• Contact us
  • Privacy Policy
  • Disclaimer
  • About Us

Sakshyam Magazine

  • Home
  • Articles
  • Books
  • Editorial
  • Rachabanda
  • About Us
  • Sitemap
  • More
    • Vedas
    • Bible
    • SL Wuss V2
    • SL Wuss V3
    • SL Super Fast

Recent Acticles

Home » ARTICLES » శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.

శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.

Posted by Sakshyam Magazine on Monday, March 2, 2015
Label: ARTICLES

ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే స్థాపించలేదని, తరువాతికాలంలో ఇవ్వన్నీ ఉనికిలోకి వచ్చాయని చెబుతూనే శ్రీరాముడు స్వయంగా మహాదేవుడైన పరమేశ్వరుణ్ణి ప్రార్ధించేవాడనే విషయాన్ని ఎంతో గొప్పగా చాటి చెప్పాడు.మీరు ఒకసారి పరిశీలించండి.
ప్రశ్న: రామేశ్వరమును రామచంద్రుడు స్థాపించియున్నాడు.మూర్తిపూజ వేదవిరుద్ధమగునెడల రామచంద్రుడు మూర్తి నెందుకు స్థాపించును? రామాయణమున వాల్మీకి యేల వ్రాయును?
ఉత్తరము: రామచంద్రుని సమయమున నామందిరనామముకాని,లింగముగాని యేమియు లేకుండెను. దక్షిణదేశపు రాజు రామనామము గలవాడా మందిరమును నిర్మింపజేసి దానికి రామేశ్వరమని పేరు పెట్టి యుండుట నిజము కావచ్చును. రామచంద్రుడు సీతాదేవిని దీసికొని హనుమంతుడు మున్నగు వారితో లంకనుండి బయలుదేరి విమానము మీద గూర్చుండి యాకాశమార్గమున సయోధకు వెళ్లుచుండిరి. అప్పుడు సీతతో నిట్లనెను.
"ఆత్ర పూర్వం మహాదేవ: ప్రసాదమకరోద్ విభు:,సేతుబంధ ఇతి ఖ్యాతం" -రామా.లంకాకాండం.
 "ఓ సీతా! నీ వియోగమున వ్యాకులుడనై నేను దిరుగుచుండెడివాడ. ఇక్కడనే చాతుర్మాస్యము చేసితిని. పరమేశ్వరుని యుపాసనా-ధ్యానము చేయుచుంటిని. సర్వత్ర విభువు-వ్యాపకుడై దేవతలకు మహాదేవుడైన పరమేశ్వరుని యనుగ్రహమున మాకు గావలసిన సామాగ్రి యంతయు లభించినది.మరియు చూడుము ఈ సేతువును బంధించి లంకకు వచ్చి రావణుని వధించి నిన్ను దెచ్చుచున్నాము.
 ఇంతకు మించి వాల్మీకి రామాయణమున నేమియు వ్రాయలేదు.
ఆధారం: సత్యార్ధప్రకాశము-ఏకాదశ సముల్లాసము.
More Articles

17 Responses to "శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద."

  1. శ్యామలీయంMarch 2, 2015 at 2:55 PM

    వాల్మీకి రామాయణంలో లంకాకాండం ఎక్కడుంది?
    ?

    ReplyDelete
    Replies
    1. UnknownMarch 2, 2015 at 5:04 PM

      మీరు ఒకసారి సత్యార్ధ ప్రకాశం చూడండి సర్. అక్కడ వివరాలున్నాయి.

      Delete
      Replies
        Reply
    2. శ్యామలీయంMarch 2, 2015 at 8:45 PM

      రామకథకు మూలాధారం శ్రీమద్వాల్మీకి రామాయణం. అందులో రామకథను ఆరు కాండలుగా చెప్పటం‌ జరిగింది. రామకథకు ముగ్థులై ఆ తరువాతికాలం వారు అనేకమంది కవులు తమతమ గొంతులతో అదేకథను వినిపించారు.

      ఇప్పుడు మీరు నన్ను, వాల్మీకానికి బదులుగా ఈ‌ లంకాకాండం అనేదాని గురించి మరొక పుస్తకం చూడమంటున్నారు, అదీ‌ మీరే వాల్నీకంలో ఉంది అని ఉటంకించిన శ్లోకం గురించి! ఇది సబబు కాదు కదా?

