైతికత-అనైక్యత”’ల వంటి మహా సంక్షోభాలకు, మానవాళి జీవితం కుక్కలు చించిన విస్తరిగా మారిపోవటానికి ప్రధాన కారణం అయ్యింది!
        ఎందుకంటే- ఈ పండిత వర్గం సామాన్యులను ధర్మశాస్త్రాలను చదవనివ్వరు. వాటిని చదవటం మా జన్మహక్కు అని భావిస్తూ, వాటిని అర్థం చేసుకోవటం మీకు అసాధ్యమని ప్రజలకు తప్పు దోవ పట్టిస్తూ ఉంటారు. దీని వలన- నేతి బీరకాయలో “నెయ్యి” లేనట్లే, నేటి  మన ధార్మికులలో “ధర్మము” లేకుండాపోయింది!!
        ప్రతి ధార్మిక వర్గపు పతనానికీ మూల కారణం- “శాస్త్రాల ధర్మము”ను విడనాడి, “శాస్త్రుల ధర్మము”ను అనుసరించటమే! కనుక ఏ ధార్మిక వర్గము బాగుపడాలన్నా అది - “శాస్త్రుల ధర్మము”విడనాడి, “శాస్త్రాల ధర్మము”ను చేపట్టాలి! అంతవరకూ ధార్మిక వర్గాలకు పట్టిన “అధర్మపు జాడ్యము” వదలదు.
        లేనియడల- మన గుళ్ళూ-గోపురాలూ-మన చర్చీలూ-మసీదులూ ఒకవైపు- “భక్తుల”తో కిటకిటలాడుతూ ఉంటాయి! అచ్చం అలాగే మరోవైపు- మన జైళ్ళూ “నేరస్థుల”తో కిటకిటలాడుతూ ఉంటాయి!!!
        శుక్రా చార్య గారూ! మీరు- “విగ్రహాలను పూజించటం తప్పా? దేవుడికి ఒక రూపము ఇవ్వటం అనేది మానవుల ఇష్టం” అని తీర్మానించేశారు. ధార్మికముగా మీరు చేసిన ఆ తీర్మానం చాలా తీవ్రమైన నేరము. అదే విషయాన్ని వేదం నుండో, ఏ ఉపనిషద్ నుండో, గీతాశాస్త్రం నుండో కనీసం ఒక్క మంత్రమో, శ్లోకమో పేర్కొని ఉంటే మీ తీర్మానం సత్యమయ్యేది!
         ఈమాత్రం దానికి ఈ పoచాయితీలేంది? అని కూడా ఆగ్రహంతో ప్రశ్నించారు. ఈ క్రింది మంత్రాల-శ్లోకాల అవగాహన మీకు ఉంటే, మీరు అలా పశ్నించి ఉండేవారు కాదు.
          విషయమును ధ్యానించు పురుషుని యొక్క మనస్సు విషయమందే 
           రమించును. నన్ను (సర్వేశ్వరుని) స్మరించుట వాని చిత్తము నా (సర్వేశ్వరుని) 
           యందే లీనమగును. యోగశిఖోపనిషత్ 3:6
         శుక్రా చార్య గారూ! “శాస్త్రి”గారైన మీరు- “దేవుని తెలిసిన రూపాలలో కొలవడం వలన దగ్గరితనం పెరుగుతుంది”. అని అంటూన్నారు. కానీ “విషయము (విగ్రహము) ను ధ్యానిస్తే మనస్సు దేవునిపైకి వేళ్ళక  విషయము (విగ్రహము) నే ఉండిపోతుంది” అని “శాస్త్రం” చెబుతుంది. ఎవరి మాట వినమంటారో మీరే శెలవియ్యండి శుక్రా చార్య గారూ!
         పర దేశములో ఉన్న భర్త చిత్రపటం లేనప్పుడు, ఒక భార్య అతడిని తనకు నచ్చినోడి ఫోటోలో చూచుకొనవచ్చును అన్నట్లు ఉంది మీ ఉపమానము! రోషమున్న ఏ భర్త అయినా దానిని సహిస్తాడా శుక్రా చార్య గారూ! లేదు కదా! తెంపితే తెగిపోయే అల్పమైన తాళిని కట్టినోడు తనను తన భార్యా మనస్సులో కాక పరాయి ఫోటోలో చూస్తే, అది మానసిక వ్యభిచారముగా తీర్మానిస్తాడు కదా! భర్త (ప్రభువు) లకే భర్త (ప్రభువు). అయిన ఆ సర్వోన్నత భర్త (ప్రభువు) అయిన ఆ సర్వేశ్వరుడైన ఈ క్రింది శ్లోకములో గమనించగలరు.
             నన్ను వ్యభిచరించని ప్రేమతో ప్రేమించుచూ వ్యభిచరించని భక్తితో 
             సేవించుచూ ఎవడు నన్ను బడయ ప్రయత్నించునో (అతడు) చెడు 
             గుణములనునతిక్రమించును. మరియు అతడు సైతము బ్రహ్మ(పవిత్రుడు) 
             అగుటకు సమర్ధుడగును.  -14:26 (శ్రీ గీతాయోగము)  
           దీనిని బట్టి- గీతాశాస్త్రం ప్రకారం- బహుదైవోపాసన లేక విగ్రహారాధన “అధ్యాత్మిక వ్యభిచారము!” అని అర్థం కావటం లేదా శుక్రా చార్య గారూ! ఈ అధ్యాత్మిక వ్యభిచారులైన వారిగతి ఏం కానుందో ఈ క్రింది శ్లోకములో గమనించగలరు. 
          ఆ పరమసత్త ఈ జగత్తును ఎంతో ఆక్రమించుకొనియున్నది. దానికి రూపం లేదు, 
           శోకము లేదు. దీనిని తెలుసుకున్నవారు అమరులవుతారు.ఇతరులందరూ 
           దు:ఖాన్ని అనుభవించాల్సిందే. శ్వేతాశ్వతరోపనిషత్త్ -3:10

