• Contact us
  • Privacy Policy
  • Disclaimer

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Rachabanda
  • Sitemap
  • More
    • Vedas
    • Bible
    • SL Wuss V2
    • SL Wuss V3
    • SL Super Fast

Recent Acticles

Home » ARTICLES » గీతా శాస్త్రం ప్రకారం శ్రీకృష్ణులవారు దేవుడా?

గీతా శాస్త్రం ప్రకారం శ్రీకృష్ణులవారు దేవుడా?

Posted by Sakshyam Magazine on Wednesday, July 8, 2015
Label: ARTICLES

భగవద్గీతను చదివే అత్యధిక పండితులు శ్రీకృష్ణుడు దేవుడనే అభిప్రాయానికి వచ్చారు.అయితే శ్రీకృష్ణుడు దానికి భిన్నంగా మరొక అస్తిత్వాన్ని ప్రార్ధించమని సెలవిస్తున్నారు. గీతలో ప్రత్యక్ష, పరోక్ష శ్లోకాలుంటాయి.అవన్నీ భగవంతుణ్ణి తెలుసుకోవడానికే సహకరిస్తాయి తప్ప గీతను బోధించిన శ్రీకృష్ణపరమాత్మను దేవుణ్ణి చేయడానికి ఎంతమాత్రము కాదు.ఆ శ్లోకాలు ఎవరిని ఉద్దేశించి చెప్పబడినవని గమనించాలి.
       ఉదాహరణకు ఈక్రింది శ్లోకాన్ని గమనించండి.

       తమేవ శరణం గచ్ఛ! సర్వభావేన భారత
       తత్ ప్రసాదాత్పారామ్ శాంతిం స్థానం ప్రాప్యసి శాశ్వతమ్  18:62
       ఓ అర్జునా సర్వ విధముల అతనినే శరణు బొందుము.అతని అనుగ్రహముచే సర్వోత్తమగు శాంతి, శాశ్వతమగు స్థానమును నీవు పొందగలవు.
  శ్రీకృష్ణులవారు "అతనినే" అంటూ తనకతీతమైన అస్తిత్వాన్ని ఆయన చూపిస్తూ శరణు బొందమని చెబుతున్నారు. ఇంకా అతని అనుగ్రహమంటూ పేర్కొన్నారు.
  శ్రీకృష్ణులవారు దేవుడైతే మరొక అస్తిత్వాన్ని ఎందుకు శరణుబొందమన్నట్టు? కాస్త ఆలోచించాలి కదా?
       మరొక శ్లోకం తీసుకుందాం!
       అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యన్తే మామబుద్ధయ:
       పరమ్ భావమజానంతో మమావ్యయమనుత్తమమ్ 7:24
       నాశరహితమైనట్టియు, సర్వోత్తమైనట్టియు ప్రకృతికి పరమై విలసిల్లినట్టియు నా స్వరూపము తెలియని అవివేకులు నన్ను పాంచభౌతిక దేహమును పొందినవానినిగా తలంచుచున్నారు.
       భగవంతుడు పాంచభౌతికదేహం పొందలేదని గీత చెబుతుంది. ఇక్కడ సందేహం రావచ్చు. "నన్ను" అన్నాడు కాబట్టి శ్రీకృష్ణుడని కొంతమందివాదన. ఒకవేళ శ్రీకృష్ణులవారే దేవుడనుకుంటే ఆయన పాంచభౌతిక దేహమును పొందలేదా? అని అడిగితే సమాధానం లేదు. ముఖ్యమైన విషయమేమిటంటే పై రెండు శ్లోకాలు కూడా భగవంతుణ్ణి ఉద్దేశించినవే. ప్రత్యక్ష,పరోక్ష శ్లోకాలుగా గుర్తిస్తేనే విషయ అవగాహన అవుతుంది.కాబట్టి ప్రియులారా శ్రీకృష్ణులవారు యోగాన్ని బోధించే మహానుభావుడే గాని సృష్టికర్త ఎంతమాత్రం కాదు.

