• Contact us
  • Privacy Policy
  • Disclaimer
  • About Us

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Rachabanda
  • About Us
  • Sitemap
  • More
    • Vedas
    • Bible
    • SL Wuss V2
    • SL Wuss V3
    • SL Super Fast

Recent Acticles

Home » Uncategories » అల్లాహ్ దృష్టిలో ఒక దినం 1000 సంవత్సరాలా? 50,000 సంవత్సరాలా? - Md Nooruddin

అల్లాహ్ దృష్టిలో ఒక దినం 1000 సంవత్సరాలా? 50,000 సంవత్సరాలా? - Md Nooruddin

Posted by Sakshyam Magazine on Friday, February 8, 2019

ఖురానులో ఒక చోట అల్లాహ్ దృష్టిలో ఒక దినం అంటే 1000 సంవత్సరాలకు సమానం అని వ్రాయబడి ఉంటే, మరో చోట 50,000 సంవత్సరాలని ఉంది! దీనిని బట్టి ఖురాన్ పరస్పర విరుద్ధమైన సమాచారాన్ని ఇస్తుందా? అన్నది అధిక శాతం మంది ముఖ్యంగా కొందరు క్రైస్తవ బోధకులు సైతం అడిగే ప్రశ్న! వాస్తవానికి ఖురాన్ లో స్వయంగా అల్లాహ్ చెబుతున్నదేమిటంటే...

“వారు ఖురాన్ గురించి ఆలోచించరా? ఇది అల్లాహ్ నుండి గాక మరెవరినుండో వచ్చి ఉంటే ఇందులో ఎంతో భావ వైరుధ్యం ఉండేది కదా” - 4:82

దీనిని బట్టి ఖురాన్ లో అసలు ఎటువంటి భావ వైరుధ్యానికి తావే లేదన్న విషయం తేటతెల్లమవుతుంది. ఒకవేళ కొన్ని సందర్భాలు మనకు ఒకదానికొకటి విభేదించుకున్నట్లు కనపడుతున్నాయి అంటే ఒకటి మూల భాష యొక్క అవగాన లోపమైనా అయ్యుండాలి! లేదా ఆయా సందర్భాలను అర్ధం చేసుకోవటంలో లోపమైనా జరిగి ఉండాలి తప్ప ఖురాన్ లో 0.1% విరుద్ధ విషయాలు సైతం లేవు అన్నది నిరూపణ జరిగిపోయిన వాస్తవం.

“సమయం (TIME)” గురించి సంక్షిప్తంగా!

ఈ సందర్భంలో ప్రతీ ఒక్కరూ అవగాహన పరచుకోవలసిన కొన్ని ముఖ్య విషయాలు ఉన్నాయి. ముందుగా ఇవి అర్థం చేసుకుంటేనే పై ప్రశ్నకు సమాధానం సులువుగా అర్థం చేసుకునే వీలుంటుంది. అసలు “సమయం (TIME)” అనేది ఎలా విశ్లేషించబడుతుంది? ఏ స్కేలు ఆధారంగా టైమ్ అనేది కొలవటం జరుగుతుంది? అన్నది గమనిస్తే... ప్రముఖ శాస్త్రవేత్త అయిన “ఆల్బర్ట్ ఐన్ స్టీన్” యొక్క “Theory of Relativity” ప్రకారం సమయం అన్నది “Mass and Velocity” పై ఆధారపడి ఉంటుందన్నది. సులువుగా చెప్పాలంటే భూమిపై ప్రస్తుతం మనం లెక్కించే 24 గంటల “సమయం (Time or Period)” అనేది చంద్రుడు భూమి చుట్టూ మరియు భూమి తనంతట తాను సూర్యుడు చుట్టూ తిరిగే వేగం (Velocity) ఆధారంగా లెక్కించబడుతుంది. వీటి గమనాలను బట్టే Lunar Calendar మరియు Solar Calendar ను రూపుదిద్దటం జరిగింది. ఇక ఇతర గ్రహాల ఒక రోజును మన ఒక రోజుతో పోల్చి చూస్తే శుక్ర గ్రహం (Venus) పై 5,832 గంటలు గడిస్తేనే ఒక రోజు అవుతుంది. ఇది భూమిపై 243 రోజులకు సమానం!  అలాగే బుద్ధ గ్రహం (Mercury) పై 1408 గంటలు గడిస్తేనే ఒక రోజు అవుతుంది. ఇది భూమిపై 58.6 రోజులకు సమానం! ఇక బృహస్పతి (Jupiter) పై కేవలం 10గంటలు ఒక రోజు అవుతుంది. అలాగే ఇతరగ్రహాల సమయాల పరిస్థితి కూడా! ఈ విధంగా మనకు తెలిసిన ఒక దినం అన్నది విశ్వంలో మనకు దగ్గరలో ఉన్న గ్రహాల కక్ష్యలు వాటి మధ్య దూరాలను బట్టే మారిపోతున్నప్పుడు దేవుని దృష్టిలో ఒక దినం అన్న దాన్ని మనకు తెలిసిన 24 గంటల సమయం కలిగిన ఒక దినంతో కొలవటం పూర్తిగా అర్థరహితం అయిపోతుంది. కాబట్టే ఖురాన్లో 22:47 మరియు 32:5 వాక్యల్లో నీ ప్రభువు వద్ద ఒక్క దినం మీ లెక్క ప్రకారం వేయి సంవత్సరాలకు సమానమైనది” అని చెప్పటం జరిగింది. చిత్రం ఏమిటంటే బైబిల్లో సైతం ఇదే విషయం ప్రస్తావించబడి ఉండటం! 