         ఎవరైతే ప్రాకృతిక వస్తువులను (గాలి,నీరు మొ//వాటిని) ఉపాసిస్తారో 
           వారు చీకటి (నరకం)లో ప్రవేశిస్తారు. ఎవరైతే సంభూతి (సృష్టితాలు -
           మానవునిచేత తయారయ్యే వస్తువులను,బొమ్మలను) ఉపాసిస్తారో వారు 
           మరింత అంధకారంలోకి ప్రవేశిస్తారు. -యజుర్వేదం 40:9    

            పై మంత్రాలలో గమనార్హ వాక్యాలు- “దు:ఖము” మరియు అంధకారము” అన్నవి నిత్యనరక శిక్షలకు పరియాయ పదాలు. దీని ప్రకారం- బహుదైవోపాసన లేక విగ్రహారాధన చేసేవారు “నరకానికి పోతారు!” అని స్వయంగా హిందూ శాస్త్రాలే ఘోషిస్తున్నాయి కదా! ఇప్పుడు ఆర్థమయ్యిందా శుక్రా చార్య గారూ! విగ్రహారాధన ఎంతపెద్ద పాపమో!? ఈ పంచాయితీ ఎందుకో!!??
          మీ మా అనే భేదాలతో మాటలాడటం ఇక పాత మాట అయిపోయింది! ధర్మం ప్రకారం మనమoతా ఒక్కటే- భగవద్గీత హిందువులదీ, బైబిలు క్రైస్తవులదీ, ఖురాన్ ముస్లిములదీ అన్న ప్రచారము అత్యంత విష తుల్యమైనది! ఇది మానవాళిని ముక్కలు ముక్కలుగా చేసి, తమ ఆధిపత్యాన్ని చెలాయించుకోవటానికి కొందరు స్వార్థ పరులు చేస్తున్న ప్రచారం మాత్రమే! ఈ మూడు గ్రంధాలే కాక, వాటి దృక్పథాన్నే కలిగిన ఇంకా కొన్ని గ్రంథాలున్నాయి. సూర్య-చoద్రులూ, గాలీ-నీరూ మరియు సమస్త ప్రాకృతిక వనరులన్నీ ఏ విధముగా మనందరి ఉమ్మడి ఆస్తి అయి ఉన్నదో అలాగే- ఈ సకల ధర్మశాస్త్రాలూ మనందరి ఉమ్మడి ఆస్తి అయి ఉన్నాయి. కనుక ఏ ధార్మిక వర్గం వారైనా తమ వద్ద ఉన్న ధర్మశాస్త్రానికి విరుద్ధంగా మాటలాడినా ప్రశ్నించే హక్కును మరొక ధార్మిక వర్గం కలిగి ఉంటుందన్నది పరతి ఒక్కరూ గుర్తించాలి! గతంలో అంటే- ఈ ధర్మశాస్త్రాల ప్రబోధనలను దాచి పెట్టారు. కనుక ఈ వాస్తవం ఎవరికీ తేలియకుండా పోయింది. ఇది సమాచార యుగం కనుక వాటి ప్రబోధనలను దాచి పెట్టటంగాని, వాటిని వక్రీకరించి బోధించటంగాని అయ్యేపని కాదు. కాబోదు!!
            “మీ మతంలో విగ్రహారాధన తప్పైతే మీరు పాటించుకోండి” అని మీరు ఉచితసలహా ఒకటి పడేశారు!