11 Responses to "గీతా శాస్త్రం ప్రకారం శ్రీకృష్ణులవారు దేవుడా?"

  1. శ్యామలీయంJuly 8, 2015 at 5:39 PM

    మీ యీ సర్వజ్ఞత్వభావనాజనితగర్వోక్తులు అనిదంపూర్వం కావు.

    ReplyDelete
    Replies
    1. K. AravindJuly 8, 2015 at 7:03 PM

      శాస్త్ర అవగాహన లేదని చేతులెత్తేసిన మీరు వాళ్ళను గర్విష్ఠులని అనడం మీ ఉక్రోశానికి నిదర్శనం కాదంటారా? ఈమధ్యే ఈ బ్లాగు ప్రపంచంలోకి అడుగుపెట్టాను. మీరు ఏదైనా చర్చ రసపట్టులో ఉన్నప్పుడు తికమక పెట్టి జారిపోవడమో, లేక కోపగించి పారిపోవడమో చేస్తారని శ్రీకాంత్ చారి,పల్లా,ఇంకా హరిబాబు అనుకుంటా వారి కామెంట్లలో పేర్కొంటే మీ గురించి తెలిసింది. ఈ విషయాలలో శుక్రాచార్య గారిని అభినందిస్తాను.ఆయన చక్కగానే ఈవిషయాల పట్ల పోరాడుతున్నాడు. మీరు కూడా చక్కగా పై విషయాలలో చర్చకు దిగితే మాబోటివాళ్లకు కొత్త విషయాలు తెలుస్తాయి.అంతేగాని గర్విష్ఠులు, అహంకారులు అని పేర్కొవడం మీకు సంస్కారం కాదని మనవి.

      Delete
      Replies
        Reply
    2. K.S. ChowdaryJuly 8, 2015 at 7:20 PM

      అరవింద్ గారికి నమష్కారములు.
      ఆర్యా! శ్యామలీయం మాష్టారుగారు చాలా మంచి మనిషి. ఆయన ఆపదజాలాన్ని ఉపయోగించినప్పటికీ మా కృషిని ఇంకా గట్టిగా అందించడానికి ఆయన అందించే ప్రోత్సాహంగానే భావిస్తాము.అంతకు మించి మీలా ప్రవర్తించలేము కూడా! ఎందుకంటే శాస్త్రపరంగా ఆయన పాల్గొన్నప్పుడు,చర్చించినప్పుడు మనం ఆయనతో చర్చించినా ఉపయోగం ఉంటుంది.కానీ ఆయన వెనుకే ఉండిపోతారు. ఏవేవో నాకు సరిగా (నాలాంటి సామాన్యులకు) అర్ధం కానీ కామెంట్లు పెడతారు.ఏది,ఏమైనా ఆయనను గౌరవించుకుందాం!!

      Delete
      Replies
        Reply
    3. Reply
  2. గోపాల్ శర్మJuly 8, 2015 at 6:36 PM

    గీతలో అన్ని యోగములగూర్చి చక్కగా పేర్కొనబడియున్నవి.అందులలో భగవంతుణ్ణి గురించియు గూడను పేర్కొనబడియున్నది.మీరు ప్రత్యక్ష,పరోక్ష విషయములపై చక్కని శ్లోకములతో మంచి విషయాన్నే స్పష్టపరిచిరి. మరొక ప్రధాన విషయము గమనింపగలరు. శ్రీకృష్ణులవారు యోగీశ్వరుడును,భగవంతుడు పరమేశ్వరుడుగను భగవద్గీత పేర్కొంది.ఇంకనూ అనేక విషయములతో నిండియున్న గీతను మరింతగా అందించితే అందరికినూ ప్రయోజనకరమే గదా!

    ReplyDelete
    Replies
    1. K.S. ChowdaryJuly 8, 2015 at 7:38 PM

      గోపాల శర్మ గారికి నమష్కారములు.
      ఆర్యా! తప్పకుండా భగవద్గీతనుండి మరిన్ని విషయాలు పేర్కొనే ప్రయత్నం చేస్తాను.కృతజ్ఞతలు.

