• Contact us
  • Privacy Policy
  • Disclaimer
  • About Us

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Rachabanda
  • About Us
  • Sitemap
  • More
    • Vedas
    • Bible
    • SL Wuss V2
    • SL Wuss V3
    • SL Super Fast

Recent Acticles

Home » Bible Articles » “ఖురాన్ ఏ కారణం చేత “ప్రత్యక కుమారత్వం” (Son ship of God)” ని ఖండించింది? – Md Nooruddin

“ఖురాన్ ఏ కారణం చేత “ప్రత్యక కుమారత్వం” (Son ship of God)” ని ఖండించింది? – Md Nooruddin

Posted by Sakshyam Magazine on Friday, June 28, 2019
Label: Bible Articles

“బైబిల్ ప్రకారం యేసు దేవుని కుమారుడు! ఖురాన్ యేసు దేవుని కుమారుడన్న విషయాన్ని ఖండిస్తుంది! కాబట్టి ఖురాన్ క్రైస్తవ్యానికి వ్యతిరేకం!” “ముస్లిములు క్రీస్తు విరోధులు!” “దేవునికి కుమారులు లేరంటున్న ఖురాన్ లో దేవుడు వేరు, బైబిల్లో దేవుడు వేరు!” ఇవీ నేడు క్రైస్తవులు లేవనెత్తే వాదనలు. కాబట్టి “కుమారుడు” అన్న పదానికి అర్ధం ఏమిటి? అన్న దానికంటే ముందు “ఖురాన్ ఏ ప్రత్యక కారణం చేత “కుమారత్వాన్ని (Son ship of God)” ఖండించాల్సి వచ్చింది? అన్నది మనం ముందు తెలుసుకోవాల్సి ఉంది.

ఖురాన్ "కుమారత్వాన్ని" ఖండించటానికి ప్రధాన కారణం ఏమిటి?

===============================================
ఈ ఒక్క పాయింట్ మీద స్పష్టత వస్తే చాలు! “ఖురాన్ ఏ పరిస్థితులలో, ఏ ప్రత్యక కారణం చేత “కుమారత్వాన్ని” ఖండించాల్సి వచ్చిందో ఖురాన్ విమర్శకులు సైతం ఎంతో సులువుగా అర్ధం చేసుకోగలరు. ఈ టాపిక్ మీద మనం ముందుకు వెళ్లాలంటే ఈ క్రింది ఖురాన్ వాక్యాలను ఒకసారి గమనించాల్సి ఉంది.

“అల్లాహ్ ఒకనిని తన కుమారుడుగా చేసుకున్నాడు అని వారు అంటారు. కానీ అల్లాహ్ ఆ విషయాలకు అతీతుడు” – ఖురాన్ 2:116

పై వాక్యం ఆనాటి యూద, క్రైస్తవ జనాంగాన్ని ఉద్దేశిస్తూ చెప్పబడింది. ఈ వాక్యం మరొక సారి జాగ్రత్తగా చదవండి. “అల్లాహ్ ఒకనిని తన కుమారుడుగా చేసుకున్నాడు" అన్న వాక్యాన్ని అతిజాగ్రత్తగా గమనిస్తే ఖురాన్ “ప్రత్యేక కుమారత్వాన్ని (Special son ship of God విశ్వాసాన్ని)” ఖండించటాన్ని గమనించగలం. దానిని మరింత వివరంగా ఈ క్రింది వాక్యంలో చూడగలం.

“ఉజైర్ అల్లాహ్ కుమారుడని యూదులు అంటారు. మసీహ్ అల్లాహ్ కుమారుడని క్రైస్తవులంటారు” – ఖురాన్ 9:30

అటు యూదులు, ఇటు క్రైస్తవులు చేసిన అతి పెద్ద పొరపాటు ఏమిటో పై ఖురాన్ వాక్యాల ద్వారా తెలుసుకోగలం. అదేమిటంటే- ఉజైర్ (ఎజ్రా) మాత్రమే ప్రత్యేక కుమారుడని యూదులు భావిస్తే, “యేసు మాత్రమే ప్రత్యక కుమారుడని” క్రైస్తవులు భావించటం. దానికి గొప్ప ఉదాహరణ నేటి క్రైస్తవులు “కాకి పిల్ల కాకి అయినట్టు, కుక్క పిల్ల కుక్క అయినట్టు, రాజు కుమారుడు రాజైనట్టు దేవుని కుమారుడు దేవుడే కదా” అని అమాయకత్వంగా వాదించటమే!

