• Contact us
  • Privacy Policy
  • Disclaimer
  • About Us

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Rachabanda
  • About Us
  • Sitemap
  • More
    • Vedas
    • Bible
    • SL Wuss V2
    • SL Wuss V3
    • SL Super Fast

Recent Acticles

Home » Editorial » ముఖసుత్తి ఓ ద్విముఖ సుత్తి

ముఖసుత్తి ఓ ద్విముఖ సుత్తి

Posted by Sakshyam Magazine on Monday, February 19, 2018
Label: Editorial

ప్రపంచంలో స్వార్ధప్రియులు, స్వప్రయెజనాపరులు ఇతరుల్ని ఓడించి లొంగదీసుకోవడానికి అనేక రకాల ఆయుధల్ని కనిపెట్టారు. ఈనాడయితే తుపాకుల నుంచి అణుబాంబుల వరకు ఎన్నెన్నో ఆయుధాలు ఉనికిలోకి వచ్చాయి. అయితే ఇవన్నీ చాలా ఖరీదుతో కూడుకున్న ఆయుధాలు. అందరూ వీటిని కొనలేరు. అలాంటివాళ్ళ కోసం పైసా ఖర్చు లేని ఒక ఆయుధం ఉంది. దీన్ని ఉపయెగించి ఎంతటి గొప్పవాడ్నాయినా ఇట్టే లొంగదీసుకోవచ్చు.
పూర్వం రాజుల దర్బరుల్లో కొందరు భజన పరులు ఈ ఆయుధన్నే ప్రయెగిస్తూ అపార కానుకలు, ధనరానులు సంపాదించేవారట. ఈనాడు కూడా ముఖ్యంగా రాజకీయ రంగంలో ఇది ఎంతో ప్రభావవంతమయిన ఆయుధంగా చెలామణి అవుతోంది. ఇందిరా గాంధీలాంటి గోప్ప్ రాజకీయ  శక్తి స్వరూపిణ్ణే ఎమర్జెన్సీలో ఈ ఆయుధం అమాంతం అందలం నుంచి దించివేసింది. దాన్ని బట్టి ఈ ఆయుధం ఎంత పదునయినదో ఊహించవచ్చు.
అయితే వచ్చిన చిక్కేమిటంటే ఈ ఆయుధం ఒక్కోసారి బెడిసికొడ్తుంది. దాన్ని ఉపయెగించేవాణ్ణే అది పాతాళలోకానికి అనగద్రొక్కుతుంది. ఈ ఆయుధమే 'ముఖ సుత్తి ' సినిమా భాషలో దీన్ని ముద్దుగా 'సూత్తి' అంటారు. రాజకీయ భాషలోనయితే 'చెమ్చాగిరి' అంటారు.
ఎవరి ముందయినా ముఖ సుత్తి చేయదమంటే, రెండు ముఖాల సుత్తితో అతడ్ని ఎడా పెడా బాదడమే. కానీ ఈ పొగడ్తప్రశంసించేవాడ్ని అల్పున్నిచేస్తుంది. అతని ప్రవృత్తిలో ప్రశంసబీజాన్ని నటి అంతర్యాన్ని అణచివేస్తుంది. పొగడబడేవాడు కాస్త వివేచనపరుడయితే అతని దృష్టిలో ముఖసుత్తి చేసేవాడు అధముడయిపోతాడు.
పోతే పొగడబడే వ్యక్తి లో ఈ పొగడ్త అహంకారాన్ని, ఆత్మవంచనను జనింపజేస్తుంది. పొగడ్తలకు ఉబ్బిపోయి అతడు తన ఉనికి, సాయిలనే మరచిపోతాడు. చివరికి అసత్య ప్రశంసలకు సాయితంపొంగిపోయి, తనలో నిజంగానే ఆ గుణగణాలు, శక్తి సామర్ద్యాలు ఉన్నాయని భ్రమించి తననుతాను ఎంతో గొప్పవాడని తలచుకుంటూ విర్రవీగుతాడు. చివరికి ఈ 'చెమ్చాలు' అతడ్ని పొగిడి పొగిడి ''నా అంతటివాడు లోకంలోనే లేడు,'' ''నేను లేకపోతే కొంపలు మునిగిపోతాయి'' అనే స్థాయి దాకా చేర్చుతాయి, ఈ స్థాయినే కొందరు 'మునగ చెట్టు ఛీటరుకొమ్మ' అంటారు.