      మీ టపా ప్రకారం చూస్తే:


      "ఆత్ర పూర్వం మహాదేవ: ప్రసాదమకరోద్ విభు:,సేతుబంధ ఇతి ఖ్యాతం" -రామా.లంకాకాండం.
      ..... ఇంతకు మించి వాల్మీకి రామాయణమున నేమియు వ్రాయలేదు.


      ఇప్పుడు చెప్పండి? మనం ఈ ఉటంకించబడిన 'లంకాకాండం' వాల్మీకంలో చూడాలా వేరే పుస్తకంలోనా? మీరు చెప్పిన శ్లోకం వాల్మీకంలోనిది అంటున్నారు. (నేనింకా దాని యథర్థత పరిశీలించలేదు) ఆ శ్లోకం‌ ఉన్నది లంకా కాండం అంటున్నారు. అప్పుడు మనం‌ ఈ లంకా కాండం వాల్మీకంలోనే ఉందని చెప్పారనే‌ అర్థంచేసుకోవాలి కదా. అందుకే నేను వాల్మీకి రామాయణంలో లంకాకాండం ఎక్కడుంది? అని ప్రశ్నించాను. వాల్మీకంలో అటువంటి లంకాకాండం అనేది లేదని తెలుసుకుందుకు ప్రత్త్యేకించి నేను మరో పుస్తకాన్ని ప్రమాణంగా తీసుకొని వెదుకవలసిన పనేముంది? లేదు కదా? ముంజేతి కంకణానికి అద్దమెందుకూ?

      Delete
      Replies
        Reply
    3. UnknownMarch 3, 2015 at 2:11 AM

      స్వామి దయానందుడు తన సత్యార్ధ ప్రకాశంలో ఉటంకించిన విషయాన్ని యధాతథంగా ఉంచాను. ఇక వాల్మీకి రామాయణంలో లంకా కాండం ఉందా లేదా అనే మీమాంశ కంటే ముందు పై శ్లోకం యొక్క పూర్తి అర్ధాన్ని మనమందరమూ పరిశీలించి వాస్తవం తెల్సుకోవల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. ఇంక రామా.లంకా.అనే పేరుతో పాటు తెలుగు సంఖ్యాపరమైన ఆధారం ఇచ్చారు. ఆ తెలుగు అంకెలను ఎలా టైప్ చేయాలో నాకు తెలియలేదు. మిమ్మల్ని సత్యార్ధ ప్రకాశం చూడమన్నది ఆ తెలుగు అంకెలు తెలుసుకుని రామాయణం లో ఆ శ్లోకాన్ని గుర్తుపట్టడానికి వీలు ఉంటుందని చెప్పానని గమనించగలరు. మరో ముఖ్య విషయమేమిటంటే రామాయణ, మహాభారతాలు ఇతిహాసాలు మాత్రమే. ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనకు అవి ప్రామాణికాలు కావు. ఆ స్థానం కేవలం వేదోపనిషత్తులు, భగవద్గీత శాస్త్రాలదే. ఇక విషయ సేకరణ కోసం మాత్రమే శ్రీరాముని ఉదంతం తీసుకోవడం జరిగిందని మనవి

      Delete
      Replies
        Reply
    4. శ్యామలీయంMarch 3, 2015 at 5:33 PM

      దయానందులు ఉటంకించినది వాల్మీకం గురించి కదా. సత్యార్థం ప్రకాశంతో పనిలేదిక్కడ. మీమాంస ఏమీ లేదు. వాల్మీకంలో లంకాకాండ అనేది లేదు. మీరు ఉటంకించిన శ్లోకం ఎక్కడుందో చూస్తాను వీలు వెంబడి. రామాయణభారతాల స్థాయి పైన మీరు తీర్పులు చెప్పేంతవారా? అటువంటి దుస్సాహసాలను నేను హర్షించలేను. క్షమించండి.

      Delete
      Replies
        Reply
    5. ZilebiMarch 4, 2015 at 6:44 AM

      శ్యామలీయం వారు,

      లంకా కాండం అప్పు తచ్చు అయ్యుంటుంది ! యుద్ధ కాండం అయ్యుండాలి ..

      एतत् कुक्षौ समुद्रस्य स्कन्धावारनिवेशनम् || ६-१२३-१९
      अत्र पूर्वं महादेवः प्रसादमकरोत्प्रभुः |

      See this island, located in the middle of the ocean, where my troops were stationed. At this place, the lord Shiva (the supreme deity) formerly bestowed his grace on me."

      http://www.valmikiramayan.net/utf8/yuddha/sarga123/yuddha_123_frame.htm

      చీర్స్
      జిలేబి

      Delete
      Replies
        Reply
    6. UnknownMarch 4, 2015 at 10:51 AM

      కృతజ్ఞతలు జిలేబిగారు. మంచి విషయాన్ని సమయానికి తెలియజేసారు.