      Delete
      Replies
        Reply
    2. Reply
  3. AnonymousJuly 8, 2015 at 6:48 PM

    మీకు ర్యాండముగా కొన్ని సూక్తులు తీసుకుని వాటిని వక్రీకరించడం తప్ప మరేమీ తెలియదనుకుంటా. పదకొండావ చాప్టరు మొత్తం చదవండి. మీకే తెలుస్తుంది ఎవరు దేవుడో ..!
    http://www.vedabase.com/en/bg/11

    మీరు ఎవరైతే నిరాకారుడు దేవుడు అని భావిస్తున్నారో, ఆ నిరాకార దేవుల్లందరికీ మూలం కృష్ణుడే అని ఈ శ్లోకం చెబుతోంది.

    brahmaṇo hi pratiṣṭhāham
    amṛtasyāvyayasya ca
    śāśvatasya ca dharmasya
    sukhasyaikāntikasya ca

    Translation: And I am the basis of the impersonal Brahman, which is immortal, imperishable and eternal and is the constitutional position of ultimate happiness.

    http://www.vedabase.com/en/bg/14/27

    కాబట్టి, అర్థ ఙ్ఞానముతో మీరు కృష్ణుడు దేవుడు కాదన్నా పండితులు నవ్వుకొని వెల్లిపోతారే తప్ప సీరియసుగా తీసుకోరు. ఎందుకంటే.. అంతా అక్కడ రాసి ఉంది. ఏదో ఒక సైటు మీ చేతిలో ఉంది కదా అని.. వక్రీకరించి రాస్తే నవ్వుల పాలయ్యేది మీరే.

    ReplyDelete
    Replies
    1. K.S. ChowdaryJuly 8, 2015 at 7:33 PM

      శుక్రాచార్యగారికి నమష్కారములు.
      ఆర్యా! మీరు సెలవిచ్చిన 11అధ్యాయమైనా,మిగతా అధ్యాయాలైనా మొత్తానికి దేవుడెవరంటే ఆ అక్షరపరబ్రహ్మ మాత్రమే.మరిన్ని విషయాలు గీతనుండే తపాలా రూపంలో పేర్కొంటానని మనవి.ఇకపోతే భాగవద్గీతకు వ్యతిరేక సిద్ధాంతాలను కల్పించుకున్నవారు నవ్వులపాలవుతారు తప్ప శాస్త్రాధారమైన వాదన వినిపించేవారు కారు.

      Delete
      Replies
        Reply
    2. Reply
  4. AnonymousJuly 8, 2015 at 8:03 PM

    దీన్ని బట్టి అర్థమైంది ఏమిటంటే, మీరు 11వ చాప్టరు చదవలేదు. కనీసం నేను 14 వ చాప్టరు నుండి ఇచ్చిన శ్లోకం కూడా చదవలేదు. ఒకవేల చదివినా ఒప్పుకోవడానికి మీ మనసు సిద్దంగా లేదు.అంతే.

    ReplyDelete
    Replies
    1. K.S. ChowdaryJuly 8, 2015 at 8:19 PM

      చదవలేదని వెంటనే నిర్ణయానికి వచ్చేస్తే ఎలా సర్? మరిన్ని విషయాలు గీత నుండి టపాల రూపంలో పేర్కొంటానని తెలిపాను గదా! గమనించండి. శాస్త్రబద్ధమైన విషయాలు ఒప్పుకోవడానికి నా మనస్సు ఎప్పుడూ సిద్ధమే! మీరైనా,నేనైనా,ఎవరైనా సిద్ధపడాలి కూడా!!

      Delete
      Replies
        Reply
    2. Haribabu SuraneniiOctober 20, 2016 at 12:01 PM

      గీతలో "అహం వైశ్వానరో..." అని ఎవరు ఎవరి గురించి చెప్పినట్టు?అది వ్యాసప్రోక్తం అయినా సరే చెప్పిన వ్యక్తి "నేను వైశ్వానరుణ్ణి.." అని చెప్పుకుంటుంటున్నది తన గురించియా? మీ గురించియా?లేక నా గురించియా?