ఇప్పుడు మేము, హిందూ పండితులు అయిన మీకు, అలాగే క్రైస్తవ పడితులకూ ముస్లిం పడితులకూ కలిపి ఒక సలహా ఇస్తున్నాము దయచేసి, జాగ్రత్తగా గమనించగలరు- మీరు ఒక పండితునిగా ప్రజలతో ఏది చెప్పదలచినా అది ధర్మ శాస్త్రాల ఆధారాలతోనే చెప్పగలరు! ఊహాజనితమైన విషయములను చెప్పటం మానేయగలరు. లేదు మేము వాటిని మానలేము అనుకుంటే- ధర్మ శాస్త్రాలను వదలివేయండి! ఎందుకంటే- ఒకవైపు హిందూ-ముస్లిం-క్రైస్తవ అన్నార్తులు గుప్పెడు అన్నం కొరకు, దాహార్తులు గుక్కెడు నీళ్ల కొరకు, కనీస జీవిత అవసరాలు తీరక, కోట్లాది మంది అలమటిస్తూ అసువులు బాస్తుంటే,  మరొకవైపు మీరు ధర్మం పేరిట చేసే- అశాస్త్రీయ,  హేతురహిత, నిరర్ధక, వ్యర్థ , అర్థరహిత చేష్టలను, అవసరానికి మించి ఆలయాలకు, దర్గాలకు, మసీదులకు , చర్చీలకు కోట్లాది రూపాయలను ధారబోయిస్తున్నారు! ఇంకా దేవుని పెళ్ళిళ్ళపేరిట, దేవుని ఊరేగింపుల పేరిట, తీర్థాల, ఉరుసుల, క్రిస్మస్-ఈష్టర్ల పేరిట కోటానుకోట్ల రూపాయల వృథా ఖర్చుల ఈ ప్రహసనం ఏమిటి? ఇవన్నీ చేయాలని లేదా కనీసం వాటిలో ఏదో ఒకటి చేయాలని ఒక్కగాని ఒక్క ఆధారాన్ని హిందూ-క్రైస్తవ-ముస్లిం పండితులలో ఎవరయినా గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాలలో ఎప్పటికైనా చూపగలరా? ఇది హిందూ-క్రైస్తన-ముస్లిం పండితులకు మాతరఫున “జీవిత పరియంత సవాలు” (LIFE TIME CHALLENGE)!! కానీ, ఎప్పటికీ చూపలేరు! 
           అయితే, ఆ యా మత వర్గాల పండితులు ధర్మ శాస్త్రాలను వల్లిస్తూ అవన్నీ చేస్తున్న కారణంగా ఆ వ్యర్ధ పనులు ధర్మ శాస్త్రాలలో ఉన్నాయనుకొని ఆలోచనాపరులూ మేధావులూ ధర్మ శాస్త్రాలను అస్యహించుకుంటున్నారు. దీని వలన పండితులకు రెండు పాపాలవుతున్నాయి. వాటిలో ఒకటి- శాస్త్రాలను ఆచరించని పాపము. ఆ శాస్త్రాలను తమ చేత పట్టుకొని వాటికి వ్యతిరేక చేష్టలు చేస్తున్న కారణంగా వాటికి వివేచనాపరులు దూరమయ్యే పాపము! శుక్రా చార్య గారూ! మా ఈ విషయాలపై ప్రశాంత చిత్తంతో ఆలోచించాలని మిమ్మల్ని ప్రేమ పూర్వకముగా కోరుతున్నాను. ఇక, మీదట మీరు ఏది చెప్పాలనుకున్నా ధర్మశాస్త్రాల ఆధారాలతోనే చెప్పాలన్నది మరచిపోరు కదా! 
More