      Delete
      Replies
        Reply
    7. UnknownMarch 4, 2015 at 11:00 AM

      నేను దుస్సహాసం ఏమీ చేయలేదు శ్యామలీయం సర్. ఉన్న విషయాన్నే తెలియజేసాను. రామాయణ,మహాభారతాలు ఇతిహాస గ్రంధాలు కాక మేరిమిటి సర్. అవేవీ ప్రామాణిక శాస్త్రాలు కాదు కదా? మనిషికి భక్తికి, ముక్తి ప్రామాణికాలు వేదశాస్త్రాలే కదా? ఇక పోతే ఈ ఇతిహాసాలు నీతిని నెరవడానికి లేక శ్రీరామ చంద్రుల, శ్రీకృష్ణుల ఆదర్శ జీవితాలు తెలుసుకోవడానికి ఉపయోగపడే వారి జీవిత చరిత్రలే కదా సర్? జీవన విధానం కలిగి యుండాల్సింది కేవలం శాస్త్ర పరిధిలోనే కదా? మీరు పెద్దవారు ప్రశ్నించేంతవాడిని కాదు.కృతజ్ఞతలతో...మీ చౌదరి.

      Delete
      Replies
        Reply
    8. శ్యామలీయంMarch 4, 2015 at 11:42 AM

      వేదః ప్రాచేతసా దాసీత్ సాక్షాద్రామాయణాత్మనా అన్న ప్రమాణం చేత రామాయణానికి వేదసమ్మితమైన ప్రతిపత్తి ఉన్నదిగా సంప్రదాయవచనం. అలాగే మహభారతం కూడా ఇతిహాసమేఐనా దానొకి పంచమవేదంగా సంప్రదాయప్రఖ్యాతి ఉన్నది. భగవదీతప్రమాణం అవుతూ దానిని అంతర్భూతంగా కలిగిన భారతం అప్రమాణం అనలేము కదా. ఐనా మీరన్నట్లుగా వీటిని శాస్త్రములు అని పిలవరు. సాహసం అన్నది ఎందుకంటే, ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనకు అవి ప్రామాణికాలు కావని సిధ్ధాంతీత్రించటం సమంజసం కాదు కాబట్టి. ఆధ్యాత్మికవిజ్ఞానం కొల్లగా భారతంలో ఉంది, అలాగే శ్రీమద్రామాయణంలో కూడా. అందుచేత తొందరపాటు మాటలు వద్దని నా మనవి. స్వస్తి.

      Delete
      Replies
        Reply
    9. UnknownMarch 4, 2015 at 1:06 PM

      గురుతుల్యులు,పండితవర్యులు శ్యామలీయం గారికి కృతజ్ఞతలతో...మీతో నేను ఏకీభవిస్తున్నాను. ఇక నా ఉద్దేశ్యం ఏమిటంటే సైద్ధాంతిక విషయాల నిర్ధారణకు ప్రామాణికం వేద శాస్త్రాలు,భగవద్గీత అయితే వాటి అన్వహింపుకు ఇతిహాస గ్రంధాలన్నదే నా వాదన.అంటే థీరిటికల్ గా వేదోపనిషత్తులు అయితే ప్రాక్టికల్ రూపంలో ఇతిహాసాలు వస్తాయి. సైద్ధాంతిక సత్యాసత్యాల నిర్ధారణకు మాత్రం వేద గ్రంధాలే ప్రధమ ప్రామాణికాలు. మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఒకటి సత్యము మరొకటి అసత్యం అనేది కాదు.ఒకటి ముందు మరొకటి తరువాత అన్నదే నా అభిప్రాయం. మీరు నా పట్ల స్పందిస్తున్న పదప్రయోగంలో చాలా ఉన్నతి ఉంది. చిన్నవాడిని నా పద ప్రయోగంలో అపశృతి దొరిలితే క్షమించి నా పదాల ఆంతర్యాన్ని అర్ధం చేసుకోవాలని మనవి.

