• Contact us
  • Privacy Policy
  • Disclaimer
  • About Us

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Rachabanda
  • About Us
  • Sitemap
  • More
    • Vedas
    • Bible
    • SL Wuss V2
    • SL Wuss V3
    • SL Super Fast

Recent Acticles

Home » ARTICLES » ప్రతీ మనిషి ''ఆలోచించాల్సిన'' విషయం!

ప్రతీ మనిషి ''ఆలోచించాల్సిన'' విషయం!

Posted by Sakshyam Magazine on Sunday, October 8, 2017
Label: ARTICLES

ఈ ఆధునిక యుగంలో మానవుడు అనేక పరిశోధనలు చేసి విజ్ఞాన, వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్దిని సాధించాడు. నాటి నుంచి నేటి వరకు ఎంతో మంది శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు జరిపి అనేక వస్తువులను, పరికరాలను కనుగొన్నారు. 

ఉదాహరణకు : టి.వి [T.V], బల్బు [Bulb], టెలిఫోన్ [telephone], సైకిల్ [cycle] మొ||వి.  ఇలా మనిషికి ఉపయోగపడే అనేక వస్తువులను, పరికరాలను కనుగొన్నారు. 

అయితే బల్బును కనుగొన్నది ఎవరని అడిగితే ''ధామస్ ఆల్వాఎడిసన్''అని, టెలిఫోన్ ను కనుగొన్నది “గ్రహంబెల్”అని, సైకిల్ ను కనుగొన్నది ''మాక్ మిలాన్''అని ఇలా మనిషికి ఉపయోగపడే అనేక వస్తువులను, పరికరాలను పలానా, పలానా శాస్త్రజ్ఞులు కనుగొన్నారని మనం చదువుకున్నాం, తెలుసుకున్నాం. అందుకే మనం ఆ శాస్త్రవేత్తలను ఎంతో విజ్ఞానవంతులనీ, గొప్పవారిని నేటికీ కొనియాడుతున్నాం.
  
సరే! ఇంతకీ మా ప్రశ్న ఏమిటంటే! మనిషికి ఉపయోగపడే అనేక వస్తువులను, పరికరాలను ఎంతో మంది శాస్త్రజ్ఞులు కనుగొన్నారని నేటికీ మానవుడు వారికి పాదాభివందనం చేసి, కృతజ్ఞులై ఉండటం గమనార్హం. మరి అలాంటప్పుడు ‘మనిషి కోసం ఉపయోగపడే ఈ సకలచరాచర సృష్టిని సృష్టించిన సృష్టికర్త[CREATOR]కు మానవుడు ఎంత కృతజ్ఞుడై ఉండాలి!?.  స్వయంగా ఈ సృష్టిలో ఉండే వాటిని మనిషి వెలికితీసి, తయారు చేస్తే, అతనేదో గొప్ప అద్భుతాన్ని సృష్టించాడని మనం పొగుడుతున్నాం. మరి ఈ యావత్ సృష్టిని తయారు చేసిన వాడిని మనం ఎంత పొగడాలి!? ఎంత కొనియాడాలి!?
  
ఎవరైనా ఏదైనా ఒక వస్తువును తయారుచేస్తే అది తయారు చేసింది ఎవరని మనం తెలుసుకోవడానికి ఎంత ప్రయత్నిస్తాం! ఎంత ఆసక్తి చూపుతాం! మరి అలాంటప్పుడు మనం ఎప్పుడైనా ఆలోచించామా!? ఈ భూమిని, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, మనకు ఉపయోగకరంగా ఎవరు తయారుచేసారని! మనం ఎప్పుడైనా తెలుసుకున్నామా!?  ఈ అఖండ విశ్వాన్ని మనకు ఉపయోగకరంగా సృష్టించింది ఎవరని!? మరి అదే విధంగా సమస్త జీవకోటి జీవించడానికి అనుకూలమైన ఈ భూమిపై నివసించేటటువంటి మానవులను, జంతువులను, పక్షులను, జలచరాలను, క్రిమికీటకాలను, క్షీరదాలను, సరీసృపాలను సమస్త చరచరాలను సృష్టించినటువంటి ''సృష్టికర్త'' [CREATOR]ఎవరని? 

 ఈ విషయాలను గురించి ‘మనం ఆలోచిస్తే’ మనకు 2ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. 

అవి 1] ఈ సమస్త విశ్వాన్ని సృష్టించింది ఎవరు? 
        2] ఈ సమస్త విశ్వాన్ని సృష్టించింది ఒక్కరా ? అనేకమందా!? 