10 Responses to "శుక్రాచార్య గారి ప్రశ్నలకు M.A.అభిలాష్ గారి సమాధానములు!"

  1. శ్యామలీయంMay 26, 2015 at 11:23 AM

    M.A.అభిలాష్> శుక్రా చార్య గారూ! మీరు- “విగ్రహాలను పూజించటం తప్పా? దేవుడికి ఒక రూపము ఇవ్వటం అనేది మానవుల ఇష్టం” అని తీర్మానించేశారు. ధార్మికముగా మీరు చేసిన ఆ తీర్మానం చాలా తీవ్రమైన నేరము.

    M.A.అభిలాష్ గారూ, మీరన్న ఈ నేరారోపణ మాత్రం క్షంతవ్యం కాని నేరం! ఇలా నేర నిర్థారణలు చేసే అధికారం మీ కెవరు కట్తబెట్టారు? మీకు మీరే జ్ఞానులమనీ పండితునమనీ విర్రవీగి గర్వోక్తులు పలకటం మీ అప్రాజ్ఞతనే సూచిస్తుంది. మీతో చర్చలకు దిగే ఆలోచన ఏదీ లేకపోయినా మీ గర్వోక్తి సహించలేక ఇది వ్రాయవలసి వచ్చింది. వినయరహితుల పాండిత్యప్రకర్ష కాని జ్ఞానలేశం కాని వృధా వృధా అని దయచేసి తెలుసుకొన గలరు. స్వస్తి రస్తు.

    ReplyDelete
    Replies
    1. UnknownMay 27, 2015 at 7:27 AM

      గౌరవనీయులు శ్యామలీయంగారికి.
      ఆర్యా! గత టపాలలో "చౌదరిగారూ, శాస్త్ర చర్చలపట్ల నాకు అభిలాష లేదు. శాస్త్రవివరణలు చేసే పాండిత్యమూ లేదు అని ముందే చెప్పాను. వెబ్ చర్చలోకి మళ్ళీ నన్ను లాగాలని యత్నించకండి. ప్రయోజనం ఉండదు." అని మీరన్న కామెంట్లు అవి. మీకసలు శాస్త్ర వివరణలు చేసే ఏవిధమైన పాండిత్యం లేనప్పుడు, ఎదుటివారిని అప్రాజ్ఞతకులని తీర్మానించడం సరైన పద్ధతి కాదనిపిస్తోంది. గత టపాల నుండి నేను గమనిస్తున్నదేమిటంటే "విగ్రహారాధన శాస్త్ర బద్ధమా? శాస్త్ర వ్యతిరేకమా" అనే సవాలుకు మీరెవరూ కూడా నిలబడలేక పోవడం, వాటి రచయిత అభిలాష్ గారిపై తీవ్రంగా విమర్శించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.

      Delete
      Replies
        Reply
    2. శ్యామలీయంMay 27, 2015 at 8:09 AM

      ధన్యోస్మి.