మునగ చెట్టు చిటారు కొమ్మెక్కితే కలిగే పర్యవసానమేమీటో చెప్పనవసరం లేదు. అయితే అప్పటిదాకా అతనిలో చోటు చేసుకున్న ఈ భావం కాస్తా అహంభావమయి, అతని ముందు ఎవరెలాంటి ప్రతిపాదన తెచ్చినా దానికి విలువలేకుండా చేస్తుంది. అంటే తనకు నచ్చితే తప్ప అతను ఎవరి ప్రతిపాదనకూ విలువ ఇవ్వడన్న మాట. ఆ విధంగా అతను ఎవరి మేధా సంపత్తి, అనుభవాల వల్ల ఎలాంటి ప్రయెజనం పొందలేకపోతాడు.
నిర్ణయాలు, చర్యల రీత్యా మన పెద్దలు మనుషుల్ని ముడురకలుగా విభజించారు. [1] బుద్ధి, వివేచన, చైతన్యం, అనుభవం కలిగి ఉండటంతో పాటు ఆలోచనాపరుల, అనుభవజ్ఞుల సలుహాలు సయితం కోరెవారు. [2] కొందరు ఎంతో విజ్ఞతవివేచనాలు కలిగివుంటారు కానీ, ఇతరుల సలహాలు మాత్రం కొరరు లేదా బుద్ధివివేచనాలు స్వయంగా తమకు లేకపోవడం వల్ల ఇతరుల సలహాలు తీసుకొని పనిచేసేవారు. [3] మూడవ కోవకు చెందినవారు ఇటు స్వయంగా తాము బుద్ధి, వివేచన, అనుభవాలు కలిగి ఉండరు: అటు ఇతరులెవర్ని సలహాలు అడగరు. మొదటి కోవకు చెందినవారు అందరికంటే ఎక్కువ సఫలీకృతులవుతారు. కాగా మూడవ రకానికి చెందిన వారు పర్యవసానం రీత్యా పనికిమాలినవరైపోతారు.
సాధారణంగా ఈ మూడవ కోవకు చెందినవారే ముఖస్థితి చేసే వారి బుట్టలో పడిపోయి నాశనాన్ని కొనితెచ్చుకుంటారు. ఈ వాస్తవాన్నే మన వ్రవక్త ముహమ్మద్ [సఅసం] ఇలా తెలిపారు :
''మీరు ఒకర్నొకరు పొగడుకోవడం, పరస్పరం మితిమీరీ ప్రశంసించుకోవడం మానివేయండి. ఎందుకంటే ఇదొక విధమయిన హత్యలాంటిది''
ఎలాగయితే కత్తిపోటుకు మనిషి హతమవుతాడో, అలాగే అధిక ప్రశంస వల్ల కూడా మనిషిలోని వాస్తవ మానవుడు నాశనమవుతాడు.
[ఒకసారి] దైవప్రవక్త [సఅసం] సమక్షంలో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ప్రశంసించాడు. అప్పుడాయన అయ్యో! నీవు ని సోదరుని మెడ నరికావు కదా'' అన్నారు [ఇలా ఆయన మూడు సార్లు అన్నారు] తరవాత ''మిలొ ఎవరయినా మరొకర్ని ప్రశంసించడం తప్పనిసరి అయితే, ఫలానా వ్యక్తి నా దృష్టిలో ఇలాంటివాడు, [వాస్తవం ఏమిటో] అల్లాహ్ కే తెలుసు అని పలకాలి. అయితే అతను ఆ పొగడబడే వ్యక్తి గురించి నిజంగా ఆ విధంగా భావిస్తేనే అలా అనాలి. ఇంతకు అల్లాహ్ కు అభిముఖంగా ఎవరిని పొగడరాదు.''
ముఖసుత్తి చేయడం కొన్ని సందర్భాల్లో తప్పుకాదు. పైగా అది అవసరం కూడా. ఉదాహరణకు ఎవరయినా మంచి పని చేస్తుంటే, అతనిలో దైర్యం కలిగించి ఆ పనికై మరింత ప్రేరేపించేందుకు అతడ్ని పొగడటం. పిల్లల్లోని శక్తిసామర్ధ్యాలను వెలికి తీయడానికి, వాటిని పెంపొందించడనికి శెబాష్ అని పలకడం వగైరా. ఒక్కోసారి మనిషికి తాను చేస్తున్న పని సరయినదా కాదా లేక సవ్యంగా చేస్తున్నానా లెనా అనే అనుమానం వస్తుంది. ప్రత్యేకంగా ఏదైనా కొత్త పని ప్రారంభించినప్పుడు ఇలాంటి అనుమానాలు అతడ్ని పట్టిపీడిస్తుంటాయి. అలాంటి పరిస్థితిలో అతను చేస్తున్నది మంచి పనేనని, సక్రమంగానే చేస్తున్నావని చెబుతూ అతనిలో దైర్యం, ఉత్సాహం కలిజ్ఞ్చాలి. అంతేకాదు, అతని చిన్న చిన్న పొరపాట్లను విస్మరించి కూడా అతడ్ని ప్రశంసించడం ఎంతో అవసరం. ఆ విధంగా అతనిలో ఆత్మస్థయిర్వం, ఆత్మ విశ్వాసం జనించి అతని శక్తి సామర్ధ్యాలు పెంపొందుతాయి.