      దేవుడే నేను చేప్పేది విను అంటుంటే ఇంకా ఎకక్డో ఉన్నవాడి గురించి చెప్తున్నాడు అంటారేంటి?శిల్పాగమ శాస్తర్మ్ అనేదాన్ని కూదా శిల్ప ఆగమన శాస్త్రం అని అంటున్న మీకు వీటిని అర్ధం చేసుకోగలనన్న అహంకారం దేనికి?మీరు ముస్లిం అని తెలిసు!మీ మతం గురించి "మా మతంలో ఈ మంచి ఉంది" అని చెప్పి పాజిటివ్ ప్రచారం చేసుకోకుండా హిందూమతంలో విగ్రహారాధన లేదు/హిందూమతలో కూదా ఇస్లాం మతం ఉంది అని నిరూపించాలన్న నెగిటివ్ ప్రాచారపు దురద ఎందుకు?

      Delete
      Replies
        Reply
    3. Haribabu SuraneniiOctober 20, 2016 at 12:05 PM

      @authgor:భగవంతుడు పాంచభౌతికదేహం పొందలేదని గీత చెబుతుంది. ఇక్కడ సందేహం రావచ్చు. "నన్ను" అన్నాడు కాబట్టి శ్రీకృష్ణుడని కొంతమందివాదన. ఒకవేళ శ్రీకృష్ణులవారే దేవుడనుకుంటే ఆయన పాంచభౌతిక దేహమును పొందలేదా? అని అడిగితే సమాధానం లేదు.

      haribabu:నీకు తెలియనిదల్లా లేనిదేనా?నీ విశ్లేషణకి అది పొసగదు,అంతే!దానిని కాదనగలిగిన పాండిత్యం నెకు లేదు - అది నిజం!

      Delete
      Replies
        Reply
    4. Reply
Add comment
Load more...

మీ అభిప్రాయాలు,సలహాలు,సూచనలు,సందేహాలు పంపగలరు
అందరూ చదువుకొనుటకు వీలుగా తెలుగులోనే వ్రాయవలెను.

← Newer Post Older Post → Home
Subscribe to: Post Comments (Atom)

POPULAR POSTS

  • ప్రతీ మనిషి ''ఆలోచించాల్సిన'' విషయం!
    ఈ ఆధునిక యుగంలో మానవుడు అనేక పరిశోధనలు చేసి విజ్ఞాన, వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్దిని సాధించాడు. నాటి నుంచి నేటి వరకు ఎం...
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే...
  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక...
  • రామాయణం మహా కల్పితమా? - రమణానంద మహర్షి
  • NRC ముస్లిం పెద్దల స్వయం కృతాపరాథం!
     -42:30وَ مَاۤ اَصَابَکُمۡ مِّنۡ مُّصِیۡبَۃٍ فَبِمَا کَسَبَتۡ اَیۡدِیۡکُمۡ وَ یَعۡفُوۡا عَنۡ کَثِیۡرٍ ﴿۳۰﴾ మీపై ఏ ఆపదలొచ్చిపడినా, అవి మీ...
  • ఇస్లాం మరియు వివాహ సంస్కృతి | Islam and Marriage Culture
    ఇస్లాం మరియు వివాహ సంస్కృతి |  Islam and Marriage Culture
  • అంటే హిందూ శాస్త్రాల ప్రకారం ఇక్కడ ప్రజలు పూజించేవి దైవాలు కావా!? - Md Nooruddin
    ఈ ప్రశ్నకు హిందూ శాస్తాలైతే “ఇక్కడ ప్రజలు పూజించే ఏవీ దైవాలు” కావనే అంటున్నాయి! ఇన్నాళ్లూ ఇక్కడ ఉన్నవాటిని దైవాలనో, దేవుని అవతారాలనో భావించ...
  • ముస్లిం సమాజ నియామకం “అసలు లక్ష్యం” ఏమిటి? | What is the "original goal" of Muslim community appointment? - Md Nooruddin
    సృష్టికర్త అయిన అల్లాహ్ యే మా దేవుడు, ముహమ్మద్ (స) మా ప్రవక్త అని నమ్ముతూ, నమాజ్, రోజాలను నిష్ఠగా పాటిస్తున్నప్పటికీ, ముస్లింగా జీవిస్తున్న...
  • రావణ లంక దొరికింది.. సీతను దాచిపెట్టిన లంక దొరికింది.
             1.ఆంజనేయుడు సంజీవినీ పర్వతాన్ని తీసుకువచ్చి లక్ష్మణుణ్ణి కాపాడిన లంక దొరికింది.. రామ రావణ యుద్ధం భీకరంగా జరిగిన లంక దొరికింది. ఇ...
  • పుస్తక పఠనం వలన ప్రయోజనాలు ఎన్నో!
    ఒ కప్పుడు యువకుల చేతుల్లో సాహిత్య,సామాజిక రంగాలకు సంబంధించిన పుస్తకాలు విరివిగా కనిపించేవి.చదివిన పుస్తకాల గురించి విలువైన చర్చలు జరిగేవి.క...

