• Contact us
  • Privacy Policy
  • Disclaimer
  • About Us

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Rachabanda
  • About Us
  • Sitemap
  • More
    • Vedas
    • Bible
    • SL Wuss V2
    • SL Wuss V3
    • SL Super Fast

Recent Acticles

Home » Uncategories » గీతాశాస్త్రం వెలుగులో "సృష్టికర్త-మనశ్శాంతి" పుస్తక రచయిత మనసులోని మాట-1

గీతాశాస్త్రం వెలుగులో "సృష్టికర్త-మనశ్శాంతి" పుస్తక రచయిత మనసులోని మాట-1

Posted by Sakshyam Magazine on Wednesday, July 23, 2014

నేను ఒక ధార్మిక ముస్లిం కుటుంబానికి చెందినవాడిని.నా పేరు ముహమ్మద్ ముష్తాఖ్ అహ్మద్. నా కలం పేరు అభిలాష్.నా ముస్లిమేతర సోదరులకు నేను "ముహమ్మద్.యం.ఎ.అభిలాష్"గా చిర పరిచితుడును.నా అదృష్టం కొద్దీ ఖురాన్ గ్రంధాన్ని దాని సహజ స్వరూపంలో అధ్యయనం చేసే భాగ్యం నాకు కలిగింది.తద్వారా ఖురాన్ గ్రంధం పట్ల మూఢ భక్తి కలిగిన వారికి ఉండే సంకుచితతత్వం నాకు అబ్బలేదు.ఎలాంటి ముందస్తు భావాలు,వ్యాఖ్యానాలు లేకుండా ఖురాన్ గ్రంధాన్ని కనుక అధ్యయనం చేస్తే ఎంతో విశాల దృక్పధాలు ఏర్పడతాయి.ఖురాన్ గ్రoధం నాకు ఇచ్చిన ఆలోచనా విధానమే ఖురానేతర ధార్మిక గ్రంధాలైన వేదోపనిషత్తులు,గీతాశాస్త్రం,బైబిల్ వంటి గ్రంధాలను అధ్యయనం చేయడానికి ప్రేరకమయ్యింది.
        ఒక ముస్లిం అయి ఉండి భగవద్గీతా శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని ఒక పుస్తకాన్ని ఎలా వ్రాయగలిగారు? అన్న మీమాంస ఇటు హిందువులకు అటు ముస్లింలకు నాపట్ల కలుగకమానదు.కనుక ఆ ఉభయవర్గాలలో ఏర్పడిన ఈ మీమాంసను నివృత్తి చేయవలసిన బాధ్యత నాపై ఉంది.
        ఉభయవర్గాల ఈ సందేహానికి గల కారణం ఏమిటంటే -ప్రతివర్గమూ తన వద్ద ఉన్న ధార్మిక గ్రంధాన్ని అది తమ మతవర్గానికి మాత్రమే చెందిన గ్రంధం అన్న అభిప్రయానికి గురై ఉండటం.అది కేవలం వారి అపోహ మాత్రమే.ఎందుకంటే, ఆ గ్రంధాలు-"వర్ణం -వర్గం,ప్రాతం-దేశం" ప్రాతిపదికన కాక, "విశ్వాసులు-అవిశ్వాసులు, శిష్టులు-దుష్టులు" అని వ్యక్తిత్వాన్ని బట్టి మాత్రమే ప్రజలను వర్గీకరిస్తున్నాయి. అంటే-ప్రజలను ఆయా "వర్గాల పరం"గా ఆదరించక, ఆయా వ్యక్తులను,వర్గాలను వారి "శీలంపరం"గా మాత్రమే ప్రాముఖ్యాన్ని ఇస్తున్నాయన్నమాట.దీనిని బట్టి ఆ గ్రంధాలు సార్వజనీన సందేశాన్ని ఇస్తున్నాయని స్పష్టమవుతున్నాయి. వాటి ఈ స్వభాన్ని బట్టి ఆ గ్రంధాలు ఆయా వర్గాల వద్ద ఉన్నప్పటికీ, అవి సర్వమానవుల ఉమ్మడి సొత్తు అయి ఉన్నాయి.అందుకే నేను ఒక ముస్లిం వర్గానికి చెందిన వాడినైనప్పటికీ, హిందువుల వద్ద ఉన్న గీతాశాస్త్రం వెలుగులో ఈ పుస్తకాన్ని వ్రాసే హక్కును కలిగి ఉన్నాను.ఇది నాహిందూ సోదరులకు నా వివరణ.