ఆత్మ స్థయిర్యాన్ని జనింపజేసే పొగడ్తలేవో, ఆత్మవినాశనికి దారితీసే పొగడ్తలేవో గ్రహించడం పెద్ద కష్టమేమీ కాదు. పొగదే వ్యక్తి పొగడబడుతున్న వ్యక్తి నుంచి ఏదైనా సహాయం ఆశిస్తుంటే అతను చేసే ప్రశంస దాదాపు ముఖస్ధుతి క్రిందికే వస్తుంది. అలాగే ప్రశంస వెనుక ఎలాంటి దురుద్దేశ్యం లేక పోయినా పొగిడే వ్యక్తి పలుకుల తీరు, పొగడబడే వ్యక్తి ఆనంద వ్యక్తీకరణ కూడా ప్రశంసను వక్రీకరిస్తాయి.
ఆత్మ స్థయిర్యాన్ని కలిగించే ప్రశంస ఏదో, ఆత్మ వినాశనికి ప్రేరేపించే ప్రశంస ఏదో తెలుసుకోవడానికి నేనిక్కడ ఓ ముతక సూచననిస్తున్నాను. ముఖాస్తుతి ఎల్లప్పుడు పిన్నలకే చేయాలి. వారికి ఆత్మ స్థయిర్యక కలిగించడం పెద్దలపని. ఈ పెద్దా, చిన్నా అనేవి వయస్సు, జ్ఞానం, అనుభవం, ఐశ్వర్యం, అధికారం, హుదా, అంతస్థులు వంటి విషయాలపై ఆధారపడివుంటాయి. ఈ విషయాల ఆధాక్యత రీత్యా ఒక మనిషి తన క్రింది స్థాయి వ్యక్తిని పొగిడితే సాధారణంగా అది ఆత్మస్థయిర్యం కోసమే అవుతుంది. అదే విధంగా ఈ విషయాల్లో ఏ ఒక్కదాని అధిక్యతరీత్యా అయినా సరే ఒక వ్యక్తి తన పై స్థాయి వ్యక్తి ని ప్రసంశిస్తే, అది ముఖాస్తుతి అవుతుంది.
ఇక్కడ నేను 'సాధారణంగా'  అనే పదాన్ని ఎందుకు వాడనంటే, కొన్ని సందర్భాల్లో పెద్దవాళ్లక్కూడా చిన్నవాళ్లతో పనిబడుతుంది. అందువల్ల వాళ్లు తాత్కాలికంగా చిన్నవాళ్లను పొగడుతారు. అంతమాత్రాన చిన్నవాళ్లు తాము నిజంగానే 'అలాంటి వాళ్లని భ్రమించి ఆత్మవంచనకు పాల్పడకూడదు. ఏమయినప్పటికి ముఖాస్తుతి అనేది కేవలం పెద్దవాళ్లనుంచి చిన్నవాళ్లకు లభించే ఓ విలువయిన కనుకని చెప్పవచ్చు. స్వయంగా మహానీయ ముహమ్మద్ [సఅసం] కూడా తన అనుచరుల ముందు వారిని పొగిడేవారు. దాంతో వారిలో ఆత్మస్థయిర్యం మరింత పెరిగి ఆయన చేయమన్న పనిని జీవితాంతం చేస్తుండడంలో, ఆయన వారించిన పని జోలికి మరెన్నటికిపోకుండా ఉండటంలో వారు అత్యంత స్ధిరంగా ఉండేవారు. కానీ ఈ రోజుల్లో పెద్దవల్లే చిన్నవాళ్ల నుంచి పొగడ్తలను ఆశిస్తున్నారు. ఆత్మ స్థయిర్యం పెంపొందించే ప్రశంసలకు బదులుగా ముఖాస్తుతులకే ప్రాధాన్యతనివ్వడం జరుగుతుంది. తాత్పలితంగా పెద్దవాళ్లు చిన్నవాళ్ల హృదయాల్లో తమ గౌరవమర్యాదలను ఇనుమడింపజేసుకోలేకపోతున్నారు. ఇటు చిన్నవాళ్లు పెద్దవాళ్ల నుంచి తాము ఆశించిన ప్రయోజనాలను పొందలేకపోతున్నారు.