Recent Comments

Blog Archive

  • ►  2019 (14)
    • ►  December (2)
    • ►  October (2)
    • ►  June (3)
    • ►  February (4)
    • ►  January (3)
  • ►  2018 (14)
    • ►  December (2)
    • ►  November (1)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (1)
    • ►  May (2)
    • ►  April (2)
    • ►  March (2)
    • ►  February (2)
  • ►  2017 (37)
    • ►  December (2)
    • ►  November (3)
    • ►  October (4)
    • ►  September (6)
    • ►  August (8)
    • ►  July (5)
    • ►  June (5)
    • ►  March (2)
    • ►  January (2)
  • ►  2016 (63)
    • ►  December (3)
    • ►  November (1)
    • ►  October (10)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (5)
    • ►  May (6)
    • ►  March (1)
    • ►  February (17)
    • ►  January (18)
  • ▼  2015 (123)
    • ►  December (12)
    • ►  November (4)
    • ►  October (8)
    • ►  September (13)
    • ►  August (7)
    • ▼  July (12)
      • “విగ్రహారాధన” సత్యమని నిరూపించాలనుకునే వారి ఆశ చివ...
      • Is Jesus the incarnation of God? (యేసు దేవుని అవతా...
      • హిందూమతం పతనమవ్వడానికి కారణాలేమిటి? దానిని ఎలా పరి...
      • స్వలింగ సంపర్కం వ్యక్తిగత స్వేచ్చా?
      • యేసువారు తనను దేవుడని ప్రకటించుకున్నారా?
      • గీతా శాస్త్రం ప్రకారం శ్రీకృష్ణులవారు దేవుడా?
      • భగవద్గీతలో విగ్రహారాధనకు అనుమతి ఉందా?
      • అరవింద్ గారి ప్రశ్నలకు M.A.అభిలాష్ గారి జవాబులు!
      • నేటి ఇస్లామీయ రమజాన్ ఉపవాస వ్రతం,దాని నియమాలు ఒకనా...
      • రమజానుపై ముహమ్మద్ M.A.అభిలాష్ గారి పరిశోధాత్మక వ్య...
      • రమజానుపై ముహమ్మద్ M.A.అభిలాష్ గారి పరిశోధాత్మక వ్య...
      • రమజానుపై ముహమ్మద్ M.A.అభిలాష్ గారి పరిశోధాత్మక వ్య...
    • ►  June (7)
    • ►  May (18)
    • ►  April (6)
    • ►  March (8)
    • ►  February (14)
    • ►  January (14)
  • ►  2014 (105)
    • ►  December (13)
    • ►  November (13)
    • ►  October (11)
    • ►  September (38)
    • ►  August (11)
    • ►  July (18)
    • ►  June (1)
  • ►  2013 (9)
    • ►  November (2)
    • ►  October (7)

Followers

Labels

ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం

FB Follow

Sakshyam Magazine

Supporters



Follow by Email

Copyright © Sakshyam Magazine | Designed by Jayati Creative