          ఇక,ఖురాన్ కోణంలో నా ఈ సాహసం విషయమై నా వివరణ ఏమిటంటే- ఖురాన్ గ్రంధంలో ముస్లింల ప్రత్యేకతలలో ఒక ప్రత్యేకతను సూచిస్తూ 3:119వ వచనంలో .."మీరైతే సకల ధార్మిక గ్రంధాలనూ విశ్వసిస్తారు"అని ఖురానేతర గ్రంధాల పట్ల ముస్లింల విధానాన్ని అల్లాహ్ స్వయంగా స్పష్టపరుస్తున్నాడు.ఈ విషయం నేను ఒక ముస్లింగా గీతాశాస్త్రం పట్ల కలిగి ఉన్న అనుకూల అభిప్రాయానికి ఒక ప్రధాన ప్రేరకమయ్యింది.
        ఇంకా నా ఈ రచనాక్రమం అంతా,హిందూ సమాజం "గీతాశాస్త్ర ప్రతిపాదిత దైవభావన"ను అర్ధం చేసుకుని,ఆచరించాలన్న దానిపైనే సాగింది.ఇది సంకుచితవాదులు,చాందసవాదులు మరీ ముఖ్యంగా "ఖూరాన్ సందేశ మూలసారాన్ని"గుర్తించని వారికి అసలు మింగుడుపడని విషయమవుతుంది.
       అయితే ఖురాన్ గ్రంధాన్ని విశ్వసించని యూదులను,క్రైస్తవులను ఉద్దేశించి 5:66వ వచనంలో -"వారు తౌరాతును,ఇంజీలును ఇంకా వారి ప్రభువు తరపు నుండి వారి వద్దకు పంపబడిన ఇతర గ్రంధాలను స్థాపించి ఉంటే ఎంత బాగుండేది..!" అని అల్లాహ్ స్వయంగా అభిలషిస్తున్నాడు. ఈ అభిలాష కలిగి ఉన్న ఆ దైవాన్ని విశ్వసిస్తున్న ప్రతివాని అభిలాష కూడా అదే ఉండాలి కదా! అందుకే హిందూ సమాజం తమ వద్ద ఉన్న గీతాశాస్త్రంలోని "దైవభావాన్ని"అర్ధం చేసుకుని, ఆచరించాలని ఒక ముస్లింగా నేనూ అభిలషిస్తున్నాను. నా ఈ అభిలాష ఖురాన్ ప్రకారం సమంజసమే కదా! ఎందుకంటే -గీతాశాస్త్ర ప్రతిపాదిత "దైవభావన"అచ్చం ఖురాన్ ప్రతిపాదిత దైవభావనే కనుక.
         ఇక ఖురాన్ రెండు అతివాదాలకు నడుమ ఉన్న ఒక మధ్యేమార్గాన్ని చూపే గ్రంధం.ఇంకా అదే మార్గ జీవనవిధానం తనకు పూర్వం ఉన్న సకల ధార్మిక గ్రంధాలలో ఇప్పటికీ ఉన్నదని ప్రకటిస్తుంది.అంతే కాదు ఆ యా గ్రంధాలలో ఆ "సనాతన మధ్యే మార్గాన్ని" కనుక ఆ యా గ్రంధాల ప్రజలు అనుసరిస్తే, వారికీ మోక్షం కలుగుతుందని సెలవిస్తుంది.ఇది నా ముస్లిం సోదరులకు నా వివరణ.
<---Back Page                                                                 ఇంకా వుంది త్వరలో....
..............................................................................................................................
                             మరిన్ని ధార్మిక రచనలు కోసం "ప్రముఖుల రచనలు" క్లిక్ చేయండి.

0 Response to "గీతాశాస్త్రం వెలుగులో "సృష్టికర్త-మనశ్శాంతి" పుస్తక రచయిత మనసులోని మాట-1"

మీ అభిప్రాయాలు,సలహాలు,సూచనలు,సందేహాలు పంపగలరు
అందరూ చదువుకొనుటకు వీలుగా తెలుగులోనే వ్రాయవలెను.