      Delete
      Replies
        Reply
    10. hari.S.babuAugust 9, 2017 at 1:58 PM

      ప్రశ్న: రామేశ్వరమును రామచంద్రుడు స్థాపించియున్నాడు.మూర్తిపూజ వేదవిరుద్ధమగునెడల రామచంద్రుడు మూర్తి నెందుకు స్థాపించును? రామాయణమున వాల్మీకి యేల వ్రాయును?

      hari.S.,babu
      ఈ వ్యాసంలోని అసలైన రహస్యాన్ని ఒకటి ఎవరూ గమనించినటు లేదు!ఏ దయానాంద సరస్వతిని సాక్ష్యం వ్యాసాలలో పదే పదే విగ్రహారాధంకి వ్యతిరేకిగా తమకు సమర్ధనగా తెచ్చుకోవడం కోసం "దయానంద సరస్వతి ఇట్లా అన్నాడు,అట్లా అన్నాడు - ఇంత గట్టిగా మూర్తిపూజని వ్యతిరేకించాడు" అని ఉపయొర్గించుకుంటున్నారో ఆ దయానంద సరస్వతియే పై ప్రశ్న వేసి రామాయణ కాలానికే శివమూర్తికి పూజాదికాలు జరుగుతున్నాయని నిరూపించి సమర్ధిస్తున్నాడు,అవునా కాదా?రామాయణం రాసిన వాల్మీకి కూడా వైదిక సాహిత్యం విషయంలో సాక్ష్యం గ్రూప్ రచయితల కన్న అజ్ఞానియా?ఇకనైనా విగ్రహారాధనకి వ్యతిరేకంగా సాక్ష్యాల కోసం దయానంద సరస్వతిని ఉటంకించడం మానుతారా?మరొకచోట సాక్షాత్తూ లక్ష్మీనారాయణుల పంచలోహ విగ్రహాలకి ప్రభాత వేళ పూజ చెయ్యనిదే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టని ఒక విశిష్టాద్వైత ప్రచారకుడైన సన్యాసి చేత దొంగసాక్ష్యం చెప్పించారు - అది నేను బట్టబయలు చేస్తే నీళ్ళు నమిలారు.

      P.S:తప్పులెన్నువారు తమతప్పు లెరుగలేరు అన్నట్టు హిందూమతస్థుల్ని అఘ్ణాణం నుచి బయటపడెయ్యటానికి చేసే ప్రయత్నంలో తన ముడ్డినలుపు చూసుకోలేని గురివిందలా ప్రవర్తిస్తున్నారు వ్యాసకర్త.

      Delete
      Replies
        Reply
    11. UnknownAugust 10, 2017 at 12:03 PM

      పై వ్యాసం కాస్త నిశితంగా చదవండి హరిబాబు గారూ! "రామచంద్రుని సమయమున నామందిరనామముకాని,లింగముగాని యేమియు లేకుండెను." అని దయానందుడు చెప్పడంతో పాటు, శ్రీరాముడు స్వయంగా "ఆత్ర పూర్వం మహాదేవ: ప్రసాదమకరోద్ విభు:,సేతుబంధ ఇతి ఖ్యాతం" -రామా.లంకాకాండం.
      "ఓ సీతా! నీ వియోగమున వ్యాకులుడనై నేను దిరుగుచుండెడివాడ. ఇక్కడనే చాతుర్మాస్యము చేసితిని. పరమేశ్వరుని యుపాసనా-ధ్యానము చేయుచుంటిని. సర్వత్ర విభువు-వ్యాపకుడై దేవతలకు మహాదేవుడైన పరమేశ్వరుని యనుగ్రహమున మాకు గావలసిన సామాగ్రి యంతయు లభించినది.మరియు చూడుము ఈ సేతువును బంధించి లంకకు వచ్చి రావణుని వధించి నిన్ను దెచ్చుచున్నాము.అని ఆ మహా దేవుణ్ణి ఆరాధించినట్టు చెప్తున్నారు.

      Delete
      Replies
        Reply
    12. hari.S.babuAugust 11, 2017 at 9:15 AM

      "సర్వత్ర విభువు-వ్యాపకుడై దేవతలకు మహాదేవుడైన పరమేశ్వరుని యనుగ్రహమున మాకు గావలసిన సామాగ్రి యంతయు లభించినది." అనే వాక్యం దేనిని ఉద్దేశించినది మహాసయా!సామగ్రి మూర్తిపొజకు మాత్రమే అవసరం,అవునా కాదా?చాతుర్మస్యం అనేది నాలుగు నేల్ల పాటు ప్రతిరోజూ మూర్తిపూజను చహేసే కాలం - దానికి కావలసిన సామగ్రినే శ్రీరామూడు ప్రస్తావించాడు.దీనిని కూడా కాదంటే రాముడు అవేమీ చెయ్యలేదు ముస్లిములు చేసినట్టు మకక వైపుకి తిరిగి మోకాటి తండా వేర్సి అల్లాని మనసారా ప్రార్ధించాడు అని చెప్పాల్సి వస్తుంది,అంతేఅనా?