3 Responses to "ముఖసుత్తి ఓ ద్విముఖ సుత్తి"

  1. hari.S.babuMarch 24, 2017 at 2:38 PM

    ఉతుకుడు మొదలై చాలాకాలం అయ్యింది.మీ వైపు నుంచి జవాబులు రావటం లేదు - ఏంటి విషయం?మరోసారి మర్యాదగా అడుగుతున్నాను వాటికి జవాబుకు చెప్పి మీ సత్తా చూపించి గెలుస్తారా?ఇంకెప్పుదూ హిందూమత గురించి అబద్ధాలు చెప్పకుండా బుద్ధిగా ఉంటారా?

    ReplyDelete
    Replies
    1. UnknownApril 3, 2017 at 8:37 AM

      హరిబాబుగారూ! మీకు కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువయ్యింది.మీ ప్రశ్నలకు ఎన్నో సమాధానాలు ఈ "సాక్ష్యం మేగజైన్"లోనే ఉన్నాయి.ఇకపోతే ప్రతి మతస్తులలోనూ ఎన్నో కల్పిత సిద్ధాంతాలు,మూఢ విశ్వాసాలు ఉన్నాయి. వాటిని పట్టుకుని అసలు ధర్మానికి,అసలు గ్రంధాలకు ఆపాదించాలని చూసే మీ బ్లాగు పోస్టులు బహు విడ్డూరంగా ఉన్నాయి. నిజానికి హిందూమతాన్ని అబద్ధాల పాలు చేయడం అనేది మీదగ్గరే ఉంది. కాస్త శాస్త్ర పరిశీలన చేయండి. పై,పై తప్పుడు సిద్దాంతాలన్నీ ఎగిరిపోయి అసలు ధర్మం కనిపిస్తుంది.