      Delete
      Replies
        Reply
    3. Jai GottimukkalaMay 27, 2015 at 4:35 PM

      చౌదరి గారూ, ఇది మరీ దారుణం.

      అభిలాష్ గారు శుక్రాచార్య గారికి నేరాన్ని ఆపాదించి తానె చేసిన ఆరోపణ నిజమని ధ్రువీకరించి పడేసారు. He wants to act as prosecutor, judge, jury & executioner! దీన్ని తప్పు పట్టడానికి శ్యామలీయం మాస్టారికి కాదు ఎవరికయినా హక్కుంది. మీరు ఆయనపై బలవంతంగా "సహకారం" రుద్దే ప్రయత్నం వారు తిరస్కరించారనే కోపంతో ఆయనను దుయ్యబట్టడం మీ చిన్నతనాన్నే సూచిస్తుంది.

      మరొక్క విషయం: ఎదుటి వారి వివరణలు హేతుహీనం అని తెలుసుకోవడానికి పాండిత్యం అవసరమా?

      విగ్రహారాధన తప్పా ఒప్పా అనే విషయం ప్రస్తుతం వదిలేద్దాం. అది మహా పాపమా? అన్న ప్రశ్నకు మీరు ఒక్క ఆధారం చూపించండి. నా ఈ సవాలు స్వీకరించేందుకు మీరు లేదా మీ తోటి దావాదారులు సిద్దమా?

      Delete
      Replies
        Reply
    4. UnknownMay 27, 2015 at 8:02 PM

      ఏది తప్పు, ఏది ఒప్పు అన్న విషయం కాసేపు పక్కకు పెడితే...

      విగ్రహారాధన తప్పు అని వాదిస్తున్న అభిలాష్ గారు కొన్ని పురాతన గ్రంధాల్లో ఉన్న భావాలు సత్యమని "నమ్మి" ఆ రకమైన వాదన చేస్తున్నారు. అంతకు మించి వారి దగ్గర మరే ఇతర ఆధారాలు లేవు.

      అలాగే విగ్రహారాధన "ఒప్పు" అని సమర్థించేవారు కూడా కొన్ని నమ్మకాల పై ఆధారపడి మాత్రమే వాదిస్తున్నారు. అంతకు మించి వారివద్ద కూడా ఆధారాలు లేవు.

      రెండు వైపుల వాదనా కేవలం నమ్మకాలపై మాత్రమే ఆధార పడినటువంటిది. కాబట్టి "తప్పు" అని ఋజువు చేయమని ఒకరు, "ఒప్పు" అని ఋజువు చేయమని మరొకరు సవాళ్ళు, ప్రతి సవాళ్ళు విసురుకుంటున్నారు.

      ఇద్దరు పుట్టు గుడ్డివాళ్ళు వెలుగు ఏ రంగులో వుంటుందని వాదించుకుంటే ఎలా వుంటుందో అలాగే ఇది కూడా. నిజానికి అన్ని మతాలు, ఏకేశ్వర, ద్వైత, బహుత్వ మొదలైన అన్ని రకాల సిద్ధాంతాలు కూడా కేవలం విశ్వాసాలపై ఆధార పడ్డవి మాత్రమే. నమ్మని వారి సంగతి ఎలా వున్నా, కనీసం వాటిని నమ్మేవారు ఒకరి నమ్మకాలను మరొకకు గౌరవించుకుంటే అందరికీ మంచిది.

      Delete
      Replies
        Reply
    5. Reply
  2. durgeswaraMay 26, 2015 at 7:39 PM