      P.S:అసలు ఆ ప్రశ్న వేసినది దయానంద సరస్వతియా వ్యాసకర్తయా?

      Delete
      Replies
        Reply
    13. UnknownAugust 11, 2017 at 11:05 AM

      నాలుగు నెలల పాటు ఉపాసనము-ధ్యానము చేస్తే రావణ సైన్యాన్ని ఎదురుకోవడానికి కావాల్సిన సామాగ్రి అంతా భగవంతుణ్ణి అనుగ్రహంతో లభించిందని అర్ధం తప్ప తనకోసం పూజించమని పండూ,టెంకాయ ప్రసాదించాడని కాదు. మీరు మీ సిద్ధాంతాలను బలవంతంగా నిలబెట్టడం కోసం పై దయానందుని వ్యాసాన్నే ఊహాజనిత అర్ధాలతో వక్రీకరిస్తున్నారు. ఒకసారి మీరు దయానందుని "సత్యార్ధ ప్రకాశం" చదవమని మనవి.

      Delete
      Replies
        Reply
    14. UnknownAugust 11, 2017 at 11:15 AM

      మరొక ముఖ్య విషయమేమిటంటే ఈ మహానీయులందరూ మక్కా వైపునకు తిరిగారా? మదీనా వైపునకు తిరిగారా? లేక జెరూసలేం వైపునకు తిరిగారా? తూర్పు వైపునకు తిరిగారా అన్నది ముఖ్యం కాదు. అసలు శ్రీరాముడు పైనున్న అసలైన భగవంతుణ్ణి ప్రార్ధించాడన్నదే ముఖ్యం. మీరు ఇది గుర్తించారో,లేదో లేక గుర్తించి కూడా మరుగున పడేలా వ్యవరిస్తున్నారో తెలీదుగాని చదూవరులను మాత్రం ప్రక్కకు మళ్ళించే ప్రయత్నం మాత్రం గట్టిగా చేస్తున్నారు. హరిబాబుగారు మీరు గమనించవలసింది ఏమిటంటే అన్ని దిక్కులా దేవుడు వ్యాపించియున్నాడు. ఏ దిక్కైనా దేవునిదే.. ఈ విషయం మీరు అతిగా విమర్శించే ఖురానే చెప్పింది.

      Delete
      Replies
        Reply
    15. hari.S.babuAugust 13, 2017 at 10:48 AM

      Sakshyam Group:
      మీరు మీ సిద్ధాంతాలను బలవంతంగా నిలబెట్టడం కోసం పై దయానందుని వ్యాసాన్నే ఊహాజనిత అర్ధాలతో వక్రీకరిస్తున్నారు.

      hari.S.babu
      }ప్రశ్న: రామేశ్వరమును రామచంద్రుడు స్థాపించియున్నాడు.మూర్తిపూజ వేదవిరుద్ధమగునెడల రామచంద్రుడు మూర్తి నెందుకు స్థాపించును? రామాయణమున వాల్మీకి యేల వ్రాయును?" -- ఈ ప్రశ్న వేసినది దయానంద సరస్వతియా లేక వ్యాసకరత్యా నేది మీరు స్పష్టం చేస్తే ఎవరు ఎవరి ఉద్దేశాల్ని బలవంతంగా ఇతరుల మీద రుద్దడానికి ప్రయత్నిస్తున్నారో తెలిసిపోతుంది.కాబట్టి మొదట దీనిని తేల్చండి!

      ఈ ప్రశ్నకి జవాబుగానే "ఓ సీతా! నీ వియోగమున వ్యాకులుడనై నేను దిరుగుచుండెడివాడ. ఇక్కడనే చాతుర్మాస్యము చేసితిని. పరమేశ్వరుని యుపాసనా-ధ్యానము చేయుచుంటిని. సర్వత్ర విభువు-వ్యాపకుడై దేవతలకు మహాదేవుడైన పరమేశ్వరుని యనుగ్రహమున మాకు గావలసిన సామాగ్రి యంతయు లభించినది.మరియు చూడుము ఈ సేతువును బంధించి లంకకు వచ్చి రావణుని వధించి నిన్ను దెచ్చుచున్నాము" అనే ప్రస్తావన దయాననద సరస్వతి చేశారు, అవునా కాదా?దీనిని కూడా స్పష్తం చెయ్యండి!