వాస్తవానికి దేవుడైన యెహోవా సకల ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి “నా కన్న కుమారులు” (ద్వితీ 32:10) అని, ఇఫ్రాయేమును “నా జ్యేష్ట కుమారుడని” ఇస్రాయేలును నా జ్యేష్ట కుమ్మారుడని” (యిఫ్రాయెము31:9) ఇలా బైబిల్ మొత్తం చదివితే సకల ప్రవక్తలను, పరిశుద్ధులను, దూతలను అందరినీ “కుమారులని” చెప్పబడింది. “దేవుని ఆత్మ చేత నడిపింపబడేవారందరూ దేవుని కుమారులే”. ఈ విషయం బైబిల్లో ఉన్నప్పటికీ క్రైస్తవుల వాదన ఏమిటంటే “కుమారులు ఎందరున్నా యేసు అందరికంటే ప్రత్యేక కుమారుడు! ఈయన మిగతా కుమారులవంటి కుమారుడు కాదు!”. ఈ ప్రత్యక కుమారత్వాన్ని అంటగట్టట్టాన్నే అసలు ఖురాన్ తీవ్రంగా ఖండించింది. దానికి కారణం: సకల మానవాళీ దేవుని పెల్లలు అనటం వేరు! ఎవరినో ఒకరిని వేలెత్తి చూపి ఈయన మాత్రమే దేవుని ఏకైక కుమారుడనటం వేరు! ఈ విధంగా అతి సాధారణంగా అందరి విషయంలో వాడబడిన "కుమారుడు" లేక "దేవుని కుమారులు" అన్న పదాలు యూద, క్రైస్తవ పండితులు తమ ప్రవక్తలకే ప్రత్యేకించటం వలన ఆ పదాలు కాలానుగుణంగా కలుషితం (Polute) అయిపోయాయి. అందుకే మొత్తానికి ఖురాన్ "కుమారత్వాన్ని" ఖండించి పారేసింది.

ఉదాహరణకు: ఒక అధికారి తన క్రింద పనిచేసే వారినో, లేక తన పాలిత ప్రజలనో ఉద్దేశించి మీరంతా నా పిల్లలవంటివారు అనటం వేరు! తన రక్తం పంచుకుని పుట్టిన వానిని చూపి ఇతను నా కుమారుడు అనటం వేరు! మనకంటే పెద్దవానిని గౌరవార్థంగా తండ్రి వంటివారనటం వేరు, ఫలానా అతను మాత్రమే నా తండ్రి అనటం వేరు! ఫలానా అతను మాత్రమే నా తండ్రి అన్నపుడు అతను భౌతిక తండ్రి (biological father) గా ఎంచబడతాడు. వివరంగా చెప్పాలంటే – ఒక అధికారి మీరంతా నా పిల్లలవంటివారు అని చెప్పటం అలంకారికంగా - వారందరూ అతని ద్వారా “పోషింపబడేవారు” అని అర్ధం. ఒకనిని ప్రత్యేకంగా వేలెత్తి చూపి ఇతను నా కుమారుడు అంటే అతను తన రక్తాన్ని పంచుకుని పుట్టిన అస్తిత్వ పరమైన సంతానమని (biological son) అర్థం. ఈ ఉదాహరణ దృష్టిలో ఉంచుకుంటే “కాకి పిల్ల కాకి అయినట్టు, మనిషి కుమారుడు మనిషి అయినట్టు దేవుని కుమారుడు దేవుడే” అని చెప్పి క్రైస్తవులు చేసిన అతిపెద్ద తప్పు యెహోవాకు “భౌతిక కుమారత్వం” (biological son ship) ని అంటగట్టటమే!! ఒకరకంగా వారి అంతర్గత ఉద్దేశం “బైబిల్లో ఎంతమంది కుమారులు ఉన్నా యేసు ప్రత్యేకంగా అంటే- మెటీరీయల్ పరంగా అనగా అస్తిత్వ పరంగా దేవుని అస్తిత్వం నుండి బయటకు వచ్చిన ఒక భాగం!” అన్నది.