    మీరు ప్రచారం చేయాలనుకున్నా లేక గొప్పదనుకున్న మతం గూర్చి అమ్దులో తప్పొప్పులు దిద్దటానికి ప్రయత్నించండి ముందు. ఇతరుల గూర్చిదోషారోపణ చేయటానికి మేధావితనం అక్కరలేదు. పొగరుబోతు తనం చాలు. గతంలో ఇక్కడే చూశాను. ముస్లిం మతగ్రంథం మీద ప్రవక్తమీద ఎవరో దోషాలుఆరోపిస్తే దానికేదో సవరను మీ ఆలోచన కణుగునంగా ఇచ్చుకున్నారు. అలాగే హై్ందవధర్మం గూర్చి కూడా ఆకోణంలో ఆలొచించి చూస్తే అర్ధమవుతుంది. కాకుంటే ఇక్కడ సహనం ఎక్కువ కనుక వితండవాదులతో వాదులాడటం, ధర్మం గూర్చి ఇ్టానుసారం మాట్లాడేవారిని వారి కర్మానికి వదలివేయటం జరుగుతుంది. కనుకనే ఇంతటి ఆరోపణలను సహిస్తుంది ఈధర్మం
    సర్వేజనా సుఖినోభవంతు

    ReplyDelete
    Replies
      Reply
  3. hari.S.babuMay 27, 2015 at 4:57 PM

    @M>ABHILASH sayas:
    ఇప్పుడు మేము, హిందూ పండితులు అయిన మీకు, అలాగే క్రైస్తవ పడితులకూ ముస్లిం పడితులకూ కలిపి ఒక సలహా ఇస్తున్నాము దయచేసి, జాగ్రత్తగా గమనించగలరు- మీరు ఒక పండితునిగా ప్రజలతో ఏది చెప్పదలచినా అది ధర్మ శాస్త్రాల ఆధారాలతోనే చెప్పగలరు! ఊహాజనితమైన విషయములను చెప్పటం మానేయగలరు. లేదు మేము వాటిని మానలేము అనుకుంటే- ధర్మ శాస్త్రాలను వదలివేయండి! ఎందుకంటే- ఒకవైపు హిందూ-ముస్లిం-క్రైస్తవ అన్నార్తులు గుప్పెడు అన్నం కొరకు, దాహార్తులు గుక్కెడు నీళ్ల కొరకు, కనీస జీవిత అవసరాలు తీరక, కోట్లాది మంది అలమటిస్తూ అసువులు బాస్తుంటే, మరొకవైపు మీరు ధర్మం పేరిట చేసే- అశాస్త్రీయ, హేతురహిత, నిరర్ధక, వ్యర్థ , అర్థరహిత చేష్టలను, అవసరానికి మించి ఆలయాలకు, దర్గాలకు, మసీదులకు , చర్చీలకు కోట్లాది రూపాయలను ధారబోయిస్తున్నారు! ఇంకా దేవుని పెళ్ళిళ్ళపేరిట, దేవుని ఊరేగింపుల పేరిట, తీర్థాల, ఉరుసుల, క్రిస్మస్-ఈష్టర్ల పేరిట కోటానుకోట్ల రూపాయల వృథా ఖర్చుల ఈ ప్రహసనం ఏమిటి? ఇవన్నీ చేయాలని లేదా కనీసం వాటిలో ఏదో ఒకటి చేయాలని ఒక్కగాని ఒక్క ఆధారాన్ని హిందూ-క్రైస్తవ-ముస్లిం పండితులలో ఎవరయినా గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాలలో ఎప్పటికైనా చూపగలరా? ఇది హిందూ-క్రైస్తన-ముస్లిం పండితులకు మాతరఫున “జీవిత పరియంత సవాలు” (LIFE TIME CHALLENGE)!! కానీ, ఎప్పటికీ చూపలేరు!

    haribabu says:
    శిలువను పూజించు క్రైస్తవులు విగ్రహారాధకులు కారా,అదేమి చిత్రము?
    అది రూపమే కదా!దానిని భూతములను వదలించెది మహత్తులున్నవే!

    మక్క నగరములోని కాబ ఘనమెట్లు కాదో చెప్పవోయి పిచ్చివాడ?
    ఘనము రూపము కాదనుట వితండ వాదము కాదటోయ్ వెర్రివాడ!

    మేము చేయునది గొప్ప వారు చేయునది తప్పు
    అని చెప్పుట మితిలేని మూఢత్వమునకె సాక్ష్యం!