      "నాలుగు నెలల పాటు ఉపాసనము-ధ్యానము చేస్తే రావణ సైన్యాన్ని ఎదురుకోవడానికి కావాల్సిన సామాగ్రి అంతా భగవంతుణ్ణి అనుగ్రహంతో లభించిందని అర్ధం తప్ప తనకోసం పూజించమని పండూ,టెంకాయ ప్రసాదించాడని కాదు." - నేనిక్కడ మిమ్మల్ని అడుగుతున్నది రాముడి మూర్తిపూజ గురించి కాదు రాముడు చేసిన శివపూజ గురించి - దయానందుల వారి ప్రశ్న మరియు జవాబులను రాముడికి ఆనాడు మూర్తిపూజ లేదు అని చెప్పడానికి ఈ వ్యాసరచయిత చూపించిన తొందరలో అక్కడ రాముడు చేసిన శివపూజను ఉదహరించి దయానందుల వారు అప్పటికే మూర్తిపూజ వేదసమ్మతమై ఉన్నది అని సమర్ధించి చెప్పటాన్ని యెందుకు దాటవేస్తున్నారు?నేను పట్టిన వ్యాసంలోని అసలు తప్పు అదే!

      Delete
      Replies
        Reply
    16. Reply
  2. hari.S.babuAugust 14, 2017 at 8:48 AM

    Sakshyam GroupAugust 11, 2017 at 11:15 AM
    అసలు శ్రీరాముడు పైనున్న అసలైన భగవంతుణ్ణి ప్రార్ధించాడన్నదే ముఖ్యం. మీరు ఇది గుర్తించారో,లేదో లేక గుర్తించి కూడా మరుగున పడేలా వ్యవరిస్తున్నారో తెలీదుగాని చదూవరులను మాత్రం ప్రక్కకు మళ్ళించే ప్రయత్నం మాత్రం గట్టిగా చేస్తున్నారు.

    hari.S.babu:
    మాట్లాడిన ప్రతి మాటలోనొ "వ్యాసం మరోసారి చదవండి,వ్యాసం మరోసారి చదవండి" అని లంకించుకుంటున్నారు - మూడు పేరాల వ్యాసాన్ని అర్ధం చేసుకోవడానికి ఎంతసేపు పడుతుందండీ!ఈ వ్యాసానికి కూడా "మేము రాసిన ఈ వ్యాసాన్ని ఈ విధముగానే అర్ధము చేసుకొనవలెను,మరియొక విధముగా అర్ధము చేసుకొన్నచో మేము బాధ్యులము కాము" అని వ్యాఖ్యానాలూ,టిప్పణీలూ,విధి నిషేధాలూ ఏమైనా పెట్టి రాసే ఉద్దేశంలో ఉన్నారా!

    ఆ ప్రశ్న వేసి ఆ ప్రస్తావన చేసింది దయానందుడే అయితే అందులో ఆయన ఉద్దేశం రాముడు చేసిన శివలింగప్రతిష్ఠా,రాముడు చేసిన చాతుర్మాస్యపు మూర్తిపూజావ్రతమూ వేదసమ్మ్మతమైనవేనని నిరూపించడం కాదా?మరి,ఇదే వ్యక్తిని అన్ని వ్యాసాలలో ఈయన విగ్రహారాధాన్ని వ్యతిరేకించాడు అనటం ఇస్లామిక్ భావాల్ని హిందువుల మీద రుద్దటానికి హిందువునే వాడుకోవటం అవదా?