మొదటి ప్రశ్న: 1] ఈ సమస్త విశ్వాన్ని సృష్టించింది ఎవరు ?
ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే! ముందు మనం అసలు ఈ సమస్త విశ్వానికి అనగా ఈ సకల చరాచర సృష్టికి కర్త ఉన్నాడా!? లేడా!? అన్న విషయాన్ని తెలుసుకోవాలి. ముందుగా మనం ఈ విషయాన్ని ''భౌతికశాస్త్రం'' [SCIENCE] పరిజ్ఞానoతో తెలుసుకుందాo! 

ఖగోళ శాస్త్రజ్ఞులు విశ్వం యొక్క పుట్టుక ఎలా జరిగిందో, మిక్కిలి సమ్మతమైన ఓ దృగ్విషయo ద్వారా వివరించారు. బాగా ప్రసిద్ది చెందిన ఆ దృగ్విషయమే ‘‘బిగ్ బేంగ్’’. దశాబ్దాలతరబడి ఖగోళభౌతిక శాస్త్రజ్ఞులు తెలుసుకున్న మరియు ప్రయోగాత్మకంగా సేకరించిన వివరాలు ఈ దృగ్వివిషయాన్ని సమర్ధిస్తున్నాయి. 'బిగ్ బేంగ్' సిద్దాంతం ప్రకారం మొత్తం తొలుత ఒకే ఒక పెద్ద పదార్ధం [మాస్] [ప్రైమరీ నెబ్యులా] గా ఉండేది. తరువాత ఓ పెద్ద విస్పోటనం [BIG BANG] జరిగి గెలాక్సీలు తయారుయ్యాయి. తరువాత ఇవి నక్షత్రాలుగాను, గ్రహాలుగాను, సూర్యుడు, చంద్రుడు మొ||విగా విభజించబడ్డాయి. అంటే మొదట ఇవి అన్నీ కలిసి ఉండేవి. సృష్టి యొక్క ఆరంభం సాటిలేనిది. ఏదో అనుకోకుండా విశ్వం ఏర్పడిందనడానికి అవకాశం 'సున్నా'. అంటే ఈ భారీ విస్ఫోటనానికి [BIG BANG] కారకుడు ఉన్నాడు అన్నది సుస్పష్టమవుతుంది.

శాస్త్రవేత్తల పితామహుడైనటువంటి 'ఆల్ బర్ట్ ఐన్ స్టీన్' ఏం చెప్పారంటే '' There is some power which is leading total universe''  అంటే ''ఒక అద్భుతమైన శక్తి ఈ సమస్త విశ్వాన్ని పరిపాలిస్తుంది'' అని చెప్పారు.
అదే విధంగా '' న్యూటన్ సిద్దాంతం ప్రకారం '' ఒక వస్తువు కదలాలంటే 'శక్తి' ప్రయోగింపబడాలి. ఈ సృష్టి యావత్తూ ఎప్పుడూ చలనం కలిగి ప్రయాణిస్తూ ఉంటుంది. అంటే ఈ సమస్త విశ్వాన్ని నడిపించే ''కర్త'' [CREATOR] ఉన్నాడని మనకు విశదమవుతుంది.

రెండవ ప్రశ్న :     2] ఈ సమస్త విశ్వాన్ని సృష్టించింది ఒక్కరా ? అనేకమందా!? 
ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ఒకసారి మనం ఈ విశ్వాన్ని గురించి తెలుసుకోవాలి!
ఈ విశ్వంలో దాదాపు 250 కోట్లకు పైగా పాలపుంతలు[MILCY WAYS] ఉన్నాయి. ఇవి గంటకు 60 లక్షల, 20వేల కీ.మీ. వేగంతో ఒక్కొక్క గేలాక్సీ ప్రయాణిస్తూ ఉంటుంది. ఈ విశ్వంలో ఉండే గెలాక్సీలు, మిల్కీవేలు, పాలపుంతలు ఎల్లప్పుడూ కదులుతూనే, ప్రయాణం చేస్తూనే ఉంటాయి. కానీ ఎప్పుడూ ఎక్కడా ఎటువంటి ప్రమాదం [ACCEDENT] జరగలేదు కారణం ఈ సమస్త విశ్వాన్ని నడిపించే 'కర్త' [CREATOR] “కేవలం ఒక్కడే'' [ONLY ONE] ఉన్నాడని మనకు విశదమవుతుంది. ఎందుకంటే!