    ReplyDelete
    Replies
      Reply
  4. UG SriRamMay 27, 2015 at 5:29 PM

    ఆలయాలకు, దర్గాలకు, మసీదులకు , చర్చీలకు కోట్లాది రూపాయలను ధారబోయిస్తున్నారు! ఇంకా దేవుని పెళ్ళిళ్ళపేరిట, దేవుని ఊరేగింపుల పేరిట, తీర్థాల, ఉరుసుల,క్రిస్మస్-ఈష్టర్ల పేరిట కోటానుకోట్ల రూపాయల వృథా ఖర్చుల ఈ ప్రహసనం ఏమిటి? 


    అన్య మతాక సంగతి తెలియదు గాని , హిందూ దేవాలయలు పభుత్వానికి పన్నులు కడతాయి. ఈ మధ్య కాలం లో ప్రభుత్వాలు ఆదాయం కోసం దేవాలయాలను, ఉత్సవాలను టురిజం పేరు తో ప్రోత్సహిస్తున్నానారు.
    అదేమి తప్పు కాదు. ఎంతో మందికి దేవాలయాలు ఉపాధి కలిపిస్తున్నాది. పూలు అమ్ముకొనేవారు, టెంకాయలు, కుంకుమ మొదలుకొని హోటల్, లాడ్జి ల వారి వరకు లక్షల మందికి ఉపాధి కలిపిస్తున్నాయి.

    ReplyDelete
    Replies
    1. Jai GottimukkalaMay 27, 2015 at 6:35 PM

      అభిలాష్ గారు అన్ని మతాల అన్నార్తుల/దాహార్తుల గురించి మాట్లాడడం వరకు బాగానే ఉంది కానీ మరో పక్క హజ్/ఉమ్రా, రోజుకు అయిదు నమాజులు లాంటి "ధర్మ సమ్మత కార్యక్రమాలు" కోసం సమయం & ఖర్చు వ్యయం చేయడం కనిపించలేదు.

      దేశంలోని అన్ని దర్గాలలో అగర్బత్తీలు వెలిగించడం మానేస్తే మిగిలే ధనం కన్నా 100 మంది తీర్తయాత్రలకు పెట్టే ఖర్చు ఎక్కువ కాదంటారా?

      Delete
      Replies
        Reply
    2. Reply
  5. Jai GottimukkalaMay 27, 2015 at 5:52 PM

    14:26 శ్లోకానికి ఇక్కడ ఇచ్చిన అనువాదం మీకెక్కడ దొరికిందో ఏమో?

    సంస్కృత మాతృక:
    māḿ ca yo ’vyabhicāreṇa
    bhakti-yogena sevate
    sa guṇān samatītyaitān
    brahma-bhūyāya kalpate

    సరయిన అనువాదం:

    One who engages in full devotional service, unfailing in all circumstances, at once transcends the modes of material nature and thus comes to the level of Brahman

    దీనికి విగ్రహాలకు సంబంధం మీకు ఎలా కనిపించిందో మరి?

    ReplyDelete
    Replies
      Reply
Add comment
Load more...

మీ అభిప్రాయాలు,సలహాలు,సూచనలు,సందేహాలు పంపగలరు
అందరూ చదువుకొనుటకు వీలుగా తెలుగులోనే వ్రాయవలెను.

← Newer Post Older Post → Home
Subscribe to: Post Comments (Atom)

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక...
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే...
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క...
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ...
  • శుభవార్త: "సిలువ...బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ...
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద...
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే...
  • స్వలింగ సంపర్కం వ్యక్తిగత స్వేచ్చా?
    రచ్చబండ లో జరిగిన స్వలింగ సంపర్కం గూర్చి కొంతమంది మేధావుల అభిప్రాయాలు చదివి చాలా ఆశ్చర్యమేసింది. స్వలింగ సంపర్కాన్ని మేము సమర్ధించమంటూనే అద...
  • M.A.అభిలాష్ గారితో ముఖాముఖి: పరిశుద్ధ బైబిలు ప్రబోధనల ప్రకారం:యేసు సిలువపై మరణించ లేదు! -1 (పాప పరిహారానికి రక్తమొక్కటే ప్రత్యమ్నాయమా?)
    సర్వశక్తిగల దేవుని పేరుతో...  యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలువదు. -సామెతలు 21:30 గౌరవ నీయులైన పాఠక మిత్రులా...