      Delete
      Replies
        Reply
    2. Reply
  2. ZilebiApril 3, 2017 at 9:21 AM



    హరిబాబు నీవు మారుట
    జర మంచిది యనెనుగాద ! సాక్ష్యం బిడ్డా,
    పరమత శోధన యేలర
    పరధర్మంబు విడుమోయి పద్ధతి కాదోయ్ !

    జిలేబి

    ReplyDelete
    Replies
      Reply
Add comment
Load more...

మీ అభిప్రాయాలు,సలహాలు,సూచనలు,సందేహాలు పంపగలరు
అందరూ చదువుకొనుటకు వీలుగా తెలుగులోనే వ్రాయవలెను.

← Newer Post Older Post → Home
Subscribe to: Post Comments (Atom)

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక...
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే...
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క...
  • శుభవార్త: "సిలువ...బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ...
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ...
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే...
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద...
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • స్వలింగ సంపర్కం వ్యక్తిగత స్వేచ్చా?
    రచ్చబండ లో జరిగిన స్వలింగ సంపర్కం గూర్చి కొంతమంది మేధావుల అభిప్రాయాలు చదివి చాలా ఆశ్చర్యమేసింది. స్వలింగ సంపర్కాన్ని మేము సమర్ధించమంటూనే అద...
  • M.A.అభిలాష్ గారితో ముఖాముఖి: పరిశుద్ధ బైబిలు ప్రబోధనల ప్రకారం:యేసు సిలువపై మరణించ లేదు! -1 (పాప పరిహారానికి రక్తమొక్కటే ప్రత్యమ్నాయమా?)
    సర్వశక్తిగల దేవుని పేరుతో...  యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలువదు. -సామెతలు 21:30 గౌరవ నీయులైన పాఠక మిత్రులా...

Recent Comments

Blog Archive

  • ►  2020 (3)
    • ►  August (1)
    • ►  June (1)
    • ►  April (1)
  • ►  2019 (14)
    • ►  December (2)
    • ►  October (2)
    • ►  June (3)
    • ►  February (4)
    • ►  January (3)
  • ▼  2018 (14)
    • ►  December (2)
    • ►  November (1)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (1)
    • ►  May (2)
    • ►  April (2)
    • ►  March (2)
    • ▼  February (2)
      • ముఖసుత్తి ఓ ద్విముఖ సుత్తి
      • ఇస్లాం మరియు జాత్యాభిమానం : M.A.అభిలాష్
  • ►  2017 (37)
    • ►  December (2)
    • ►  November (3)
    • ►  October (4)
    • ►  September (6)
    • ►  August (8)
    • ►  July (5)
    • ►  June (5)
    • ►  March (2)
    • ►  January (2)
  • ►  2016 (63)
    • ►  December (3)
    • ►  November (1)
    • ►  October (10)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (5)
    • ►  May (6)
    • ►  March (1)
    • ►  February (17)
    • ►  January (18)
  • ►  2015 (123)
    • ►  December (12)
    • ►  November (4)
    • ►  October (8)
    • ►  September (13)
    • ►  August (7)
    • ►  July (12)
    • ►  June (7)
    • ►  May (18)
    • ►  April (6)
    • ►  March (8)
    • ►  February (14)
    • ►  January (14)
  • ►  2014 (105)
    • ►  December (13)
    • ►  November (13)
    • ►  October (11)
    • ►  September (38)
    • ►  August (11)
    • ►  July (18)
    • ►  June (1)
  • ►  2013 (9)
    • ►  November (2)
    • ►  October (7)

Followers

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం

FB Follow

Sakshyam Magazine

Supporters



Follow by Email

Copyright © Sakshyam Magazine | Designed by Jayati Creative