ఉదాహరణకు: ఒక దేశానికి అధ్యక్షుడు[president] ఒక్కడే ఉంటాడు. ఇద్దరు ఉంటే దేశ వ్యవస్థ దెబ్బతింటుంది. అదేవిదంగా ఒక పాఠశాల[school]కు H.M ఒక్కరే ఉంటారు. ఇద్దరు H.M లు ఉంటే ఆ పాఠశాల[school] వ్యవస్థ క్రమశిక్షణ కూడా దెబ్బతింటుంది. ఈ విధంగా, నిరంతరాయంగా కదులుతున్న ఈ విశ్వానికి కర్తలు[CREATORS] అనేకమంది ఉంటే ఈ విశ్వవ్యవస్థ యొక్క క్రమశిక్షణ కూడా దెబ్బతిని ఎప్పుడో చిన్నాభిన్నమై ఉండేది. కానీ ఎప్పుడూ అలా జరగలేదంటే కారణం ఈ విశ్వవ్యవస్థను నడిపించే కర్త "ఒకే ఒక్కడు" [ONE and ONLY] ఉన్నాడు అని మనకు విశదమవుతుంది.

ఇప్పటి వరకు మనము ఈ విషయాన్ని భౌతిక శాస్త్రం  [SCIENCE] ప్రకారం తెలుసుకున్నాము. 

ఇప్పుడు మనం ఈ విషయాన్ని ఆధ్యాత్మిక శాస్త్రం[SCRIPTURAL SCIENCE] ప్రకారం తెలుసుకుందాం!   

మొదటి ప్రశ్న:-  1]   ఈ సమస్త విశ్వాన్ని సృష్టించింది ఎవరు?
భగవద్గీతా శాస్త్రం :-  లోక మహేశ్వరమ్           
సమస్త లోకములకు [దేవుడే] నియామకుడు -విభూతియోగ౦ :- 10: 3 

బైబిల్  శాస్త్రం  :-  ఆది యందు ''దేవుడు'' భూమ్యాకాశములను సృజించెను. - ఆదికాండం :- 1:1
      
ఖుర్ ఆన్ శాస్త్రం  :- ఆయన[దేవుడు],ఆకాశాలను నీవు చూడగలిగే స్తంభాలు లేకుండానే సృష్టించాడు, ఆయన[దేవుడు] భూమిలో పర్వతాలను అమర్చాడు. మీతో పాటు దొర్లిపోకుండా ఉండేందుకు. - లుక్మాన్ :- 31:10

పైన తెల్పిన ఆధ్యాత్మికశాస్త్రాల వాక్యాల ప్రకారం ఈ విశ్వ వ్యవస్థను 'దేవుడే' [GOD]సృష్టించాడని తెలుస్తుంది. 
  
రెండవ ప్రశ్న :-     2] ఈ సమస్త విశ్వాన్ని సృష్టించింది ఒక్కరా ? అనేకమందా!? 

వైదిక శాస్త్రాలు :
 ఏకం ఎవద్వితీయo                                                                          
ఆయన “ఒక్కడు”, ఆయన తప్ప “మరొకడు లేడు”  - ఛందోగ్యపనిషత్ :- 6:2:1

ఏకోహి రుద్రోణ ద్వితీయాయ తస్తు: య ఇమాo ల్లోక నీశత ఈశ నీభి: 
ఈ లోకాలన్నీ తన శక్తిచే రక్షించి, పాలిస్తూ ఉండే ఆ “దేవుడు నిజానికి ఒక్కడే”. రెండవ వానిగా చేయడానికి ఆయన ప్రక్కన “మరొకడు లేడు”.  

బైబిల్ శాస్త్రం :- 
“ఒక్కడే దేవుడు” తప్ప “వేరొక దేవుడు లేడనియు” ఎరుగుదుము. -1వ కొరంథీ :- 8:4

ఖుర్ ఆన్ శాస్త్రం  :- 
మీ “దేవుడు ఒక్కడే”. ఆ కరుణామయుడు, ఆ కృపాకరుడు తప్ప “మరొక దేవుడు లేడు”.   -అల్ బఖర :- 2:163

ఆ ఒక్క దేవుడు ఎవరు? 
ఆయన్ని సంస్కృతంలో పరబ్రహ్మ అనీ, హెబ్రూలో యెహోవా[యావే] అనీ, అరబిక్ లో అల్లాహ్ అనీ, తెలుగులో దేవుడని, సృష్టికర్తనీ, ఇంగ్లీషు లో GOD, CREATOR అనీ, హిందీలో  భగవాన్ అనీ పిలుస్తారు.