    P.S:దయచేసి ఈ నా పోష్టుని ఒకసారి ఓపిక చేసుకుని చదవండి.ఒక విదేశీ అమ్మాయి చాలామంది భారతీయ హిందువులకి కూడా తెలియని ఎన్నో విషయాల్ని తేలిక భాషలో చెప్పింది.నేనొక్ అగుణపాఠం నేర్చుకున్నాను.అది ఇంక మిమ్మల్ని మార్చే ప్రయత్నం చెయకూడదని!ఎందుకంటే "సనాతన ధర్మం భేదాభిప్రాయాలని సహిస్తుంది,కొందరు ఎక్కవ్ బంప్స్ అనుభవించినప్పటికీ ప్రతి ఒక్కరూ,అనగా మనం చెడ్డ్వాళ్ళు నుకునే వాళ్ళతో సహా భగవంతుణ్ణి చేరుకోవడం తధ్యం!" అని చెప్పినది నాకు చక్కగా అర్ధమైంది.ఇంత చదివి,ఇంత వయస్సు వచ్చి,ఇంత అనుభవం సంపాదించి ఒక చ్జొన్నపిల్ల అంత చక్కగా చెప్పాక కూడా అర్ధం చేసుకోలేకపోతే నా వయస్సూ,చదువొ,అనుభవమూ వేస్ట్ - కదా!ఆ అమ్మాయి చెప్పింది చదివితే మెకు అర్ధం కావలసింది ఒకటి ఉంది - నా దృష్టిలో!ఒక తెలివైన హిందువు విగ్రహాన్ని పూజించాలా వద్దా అనేది హిందువులకి ముష్టాఖ అహ్మద్ఫ్ చెపాల్సిన పని లేదు,చెప్పినా వినడు!ఎటూ తేల్చుకోలరెని భయస్తుల్ని మోసగించహ్టానికి తప్ప మీ ప్రయత్నం మీకు తెలివైన హిఒందువు;ని మీ మతంలోకి చేర్చుకోవటానికి పని చెయ్యదు.మాకు తెలివైన వాళ్ళు అఖ్ఖర్లేదు,దద్దమ్మలు చాలు,మా సంఖ్య పెరగడమే ముఖ్యం అనుకుంటే మీ ఇష్టం - యద్భావం తద్భవతి!

    ఆ అమ్మాయి చెప్పింది చదివాక మీ చదువు,సంస్కారం,అనుభవం ఏ స్థాయిలో ఉన్నాయో మీరు చూపించండి.నేను మాత్రం ఇక్కడికి ఇక రాను.టాటా!వీడుకోలు!ఇంక శెలవు - గుడ్‌బై!!

    ReplyDelete
    Replies
      Reply
Add comment
Load more...

మీ అభిప్రాయాలు,సలహాలు,సూచనలు,సందేహాలు పంపగలరు
అందరూ చదువుకొనుటకు వీలుగా తెలుగులోనే వ్రాయవలెను.

← Newer Post Older Post → Home
Subscribe to: Post Comments (Atom)

POPULAR POSTS

  • విగ్రహారాధనను హిందూ ధర్మ శాస్త్రాలు సమర్ధిస్తున్నాయా? - M. A. Abhilash
    1 . విగ్రహారాధన ప్రాచీనమా ? లేక ఏకేశ్వరోపాసన ప్రాచీనమా ? నేడు హిందూ ధర్మం పేరిట ప్రాచూర్యం పొంది ఉన్న ధర్మం పేరు వాస్తవంలో- వైదిక...
  • "విగ్రహారాధన"ను అతి తీవ్రంగా ఖండిస్తున్న హిందూ పండితులు!
    1.మహర్షి దయానంద సరస్వతి (ఆర్య సమాజ స్థాపకులు) "రాతితో మూర్తిని జేసి మందిరమునుంచి గంధాదులతో భజింపవలయును.అను నొక్క వాక్యమైన నెక్కడ వే...
  • విగ్రహ"ఆరాధన" వలన మోక్షం సిద్ధించదు- స్వామి దయానంద!
    ఏకేశ్వరవాదం కేవలం ఒక ధార్మిక భావన మాత్రమే కాదు. అదొక మానసిక ఏకాగ్రతకు, వ్యక్తి నైతికతకు ,సామాజిక పురోభివృద్ధికి అత్యావశ్యకమైన సిద్ధాంతం క...
  • శుభవార్త: "సిలువ...బలియాగమా? కుట్రా?" పుస్తకం ఉచితంగా Download చేసుకోగలరు!!
    యేసుకు సిలువ వేయబడింది - పాత నిబంధన జంతు బలుల క్రమంలోనా? లేక యూదులచే సిలువ వేయబడుతూ వచ్చిన అనేక మండి పూర్వపు ప్రవక్తల క్రమంలోనా? ప్రధ...
  • మహానీయులపై అభాండాలకు గల కారణం ఏమిటి?
    అద్వితీయత, సర్వశ్రేష్టత, పరాత్పరత వంటి అనంతకోటి పరాకాష్ఠ గుణలక్షణాలతో అలరారే సర్వోన్నత అస్తిత్వం సర్వేశ్వరునిది. ఆయనే స్వయంగా ప్రపంచ నలుమ...
  • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స్వామి దయానంద.
    ప్రముఖ వేద పండితులు స్వామి దయానందగారు తన సత్యార్ధ ప్రకాశమనే గ్రంధములో అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ శ్రీరామచంద్రుడు అసలు మూర్తి(విగ్రహం) నే...
  • దేవుడు నరునిగా అవతరించాడా?
    ఎ ప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే ద...
  • మన ఉమ్మడి థర్మశాస్త్రాలైన గీతా-బైబిలు-ఖురాన్ గ్రంథాల ప్రకారం "యోగా వాస్తవ లక్ష్యం ఏమిటి?"
  • స్వలింగ సంపర్కం వ్యక్తిగత స్వేచ్చా?
    రచ్చబండ లో జరిగిన స్వలింగ సంపర్కం గూర్చి కొంతమంది మేధావుల అభిప్రాయాలు చదివి చాలా ఆశ్చర్యమేసింది. స్వలింగ సంపర్కాన్ని మేము సమర్ధించమంటూనే అద...
  • M.A.అభిలాష్ గారితో ముఖాముఖి: పరిశుద్ధ బైబిలు ప్రబోధనల ప్రకారం:యేసు సిలువపై మరణించ లేదు! -1 (పాప పరిహారానికి రక్తమొక్కటే ప్రత్యమ్నాయమా?)
    సర్వశక్తిగల దేవుని పేరుతో...  యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలువదు. -సామెతలు 21:30 గౌరవ నీయులైన పాఠక మిత్రులా...