“నీ దృష్టిలో వేయి సంవత్సరములు గతించిన నిన్నటి వలె నున్నవి” - కీర్తనలు 90:4

“ఏమనగా మన ప్రభువు (అనగా యెహోవా) దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరముల వలెను, వెయ్యి సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి” - 2 పేతురు 3:8       
     
భూలోకం యొక్క సమయంతో పోల్చితే అల్లాహ్ యొక్క సమయం అసమానమైనది!

అల్లాహ్ యొక్క ఒక దినం ఎంతమాత్రం భూలోకం యొక్క సమయంతో సరితూగదు అన్న విషయం సుస్పష్టపరచటానికే అల్లాహ్ ఖురాన్ లో ఒక దినం అంటే అల్లాహ్ దృష్టిలో “వేయి సంవత్సరాలు” “యాభై వేల సంవత్సరాలకు” సమానం అని చెప్పటం జరిగింది. అంటే భూమిపై వెయ్యి సంవత్సరాల ఒక సుదీర్గ కాలం అల్లాహ్ దృష్టిలో ఒక రోజుతో సమానమని చెప్పవచ్చు. ఈ విషయం ప్రస్తుతం ఎందరో శాత్రవేత్తలు అనేక ప్రయోగాలు చేసి భూమి మీద గడిచే సమయం, విశ్వంలో గడిచే సమయం వేరు వేరని చెప్పారు.  అయితే ఖురానులో ఒక చోట అల్లాహ్ దృష్టిలో ఒక దినం అంటే 1000 సంవత్సరాలకు సమానం అని, మరో చోట 50,000 సంవత్సరాలని ఎందుకు ఉంది? అన్నది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

“ఒక దినం” అంటే “ఒక కాలం లేదా ఒక యుగం (Period)” అని అర్థం!

వాస్తవానికి ఖురాన్లో 22:47, 32:5, 70:4 ఈ మూడు వాక్యాల్లో “ఒక రోజు” అన్న పదానికి అరబ్బీలో “యోమ్ (Yome)” అనే పదం వాడబడింది. ఈ పదానికి “ఒక రోజు” అనే అర్థం ఉంది. అలాగే ఒక “కాలము లేదా యుగము (Period)” అనే మరో అర్థం కూడా ఉంది. ఒక యుగం (Period) లో ఎన్నో సంవత్సరాలు ఉండవచ్చు. ఒక Period/పీరియడ్ అంటే గంట, సంవత్సరం, వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు ఎంతైనా కావొచ్చు. కాబట్టి ఖురాన్ లో ఒక దినం అంటే అర్థం మనకు తెలిసిన 24 గంటలు కలిగిన ఒక దినం అని కాదు! ఇక్కడ ఒక రోజు లేక ఒక దినం అంటే “ఒక యుగం” లేదా “ఒక కాలం” (one Period) అని అర్థం. ఉదాహరణకు ఖురాన్ లో మొత్తం సృష్టిని ఆరు దినాల్లో సృష్టించానని దేవుడు చేసినట్లు చూడగలం. ఇక్కడ ఆరు రోజులు అంటే “ఆరు కాలాలు” అని అర్థం. అంటే దేవుడు మొత్తం సృష్టిని “ఆరు కాలాల్లో లేక ఆరు యుగాల్లో (6 Periods లో)” సృష్టించాడని అర్థం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ క్రింది వాక్యాన్ని చదవండి. 