ఇంకా అతి ఘోరాతి ఘోరమైన విషయం ఏమిటంటే- అందరూ భౌతిక తండ్రుల ద్వారా పుడితే యేసు ఒక్కరే యెహోవా వలన జన్మించారు కాబట్టి యెహోవా, యేసు యొక్క తండ్రి అని చెప్పటం. ఇది ప్రత్యక్షంగా యేసుకు యెహోవా భౌతిక తండ్రి (biological father) అని ముద్ర వేయటం అన్న మాట. అంటే అందరూ ఆత్మీయ కుమారులైతే యేసు మాత్రం మెటీరీయల్ పరంగా అనగా వస్తుతః లేక అస్తిత్వ పరంగా యెహోవా యొక్క శరీరాన్ని పంచుకు పుట్టినవాడన్నది వారి అంతర్గత భావన.
ఒకవేళ ఈ సూత్రాన్ని బట్టి యేసుకు భౌతిక కుమారత్వాన్ని (biological son ship) అంటగట్టాలనుకుంటే పౌలు “యేసు శరీరమును బట్టి దావీసంతానం (రోమా 1:5)” అని చెబుతుంటే యేసు- “నేను దావీదు వేరు (root) ను మరియు సంతానమును (children)” (ప్రకటన 22:16) అని ప్రకటిస్తున్నారు. అప్పుడు కాకిపిల్ల కాకి అయినట్టు మనిషి కుమారుడైన యేసు కూడా అస్తిత్వ పరంగా మనిషే అవుతారు! ఇక్కడ బైబిల్ స్పష్టంగా యేసును మెటీరీయల్ పరంగా అనగా అస్తిత్వ పరంగా ఆయన “భౌతిక సంబంధ వస్తువు (biological material)” అని చెబుతుందే తప్ప ఆయన అభౌతిక పదార్థం (Supernatural material) అని చెప్పటం లేదు.

ఒకవేళ తండ్రిలేకుండా జన్మించటం వలన యేసు దేవుని ప్రత్యేక కుమారుడు! దేవుని కుమారుడు దేవుడే అయితే ఆదాము తలిదండ్రులు లేకుండా పుట్టినందుకు యేసుకంటే ఆదాము పెద్ద దేవుడని చెప్పాల్సి ఉంటుంది. అందుకే ఖురాన్ సింపుల్ గా యేసు పుట్టుక ఆదాము వంటిదే అని తేల్చేయటం జరిగింది.
అయితే మరి బైబిల్లో యేసు దేవుని కుమారుడని ఏ ప్రత్యక కారణం చేత అలా ఎంచబడ్డారు అంటే “దేవుడు ఈయన నా ప్రియకుమారుడు అని చెప్పటం!” ఈ రకమైన ప్రకటన గతంలో అనేక మంది విషయంలో చేశాడు. ఈ విషయాన్ని మనం పైన గమనించి ఉన్నాం. కానీ క్రైస్తవులు ఒక్క యేసునే దేవుడు- “నా ప్రియకుమారుడు” అన్నాడంటే ఏదో చిదంబర రహాస్యం మొత్తానికి ఉండే ఉంటుంది! అన్న ఫీలిగులోకి వెళ్ళిపోయి ఏదేదో ఊహించేసుకుని... అబ్బే! ఎంతకాదన్నా యేసు బాబు వేరు! ఆయన దేవుని బిడ్డ!! నా బిడ్డ నాతో సమానంకాడా? దేవుని బిడ్డ దేవునితో సమానం కాడా! అన్నంతవరకు వెళ్లిపోయారన్న మాట! ఈ విధంగా దేవుడు గతంలో అనేకమంది ప్రవక్తలను ఉద్దేశించి అలంకారికంగా చెప్పినట్టే యేసును “ఈయన నా కుమారుడు” అని చెప్పింది కాలానుగుణంగా యేసు అస్తిత్వ పరమైన కుమారుడిగా రూపుదిద్దుకోవటం జరిగింది!

ఈ విధంగా నిజానికి యూద, క్రైస్తవ వర్గం ఈ విధమైన “ప్రత్యేక కుమారత్వాన్ని” అంటగట్టక, బైబిల్లో “తండ్రి” అన్న పదం “పోషకుడు” అని, “కుమారుడు” అన్న పదం “దేవుని ఇష్టుడు” అని అలంకారికంగా చెప్పబడిందన్న విషయాన్ని గ్రహించి, అదే అసలు అర్ధాన్ని తీసుకుని ఉంటే వాస్తవానికి ఖురాన్ ఈ ప్రత్యేక కుమారత్వాన్ని ఖండించి ఉండేదే కాదు!

అంటే ఖురాన్ ప్రత్యేక కుమారత్వాన్ని ఖండించటం వెనుక మూల సూత్రధారులు అనాలోచితంగా బైబిల్ చదివిన యూద, క్రైస్తవ పండితులే!