Recent Comments

Blog Archive

  • ►  2021 (2)
    • ►  April (1)
    • ►  January (1)
  • ►  2020 (2)
    • ►  August (1)
    • ►  April (1)
  • ►  2019 (14)
    • ►  December (2)
    • ►  October (2)
    • ►  June (3)
    • ►  February (4)
    • ►  January (3)
  • ►  2018 (14)
    • ►  December (2)
    • ►  November (1)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (1)
    • ►  May (2)
    • ►  April (2)
    • ►  March (2)
    • ►  February (2)
  • ►  2017 (37)
    • ►  December (2)
    • ►  November (3)
    • ►  October (4)
    • ►  September (6)
    • ►  August (8)
    • ►  July (5)
    • ►  June (5)
    • ►  March (2)
    • ►  January (2)
  • ►  2016 (63)
    • ►  December (3)
    • ►  November (1)
    • ►  October (10)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (5)
    • ►  May (6)
    • ►  March (1)
    • ►  February (17)
    • ►  January (18)
  • ▼  2015 (123)
    • ►  December (12)
    • ►  November (4)
    • ►  October (8)
    • ►  September (13)
    • ►  August (7)
    • ►  July (12)
    • ►  June (7)
    • ▼  May (18)
      • సాక్ష్యం మేగజైన్ నడపడంలో ఒక అనిర్వచనీయమైన ఆనందం!
      • శుక్రాచార్య గారి ప్రశ్నలకు M.A.అభిలాష్ గారి సమాధాన...
      • గోపాల్ శర్మగారి సందేహములకు M.A.అభిలాష్ గారి సమాధాన...
      • బైబిల్ వెలుగులో వేరొక ఆదరణకర్త ఎవరు? - 6
      • బైబిల్ వెలుగులో వేరొక ఆదరణకర్త ఎవరు?-5
      • యేసు దైవత్వాన్ని ఖండిస్తున్న బైబిల్!
      • విగ్రహారాధన- మహామోసం!-మహాదోపిడి!! -1
      • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
      • బైబిల్ ప్రకారం - పాపులైన క్రైస్తవులకు పాపక్షమాపణ ల...
      • నేడు జరగవల్సింది...మతమార్పిడా? లేక మతసంస్కరణా? -2
      • నేడు జరగవల్సింది...మతమార్పిడా? లేక మతసంస్కరణా?
      • బైబిల్ వెలుగులో వేరొక ఆదరణకర్త ఎవరు? -4
      • ఎడిటర్ ఛాయిస్ : మత ప్రచారం పేరుతో జాతిదురాక్రమణ..?
      • నన్ను చూచువాడు, తండ్రిని చూచినట్టే...అంటే? Part : 2
      • బైబిల్ వెలుగులో వేరొక ఆదరణకర్త ఎవరు? -3
      • బైబిల్ వెలుగులో వేరొక ఆదరణకర్త ఎవరు? -2
      • బైబిల్ వెలుగులో వేరొక ఆదరణకర్త ఎవరు?
      • హిందూ శాస్త్రుల కులతత్వాన్ని ఖండిస్తున్న హిందూ శాస...
    • ►  April (6)
    • ►  March (8)
    • ►  February (14)
    • ►  January (14)
  • ►  2014 (105)
    • ►  December (13)
    • ►  November (13)
    • ►  October (11)
    • ►  September (38)
    • ►  August (11)
    • ►  July (18)
    • ►  June (1)
  • ►  2013 (9)
    • ►  November (2)
    • ►  October (7)

Followers

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం

FB Follow

Sakshyam Magazine

Supporters



Follow by Email

Copyright © Sakshyam Magazine | Designed by Jayati Creative