“ఓ ప్రవక్తా! వారు నిన్ను శిక్ష కొరకు తొందర పెడుతున్నారు. కానీ, అల్లాహ్ తన వాగ్దానాన్ని భంగపరచడు. మరియు నిశ్చయంగా, నీ ప్రభువు వద్ద ఒక్క దినం (Period) మీ లెక్క ప్రకారం వేయి సంవత్సరాలకు సమానమైనది” - 22:47

పై వాక్యం సందర్భం గమనిస్తే అవిశ్వాసులు “అల్లాహ్ తరఫు నుండి ఏ శిక్ష అవతరిస్తుందని నీవు చెబుతున్నావో అది ఇంకా రాలేదేమిటి? అని ప్రవక్త ముహమ్మద్ (స) వారిని అడిగినప్పుడు కచ్చితంగా శిక్ష అనేది వస్తుంది! అయితే అల్లాహ్ యొక్క ఒక దినం లేక “Period” అన్నది మీ లెక్క ప్రకారం వెయ్యి సంవత్సరాలకు సమానం అవుతుందని చెప్పటం జరుగుతుంది.

“నింగి నుండి నేల వరకు సమస్త వ్యవహారాలకు సంబంధించిన నిర్ణయాలు ఆయనే తీసుకుంటాడు. వాటి వివరాలు మీ లెక్క ప్రకారం వేయి సంవత్సరాలకు సమానమైన ఒక దినం (Period) లో ఆయన సన్నిధికి చేరుతాయి” - 32:5

పై వాక్యం సందర్భం గమనిస్తే- నింగి నుండి నేల వరకు సమస్త వ్యవహారాలకు సంబంధించిన వివరాలు ఆయన సన్నిధికి చేరటానికి పట్టే సమయం (Period) మీ లెక్క ప్రకారం వెయ్యి సంవత్సరాలకు సమానం అవుతుందని చెప్పటం జరుగుతుంది.

పై రెండు వాక్యాల్లో కామన్ గా చెప్పబడుతున్న విషయం “మీ లెక్క ప్రకారం వేయి సంవత్సరాలకు సమానమైన ఒక దినం” అన్నది. ఈ రెండు వాక్యల్లో మానవులు తమ అంచనాలను అనుసరించి కాలాన్ని లెక్క కట్టే విషయాన్ని గురించి చెబుతున్నాడు. ఉదాహరణకు ఖురాన్లోనే మరోచోట ప్రపంచంలో గడిపి వచ్చే మనుషులు తాము  ఉన్న మొత్తం కాలాన్ని ఏ విధంగా లెక్క పెడుతున్నాడో గమనించండి.

“ఆ తరువాత దేవుడు వారిని “మీరు ప్రపంచంలో ఎంత కాలం ఉన్నారో చెప్పండి” అని అడుగుతాడు. దానికి వారు- “ఒక రోజో లేక ఒక పూటో మేమక్కడ ఉన్నాము. లెక్కించే వారిని అడగండి” అని అంటారు” – 23:112

ఈ విధంగా మనిషి భూలోకంలో 100 సంవత్సరాలు గడిపి వెళ్ళినా అక్కడ అతని లెక్క ప్రకారం అతను గడిపి వచ్చిన సమయం ఏదో ఓ రోజో, ఓ పూటలాగానో అనిపిస్తుందన్నమాట! అలాగే అల్లాహ్ కు చెందిన ఒక కాలం లేక దినం (Period) అన్నది మనుషుల లెక్క ప్రకారం 1000 సంవత్సరాల సుదీర్గ కాలంగా లెక్క కట్టబడుతుందన్న విషయాన్ని అల్లాహ్ ఖురాన్ లో తెలియజేస్తున్నాడు.
 
పరిశుద్ధాత్మ (జిబ్రీల్), మరియు దైవ దూతలు దేవుని సన్నిధికి చేరటానికి పట్టిన సమయం 50000 ల సంవత్సరాలు!

“పరిశుద్ధాత్మ (జిబ్రీల్), మరియు ఇతర దైవదూతలు ఆయన సన్నిధికి యాభై సంవత్సరాలకు సమానమైన ఒక సుదీర్గ దినంలో ఎక్కిపోతారు” 70:4

పై వాక్యం సందర్భం ముందు మనం గమనించిన రెండు వాక్యాల (22:47, 32:5) సందర్భాలకు పూర్తి భిన్నమైంది. ఈ వాక్యంలో “పరిశుద్ధాత్మ (జిబ్రీల్), మరియు దైవ దూతలు ఆయన సన్నిధికి చేరటానికి పట్టే “కాలం (Period)” 50,000 సంవత్సరాలని చెప్పటం జరుగుతుంది.