Recent Comments

Blog Archive

  • ►  2021 (1)
    • ►  January (1)
  • ►  2020 (2)
    • ►  August (1)
    • ►  April (1)
  • ►  2019 (14)
    • ►  December (2)
    • ►  October (2)
    • ►  June (3)
    • ►  February (4)
    • ►  January (3)
  • ►  2018 (14)
    • ►  December (2)
    • ►  November (1)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (1)
    • ►  May (2)
    • ►  April (2)
    • ►  March (2)
    • ►  February (2)
  • ►  2017 (37)
    • ►  December (2)
    • ►  November (3)
    • ►  October (4)
    • ►  September (6)
    • ►  August (8)
    • ►  July (5)
    • ►  June (5)
    • ►  March (2)
    • ►  January (2)
  • ►  2016 (63)
    • ►  December (3)
    • ►  November (1)
    • ►  October (10)
    • ►  August (1)
    • ►  July (1)
    • ►  June (5)
    • ►  May (6)
    • ►  March (1)
    • ►  February (17)
    • ►  January (18)
  • ▼  2015 (123)
    • ►  December (12)
    • ►  November (4)
    • ►  October (8)
    • ►  September (13)
    • ►  August (7)
    • ►  July (12)
    • ►  June (7)
    • ►  May (18)
    • ►  April (6)
    • ▼  March (8)
      • హిందూ శాస్త్రుల కులతత్వాన్ని ఖండిస్తున్న హిందూ శాస...
      • ఓ దూరదర్శిని భూతదర్సిని...-MD.Sagar
      • ఉగాది : వీడికోలు-ఆహ్వానం
      • ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మసీదులు
      • ఈ ప్రశ్నలకు వాక్యం వెలుగులో సరైన సమాధానాలేమిటో తెల...
      • 2.క్రైస్తవ పండితుల అపార్ధాలు-బైబిల్ గ్రంధ యదార్ధాల...
      • వైధిక ధార్మిక గ్రంధాలలో అంతిమ రుషి ముహమ్మద్(స) ప్ర...
      • శ్రీరాముడు ఏనాడు మూర్తి (విగ్రహo) స్థాపించలేదు.-స...
    • ►  February (14)
    • ►  January (14)
  • ►  2014 (105)
    • ►  December (13)
    • ►  November (13)
    • ►  October (11)
    • ►  September (38)
    • ►  August (11)
    • ►  July (18)
    • ►  June (1)
  • ►  2013 (9)
    • ►  November (2)
    • ►  October (7)

Followers

Labels

''భారత్ మాతాకీ జై!'' ARTICLES Bible Articles BOOKS Debate Programs Editorial EVENTS SPECIAL Vedas VIDEOS వ్యక్తిత్వ వికాసం

FB Follow

Sakshyam Magazine

Supporters



Follow by Email

Copyright © Sakshyam Magazine | Designed by Jayati Creative