గమనిక;-  తెలుగులో నీరు అన్నా, ఇంగ్లీష్ లో వాటర్ అన్నా, హిందీలో పానీ అన్నా ''పదార్ధం ఒక్కటే ''. అలాగే భాషలు వేరైన ''మనందరి దేవుడు ఒక్కడే''. 
"ధన్యవాదములు"
G.ఆనంద్ : Cell :  9059415660
anandchinna321@gmail.com

1 Response to " ప్రతీ మనిషి ''ఆలోచించాల్సిన'' విషయం! "

  1. UnknownJanuary 3, 2018 at 12:55 PM

    మీ ఆధార్ కార్డు ని మీ మొబైల్ నెంబర్ తో లింక్ చేయండి ఎలా.
    ఒక్క కాల్ తో మే అధర్ వెరిఫికేషన్ పూర్తి అవ్తుంది https://youtu.be/wNCFZUXPr0U

    మీ మొబైల్ నెంబర్ తో మీ అదార్ కార్డు ని ఒక్క కాల్ ద్వార లింక్ చేయండి.
    #ఆధారకార్డ్
    #simverification
    #aadharcard

    ReplyDelete
    Replies
      Reply
Add comment
Load more...

మీ అభిప్రాయాలు,సలహాలు,సూచనలు,సందేహాలు పంపగలరు
అందరూ చదువుకొనుటకు వీలుగా తెలుగులోనే వ్రాయవలెను.

← Newer Post Older Post → Home
Subscribe to: Post Comments (Atom)

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక...
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే...
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క...
  • శుభవార్త: "సిలువ...బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ...
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ...
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే...
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద...
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • స్వలింగ సంపర్కం వ్యక్తిగత స్వేచ్చా?
    రచ్చబండ లో జరిగిన స్వలింగ సంపర్కం గూర్చి కొంతమంది మేధావుల అభిప్రాయాలు చదివి చాలా ఆశ్చర్యమేసింది. స్వలింగ సంపర్కాన్ని మేము సమర్ధించమంటూనే అద...
  • బైబిల్ ప్రకారం - పాపులైన క్రైస్తవులకు పాపక్షమాపణ లేదు : M.A.అభిలాష్

Recent Comments

Blog Archive

  • ►  2021 (1)
    • ►  January (1)
  • ►  2020 (2)
    • ►  August (1)
    • ►  April (1)
  • ►  2019 (14)
    • ►  December (2)
    • ►  October (2)
    • ►  June (3)
    • ►  February (4)
    • ►  January (3)
  • ►  2018 (14)
    • ►  December (2)
    • ►  November (1)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (1)
    • ►  May (2)
    • ►  April (2)
    • ►  March (2)
    • ►  February (2)
  • ▼  2017 (37)
    • ►  December (2)
    • ►  November (3)
    • ▼  October (4)
      • ప్రతీ మనిషి ''ఆలోచించాల్సిన'' విషయం!
      • I do not believe in the gods, just believe in God!...
      • పుస్తక పఠనం వలన ప్రయోజనాలు ఎన్నో!
      • అల్బర్ట్ ఐనిస్టీన్ దృష్టిలో "గీతా-బైబిల్-ఖురాన్"!
    • ►  September (6)
    • ►  August (8)
    • ►  July (5)
    • ►  June (5)
    • ►  March (2)
    • ►  January (2)
  • ►  2016 (63)
    • ►  December (3)
    • ►  November (1)
    • ►  October (10)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (5)
    • ►  May (6)
    • ►  March (1)
    • ►  February (17)
    • ►  January (18)
  • ►  2015 (123)
    • ►  December (12)
    • ►  November (4)
    • ►  October (8)
    • ►  September (13)
    • ►  August (7)
    • ►  July (12)
    • ►  June (7)
    • ►  May (18)
    • ►  April (6)
    • ►  March (8)
    • ►  February (14)
    • ►  January (14)
  • ►  2014 (105)
    • ►  December (13)
    • ►  November (13)
    • ►  October (11)
    • ►  September (38)
    • ►  August (11)
    • ►  July (18)
    • ►  June (1)
  • ►  2013 (9)
    • ►  November (2)
    • ►  October (7)

Followers

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం

FB Follow

Sakshyam Magazine

Supporters



Follow by Email

Copyright © Sakshyam Magazine | Designed by Jayati Creative