అంటే ఈ మూడు సందర్భాల్లో “దినం” (యోమ్ / Period) అనే పదం ఉపయోగించినప్పటికీ... ఆయా దినాల్లో లేక కాలాల్లో (Periods లో) ఉన్న సంవత్సరాల మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. కాబట్టి  “దినం” అంటే ఒక సుదీర్గమైన కాలం లేదా యుగం (Period) అన్న అర్థాన్ని తీసుకుంటే...

1. అల్లాహ్ ఏదైనా విషయాన్ని అమలు పరచటానికి పట్టే కాలం (Period), మరియు నింగి నుండి నేల వరకు సమస్త వ్యవహారాలకు సంబంధించిన వివరాలు ఆయన సన్నిధికి చేరటానికి పట్టే కాలం (Period) 1000 సంవత్సరాలు కలిగి ఉంటే... 

2. పరిశుద్ధాత్మ (జిబ్రీల్), మరియు దైవ దూతలు ఆయన సన్నిధికి చేరటానికి పట్టిన కాలం (Period) 50,000 సంవత్సరాలు అన్నమాట!

ఉదాహరణకు నాకు తెలిసిన ఇద్దరు స్నేహితుల్లో “A” అనే ఒకడు అమెరికాలో లాస్ ఏంజెల్స్ నుండి ఇండియాకు 13000 కిలోమీటర్లు 48 గంటలు ప్రయాణం చేసి నా దగ్గరకు వచ్చాడు. ఇంకో “B” అనే స్నేహితుడు ముంబాయ్ నుండి 1000 కిలోమీటర్లు 24 గంటలు ప్రయాణం చేసి నా దగ్గరకు వచ్చాడు అనుకుందాం. ఇప్పుడు A అనే స్నేహితుని ప్రయాణ “సమయం (Period)” 48 గంటలు, B అనే స్నేహితుని స్నేహితుని ప్రయాణ “సమయం (Period)” 24 గంటలు. ఈ రెండు సందర్భాల్లో వారి ప్రయాణ “కాలాన్ని (Period ను)” అరబ్బీలో “యోమ్” అని అనువదిస్తే అక్కడ “ఒక దినం” లేదా “కొంత సమయం” “Period” అన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఒకతని Time Period 48 గంటలు కలిగి ఉంటే మరొకని Time Period 24 గంటలు కలిగి ఉంది.     
   
ఇంకాస్త వివరంగా పరిశీలిస్తే శుక్రగ్రహం (Venus) పై 5,832 గంటలు ప్రమాణం కలిగిన సమయం (Period) ఒక రోజు అయితే, 24 గంటలు  ప్రమాణం కలిగిన సమయం (Period) భూమి పై ఒక రోజు అవుతుంది. ఇక్కడ శుక్రగ్రహానికీ, భూగ్రహానికీ “ఒక రోజు” అన్న పదం కామన్ గా వాడినప్పటికీ, ఆయా రోజుల కాలాల్లో (Periods లో) ఎంతో వ్యత్యాసం ఉంది. ఒక గ్రహానికి ఒక రోజు గడవటానికి పట్టే సమయం (పీరియడ్) 5832 గంటలు అయితే... మరో గ్రహానికి ఒక రోజు గడవటానికి కేవలం 24 గంటలు మాత్రమే పడుతుంది. ఇక్కడ వాటి వాటి కక్ష్యలు (Orbits), దూరాలను బట్టి, వాటి వేగాన్ని (Velocity) ని బట్టి వాటి రోజులకు సంబంధించిన కాలాల్లో (అనగా Periods లో) ఎన్నో వందల గంటల తేడాను మనం చూడగలం.

దీనిని మనం పరస్పరవిరుద్ధం, కాంట్రడిక్షన్ అనలేము కదా! శుక్ర గ్రహం (Venus) పై  గడిచే ఒక రోజు 5,832 గంటలు కలిగి ఉంటే... అదే బృహస్పతి (Jupiter) పై గడిచే ఒక రోజు కేవలం 10గంటలు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు నేను ఒకచోట శుక్ర గ్రహాన్ని (Venus) దృష్టిలో పెట్టుకుని 5,832 గంటలు ప్రమాణం కలిగిన ఒక కాలాన్ని (Period ను) ఒక రోజు అంటాను! అలాగే బృహస్పతి (Jupiter) ను దృష్టిలో పెట్టుకుని 10 గంటలు ప్రమాణం కలిగిన ఒక కాలాన్ని (Period ను)  ఒక రోజు అంటాను! దీన్ని కాంట్రడిక్షన్ అనాలా? లేక విశ్వంలో వేరు వేరు సమయాల్లో గడిచిన “సమయాల్లో లేక Periods” లో ఉన్న వ్యత్యాసం అనాలా? మీరే ఆలోచించండి.