“మనిషి కుమారుడు మనిషి అయినట్టు దేవుని కుమారుడు దేవుడే” అన్న భావనలో మునిగిపోయి, యేసు మాత్రమే ప్రత్యేక కుమారుడు అన్న ప్రచారం వెలుగులోకి తీసుకురావటంతో తొంభై శాతం క్రైస్తవులకు కూడా పాపం తెలియదు యేసు, దేవుని అనేక కుమారుల్లో ఒక కుమారుడని అని! చివరకు పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే- దేవుడు అంటే యేసుకు మాత్రమే తండ్రి, యేసు మాత్రమే దేవుని కుమారుడు! ఈ విధంగా ప్రత్యేక తండ్రీ, కుమారుల సంబంధం దేవునికి అంటగట్టటం అంటే ఆయన పరిశుద్ధతను నిట్టనిలువునా భంగం కలిగించటమే అవుతుంది! దానికి మించిన ఘోరమైన పాపం ఇంకొకటి ఉండదు కూడా!

అయితే ఇంత చెప్పినా సాతాను క్రైస్తవుల మైండును ఎలా లాక్ చేసి పెట్టాడంటే –

“యేసు, దేవుని ప్రత్యేక కుమారుడు కాదు అనేక కుమారుల్లో ఒక కుమారుడు అని ఒప్పుకుంటే యేసు దైవత్వాన్ని నిలువునా మంట కలపటమే అవుతుంది. అదెలా కుదురుతుంది! కుమారులు ఎంతమంది ఉన్నా అది వేరే విషయం. యేసు మాత్రమే దేవుని ప్రత్యేక కుమారుడు కాబట్టి యేసు దేవుడు!” అన్న భావన అధిక శాతం క్రైస్తవుల మదిలో నాటటం వలన అనేస్తేషియ (anesthesia) ఇచ్చిన పేషెంటుకి నొప్పి ఎలా అయితే తెలియదో, అసలు విషయం చెప్పినా నేటి క్రైస్తవులు అర్ధం చేసుకోలేనంతగా వారి మైండును మొద్దుబారిపోయేలా చేసేశాడు.

అంటే ఇక్కడ అసలు విషయం దేవునికి ప్రత్యేక కుమారత్వం అంతగట్టట్టం వెనుక అసలు అంతరార్థం – యేసుకు లేని దైవత్వాన్ని అంతగట్టం మాత్రమే! యేసుకు ప్రత్యక కుమారత్వం ఇవ్వకపోతే ఆయనకు దేవుని స్థానం కట్టబెట్టటం అసాధ్యం. ఇక యేసును దేవునిగా కాక మరో విధంగా కల్లోనే కాదు, పీడకల్లో సైతం ఊహించుకోవటాని ఇష్టపడని క్రైస్తవులు ఈ లాజిక్కులన్నీ ప్రక్కన పెట్టి, ఇల్లాజిక్కుగా అనిపించినా యేసు మాత్రమే ప్రత్యక కుమారుడు అన్న మొండి వాదనలోకి దిగిపోవటం జరిగింది. ఆ నేపథ్యంలో సృష్టికర్త అయిన దేవుడు – ఖురాన్లో ఈ ప్రత్యక కుమారత్వాన్ని అతి తీవ్రంగా ఖండించి పారేశాడు. ఈ విషయం నాటి యూద, క్రైస్తవ పండిత వర్గానికి అత్యంత చేదు విషయంగా పరిణమించింది. ఈ విషయాలపై సామాన్య క్రైస్తవ ప్రజల దృష్టి (attention) పోకుండా “ఖురాన్ యేసును దేవుని కుమారుడు కాడు అంటుంది! ఇంతకంటే ఘోరమైన విషయం మరొకటి ఉంటుందా! దీనిని బట్టి ముస్లిములందరూ క్రీస్తువిరోధులు, మన యేస్ బాబు వ్యతిరేకులు!” అన్న ప్రచారం సర్వసాధారణం చెయ్యటం మొదలు పెట్టారు.

జనాల బలహీనత కూడా “సత్యం చెప్పేవాణ్ణి త్వరగా నమ్మరు! అబద్దం చెప్పేవాణ్ణి పరిశీలించే చెబుతున్నాడా అన్నది చూడరు!”.