← Newer Post Older Post → Home
Subscribe to: Post Comments (Atom)

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక...
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే...
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క...
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ...
  • శుభవార్త: "సిలువ...బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ...
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద...
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే...
  • స్వలింగ సంపర్కం వ్యక్తిగత స్వేచ్చా?
    రచ్చబండ లో జరిగిన స్వలింగ సంపర్కం గూర్చి కొంతమంది మేధావుల అభిప్రాయాలు చదివి చాలా ఆశ్చర్యమేసింది. స్వలింగ సంపర్కాన్ని మేము సమర్ధించమంటూనే అద...
  • M.A.అభిలాష్ గారితో ముఖాముఖి: పరిశుద్ధ బైబిలు ప్రబోధనల ప్రకారం:యేసు సిలువపై మరణించ లేదు! -1 (పాప పరిహారానికి రక్తమొక్కటే ప్రత్యమ్నాయమా?)
    సర్వశక్తిగల దేవుని పేరుతో...  యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలువదు. -సామెతలు 21:30 గౌరవ నీయులైన పాఠక మిత్రులా...

Recent Comments

Blog Archive

  • ►  2021 (2)
    • ►  April (1)
    • ►  January (1)
  • ►  2020 (2)
    • ►  August (1)
    • ►  April (1)
  • ►  2019 (14)
    • ►  December (2)
    • ►  October (2)
    • ►  June (3)
    • ►  February (4)
    • ►  January (3)
  • ►  2018 (14)
    • ►  December (2)
    • ►  November (1)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (1)
    • ►  May (2)
    • ►  April (2)
    • ►  March (2)
    • ►  February (2)
  • ►  2017 (37)
    • ►  December (2)
    • ►  November (3)
    • ►  October (4)
    • ►  September (6)
    • ►  August (8)
    • ►  July (5)
    • ►  June (5)
    • ►  March (2)
    • ►  January (2)
  • ►  2016 (63)
    • ►  December (3)
    • ►  November (1)
    • ►  October (10)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (5)
    • ►  May (6)
    • ►  March (1)
    • ►  February (17)
    • ►  January (18)
  • ►  2015 (123)
    • ►  December (12)
    • ►  November (4)
    • ►  October (8)
    • ►  September (13)
    • ►  August (7)
    • ►  July (12)
    • ►  June (7)
    • ►  May (18)
    • ►  April (6)
    • ►  March (8)
    • ►  February (14)
    • ►  January (14)
  • ▼  2014 (105)
    • ►  December (13)
    • ►  November (13)
    • ►  October (11)
    • ►  September (38)
    • ►  August (11)
    • ▼  July (18)
      • ఒక భక్తునికి సృష్టికర్తను గూర్చిన నిర్ధిష్ట గుర్తి...
      • గీతాశాస్త్రం వెలుగులో "సృష్టికర్త-మనశ్శాంతి" పుస్త...
      • యేసువారు ఈ లోకానికి రావడానికి గల ప్రధాన కారణం ఏమిటి?
      • M.A.అభిలాష్ గారి...పరిశోధాత్మక రచన: గీతాశాస్త్రం వ...
      • The Characteristics Of Prophet Muhammed (PBUH)
      • MUST WATCH Dr Zakir Naik Q&A 2014 ZAKIR NAIK QUEST...
      • ఆధ్యాత్మిక ప్రచారంలో క్రైస్తవులు ఉన్నంత వేగంగా ముస...
      • ఒక ముస్లిం [విశ్వాసి]ఈ రెండు విధులనూ నిర్వర్తించకప...
      • భారతదేశపు కోటలు
      • "మతమార్పిడి వద్దు!"అంటున్న బైబిలు గ్రంధం-యేసుక్రీస...
      • "మతమార్పిడి వద్దు!"అంటున్న బైబిలు గ్రంధం-యేసుక్రీస...
      • "మతమార్పిడి వద్దు!"అంటున్న బైబిలు గ్రంధం-యేసుక్రీస...
      • నల్లమలలో పురాతన నగరం?
      • వేద శాస్త్రాల ప్రకారం మాంసాహారం నిషిద్దమా?
      • రంగు..రంగుల Parrot Fish లను చూడండి.దేవుని యొక్క సృ...
      • 'త్రిత్వ"వాదం మరియు ;యేసు దైవత్వ"వాదం యేసు అనంతరమే...
      • 2.అల్ బఖర
      • 1.అల్ ఫాతిహా
    • ►  June (1)
  • ►  2013 (9)
    • ►  November (2)
    • ►  October (7)

Followers

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం

FB Follow

Sakshyam Magazine

Supporters



Follow by Email

Copyright © Sakshyam Magazine | Designed by Jayati Creative