అలాగే ఖురాన్ లో మూడు చోట్ల “ఒక దినం” అన్న పదం కామన్ గా వాడబడినప్పటికీ, “దినం” లేక “రోజు” (యోమ్/yome) అన్న పదానికి “ఒక కాలం లేదా యుగం (Period)” అన్న అర్థాన్ని తీసుకుంటే ఈ మూడు సందర్భాలలో ప్రస్తావించబడిన కాలాలు (Periods) కు చెందిన సంవత్సరాల మధ్య ఎంతో తేడా ఉంది. ఇవేమీ పట్టించుకోకుండా, జ్ఞానం లేకుండానే ఖురాన్ ను విమర్శించటం అజ్ఞానం అనుపించుకోదా? ఓ సారి ఆలోచించండి. 

0 Response to "అల్లాహ్ దృష్టిలో ఒక దినం 1000 సంవత్సరాలా? 50,000 సంవత్సరాలా? - Md Nooruddin"

మీ అభిప్రాయాలు,సలహాలు,సూచనలు,సందేహాలు పంపగలరు
అందరూ చదువుకొనుటకు వీలుగా తెలుగులోనే వ్రాయవలెను.

← Newer Post Older Post → Home
Subscribe to: Post Comments (Atom)

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక...
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే...
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క...
  • శుభవార్త: "సిలువ...బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ...
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ...
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే...
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద...
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • స్వలింగ సంపర్కం వ్యక్తిగత స్వేచ్చా?
    రచ్చబండ లో జరిగిన స్వలింగ సంపర్కం గూర్చి కొంతమంది మేధావుల అభిప్రాయాలు చదివి చాలా ఆశ్చర్యమేసింది. స్వలింగ సంపర్కాన్ని మేము సమర్ధించమంటూనే అద...
  • M.A.అభిలాష్ గారితో ముఖాముఖి: పరిశుద్ధ బైబిలు ప్రబోధనల ప్రకారం:యేసు సిలువపై మరణించ లేదు! -1 (పాప పరిహారానికి రక్తమొక్కటే ప్రత్యమ్నాయమా?)
    సర్వశక్తిగల దేవుని పేరుతో...  యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలువదు. -సామెతలు 21:30 గౌరవ నీయులైన పాఠక మిత్రులా...

Recent Comments

Blog Archive

  • ►  2021 (1)
    • ►  January (1)
  • ►  2020 (2)
    • ►  August (1)
    • ►  April (1)
  • ▼  2019 (14)
    • ►  December (2)
    • ►  October (2)
    • ►  June (3)
    • ▼  February (4)
      • భారత దేశ హిందు-ముస్లిం మత సామరస్యానికి, ఖురాన్ విధ...
      • ముస్లిం సమాజ నియామకం “అసలు లక్ష్యం” ఏమిటి? | What ...
      • అల్లాహ్ దృష్టిలో ఒక దినం 1000 సంవత్సరాలా? 50,000 స...
      • బైబిల్లో ఖురాన్ ప్రస్తావన - Qur'an Reference in th...
    • ►  January (3)
  • ►  2018 (14)
    • ►  December (2)
    • ►  November (1)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (1)
    • ►  May (2)
    • ►  April (2)
    • ►  March (2)
    • ►  February (2)
  • ►  2017 (37)
    • ►  December (2)
    • ►  November (3)
    • ►  October (4)
    • ►  September (6)
    • ►  August (8)
    • ►  July (5)
    • ►  June (5)
    • ►  March (2)
    • ►  January (2)
  • ►  2016 (63)
    • ►  December (3)
    • ►  November (1)
    • ►  October (10)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (5)
    • ►  May (6)
    • ►  March (1)
    • ►  February (17)
    • ►  January (18)
  • ►  2015 (123)
    • ►  December (12)
    • ►  November (4)
    • ►  October (8)
    • ►  September (13)
    • ►  August (7)
    • ►  July (12)
    • ►  June (7)
    • ►  May (18)
    • ►  April (6)
    • ►  March (8)
    • ►  February (14)
    • ►  January (14)
  • ►  2014 (105)
    • ►  December (13)
    • ►  November (13)
    • ►  October (11)
    • ►  September (38)
    • ►  August (11)
    • ►  July (18)
    • ►  June (1)
  • ►  2013 (9)
    • ►  November (2)
    • ►  October (7)

Followers

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం

FB Follow

Sakshyam Magazine

Supporters



Follow by Email

Copyright © Sakshyam Magazine | Designed by Jayati Creative