పోనీ, యేసు ఎక్కడైనా నేను మాత్రమే దేవుని కుమారుడిని అని చెప్పుకున్నారా? అంటే లేదు! నన్ను దేవుని కుమారునిగా అంగీకరించని వాడు నిత్యజీవంలో ప్రవేశింపడు అని చెప్పారా? లేదు! యేసు శిష్యులు గానీ పౌలు గానీ ఎక్కడైనా ఒక్క యేసు మాత్రమే దేవుని ప్రత్యేక కుమారుడు కాబట్టి యెసే దేవుడు అని ప్రకటించారా? లేదు! ఆదేవుడే యేసు రూపంలో పుట్టాడంటూనే, మరో ప్రక్క యేసు ఆ దేవుని కుమారునిగా ఈ లోకమందు పంపబడ్డాడని చర్చీలలో చెబితే తలాడించే అమాయక జనం ఉన్నంతకాలం ఇలాంటి సిద్ధాంతాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. మరి నిత్యజీవం పొందాలంటే యేసును దేవునిగా కాక, కుమారునిగా కాక ఎలా నమ్మాలి? అంటే యేసు – “నేను మెస్సియ”ను (యోహాను 4:25), “నన్ను అలా నమ్మితేనే నిత్యజీవము (యోహాను 17:3)” అన్న షరతును కూడా పెట్టారు. కనుక బైబిల్లో అనేకమంది ఇవ్వబడిన సాధారణ “కుమారుడు” అన్న హోదాలో యేసును ప్రకటించాలా? యేసుకు దేవుని ద్వారా ఇవ్వబడిన “మెస్సియ” అన్న ప్రత్యేక స్థానాన్ని ప్రకటించాలా అన్నది నిత్యజీవం కోరుకునే క్రైస్తవుల ఇష్టం. - Md Nooruddin

0 Response to "“ఖురాన్ ఏ కారణం చేత “ప్రత్యక కుమారత్వం” (Son ship of God)” ని ఖండించింది? – Md Nooruddin "

మీ అభిప్రాయాలు,సలహాలు,సూచనలు,సందేహాలు పంపగలరు
అందరూ చదువుకొనుటకు వీలుగా తెలుగులోనే వ్రాయవలెను.

← Newer Post Older Post → Home
Subscribe to: Post Comments (Atom)

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక...
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే...
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క...
  • శుభవార్త: "సిలువ...బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ...
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ...
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే...
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద...
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • స్వలింగ సంపర్కం వ్యక్తిగత స్వేచ్చా?
    రచ్చబండ లో జరిగిన స్వలింగ సంపర్కం గూర్చి కొంతమంది మేధావుల అభిప్రాయాలు చదివి చాలా ఆశ్చర్యమేసింది. స్వలింగ సంపర్కాన్ని మేము సమర్ధించమంటూనే అద...
  • బైబిల్ ప్రకారం - పాపులైన క్రైస్తవులకు పాపక్షమాపణ లేదు : M.A.అభిలాష్

Recent Comments

Blog Archive

  • ►  2020 (3)
    • ►  August (1)
    • ►  June (1)
    • ►  April (1)
  • ▼  2019 (14)
    • ►  December (2)
    • ►  October (2)
    • ▼  June (3)
      • “ఖురాన్ ఏ కారణం చేత “ప్రత్యక కుమారత్వం” (Son ship ...
      • Hare Rama Hare Krishna..Honey Trap Naa? | TV5 Murt...
      • శిలువ సాక్షిగా జరిగే మోసాలు ఇంకెన్నాళ్లు | BIG Liv...
    • ►  February (4)
    • ►  January (3)
  • ►  2018 (14)
    • ►  December (2)
    • ►  November (1)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (1)
    • ►  May (2)
    • ►  April (2)
    • ►  March (2)
    • ►  February (2)
  • ►  2017 (37)
    • ►  December (2)
    • ►  November (3)
    • ►  October (4)
    • ►  September (6)
    • ►  August (8)
    • ►  July (5)
    • ►  June (5)
    • ►  March (2)
    • ►  January (2)
  • ►  2016 (63)
    • ►  December (3)
    • ►  November (1)
    • ►  October (10)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (5)
    • ►  May (6)
    • ►  March (1)
    • ►  February (17)
    • ►  January (18)
  • ►  2015 (123)
    • ►  December (12)
    • ►  November (4)
    • ►  October (8)
    • ►  September (13)
    • ►  August (7)
    • ►  July (12)
    • ►  June (7)
    • ►  May (18)
    • ►  April (6)
    • ►  March (8)
    • ►  February (14)
    • ►  January (14)
  • ►  2014 (105)
    • ►  December (13)
    • ►  November (13)
    • ►  October (11)
    • ►  September (38)
    • ►  August (11)
    • ►  July (18)
    • ►  June (1)
  • ►  2013 (9)
    • ►  November (2)
    • ►  October (7)

Followers

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం

FB Follow

Sakshyam Magazine

Supporters



Follow by Email

Copyright © Sakshyam Magazine | Designed by Jayati Creative